-కేసీఆర్ మతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకొని వారి యొక్క సమగ్రమైన అభివృద్ధికి కోసం పాటుపడుతుంటే..బిజెపి మాత్రం వారిని భయబ్రాంతులకు గురి చేస్తూ .. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తుంది
– గంగా జమునల తహజీబ్‌కు కేంద్రమైన హైద్రాబాద్ భాగ్యనగరం నడి బొడ్డున, సామరస్యంతో జీవిస్తున్న మనుషుల నడుమ, మత చిచ్చును రగిలించే కుట్రలు బిజెపి చేస్తుంది
– బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్
విభిన్న మతాలు , భాషలు , రాష్ట్రాల ప్రజలు కలిసి జీవించే తెలంగాణలో గంగా జమునల తహజీబ్ సంస్కృతి శతాబ్దాలుగా విలసిల్లుతోందని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలోనే అత్యంత అద్భుతంగా అభివృద్ధి పధకంలో ముందుకు సాగుతోందని దాసోజు శ్రవణ్ అన్నారు
హైదరాబాద్, ఏప్రిల్ 9 : బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రమంతటా జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలలో భాగంగా ఈరోజు ఓల్డ్ సిటీ లో హోమ్ మినిస్టర్ ముహమ్మద్ అలీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎండీ అజామ్ అలీ, శ్రీకాంత్ , రామన్న తదితరులు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం లో హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. మతాలకతీతంగా కవుల సృజనకు జీ హుజూర్ అన్నది మన హైద్రాబాదీ గడ్డ. ఈ గడ్డపైన కవ్వాలి శతకాలు కీర్తనలు ఏకరూపంలో వొకే వేదిక మీద వొలికిన స్వరఝరీ భాగ్యనగరి. దక్కనీ ఆత్మకు ఏకాత్మ మన హైద్రాబాద్. భాగమతీ కాలి అందెల రవళిలో తన్మయించిన ఈ సజీవ సంస్కృతిని భగ్నం చేయడానికి బిజెపి కుట్రలు చేస్తుందని దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
విభిన్న మతాలు , భాషలు , రాష్ట్రాల ప్రజలు కలిసి జీవించే తెలంగాణలో గంగా జమునల తహజీబ్ సంస్కృతి శతాబ్దాలుగా విలసిల్లుతుంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలోనే అత్యంత అద్భుతంగా అభివృద్ధి పధకంలో ముందుకు సాగుతుంది. కేసీఆర్ మైనార్టీలను అక్కున చేర్చుకొని వారి యొక్క సమగ్రమైన అభివృద్ధికి కోసం పాటుపడుతుంటే..బిజెపి మాత్రం వారిని భయబ్రాంతులకు గురి చేస్తూ .. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టాలని చేస్తుందంటూ శ్రవణ్ మండిపడ్డారు. గంగా జమునల తహజీబ్‌కు కేంద్రమైన హైద్రాబాద్ భాగ్యనగరం నడి బొడ్డున, సామరస్యంతో జీవిస్తున్న మనుషుల నడుమ, మత చిచ్చును రగిలించి , కేసీఆర్ ని దెబ్బ తియ్యాలనే లక్ష్యం తో బిజెపి మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తుంది. ప్రజలంతా జాగరూకులై ఈ బిజెపి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు.
మరో ఏడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో బిజెపి , కాంగ్రెస్ పార్టీల దగ్గరి నుండి చిన్న పార్టీల ఇలా అన్ని కూడా కేసీఆర్ ఫై , బిఆర్ఎస్ ప్రభుత్వం ఫై విమర్శలు , అసత్య ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. అలాంటి తప్పుడు ప్రచారాలను ఎండగడుతూ ప్రజలకు వాస్తవాలను తేలేందుకు , అలాగే మనలోని కష్టసుఖఃలను పంచుకునేందుకు ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు చేపట్టుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో చాలామంది టిఆర్ఎస్ కండువా కప్పుకున్న వారిని హేళన చేశారు. తెలంగాణ వస్తదా ..చస్తదా..కేసీఆర్ తెస్తాడా..పోతాడా అని చాలామంది అవహేళన చేసిన పరిస్థితి . ఆ తర్వాత తెలంగాణ వస్తదని అర్థమైన తర్వాత తెలంగాణ వస్తే పరిశ్రమలు పోతాయి..పెట్టుబడులు రావు..కరెంట్ ఉండదు ..పరిపాలన చేతకాదు..అభివృద్ధి ఉండదు..తెలంగాణ ప్రజలు వలస వెళ్లి పోవాల్సిందే అంటూ తప్పుడు ప్రచారం చేసారు. కానీ ఈరోజు భారతదేశానికి తెలంగాణ తలమానికంగా ఉంది.
2013 – 14 లో తెలంగాణ వచ్చిన సమయంలో 50 వేల కోట్ల ఉన్న బడ్జెట్..ఈరోజు మూడు లక్షల కోట్లకు కేసీఆర్ తీసుకొచ్చారు. సంపద సృషించే వాడే నాయకుడు..ఆ సంపద ను అన్ని వర్గాల ప్రజలకు అందించే వాడే మహా నాయకుడు. ఆ మహానాయకుడే కేసీఆర్. దేశంలో ఎక్కడ లేని విధంగా రూ.500 ఉన్న పెన్షన్ ను రూ.2000 లు చేసిన మనసున్న నాయకుడు మన కేసీఆర్ గారు. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ , షాదీ ముబారక్, మన ఊరు – మన బడి , రైతుబంధు , దళిత బంధు , బస్తి దవాఖాన ఇలా ఎన్నో పధకాల ద్వారా తెలంగాణ ప్రజల్లో వెలుగు నింపుతున్న నాయకుడు కేసీఆర్. తెలంగాణ ఖజానాను దోచుకుపోవాలని ఈరోజు తెలంగాణలో బీజేపీ పాగా వేయాలని చూస్తున్నారు. అలాంటి వారికీ సరైన జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అసత్యప్రచారాలు , మతపరమైన విద్వేషాలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసైనా సరే ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తుండ్రు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసైనా సరే ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూసారు.
అక్కడితో ఆగకుండా పేపర్ లీకేజ్ తో కేసీఆర్ ప్రభుత్వం ఫై బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. TSPSC పేపర్ లీకేజ్ కి పాల్పడి నిరుద్యోగుల భవిష్యత్ ను దెబ్బతీసేలా చేసారు. రాజశేఖర్ అనే బిజెపి కార్యకర్త తో పేపర్ లీకేజ్ చేసి…ఈరోజు కేటీఆర్ ఫై , కేసీఆర్ ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. పదో తరగతి తెలుగు , హిందీ పేపర్లు సైతం లీక్ చేసి నీచరాజకీయాలకు తెరలేపారు. ఇలా నీచ రాజకీయాలు చేస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. అలాంటి బిజెపి పార్టీ కి జవాబు చెప్పాల్సిన అవసరం మనపై ఉంది. కేసీఆర్ ని మూడోసారి గెలిపించుకోవాలంటే ..కేసీఆర్ పధకాల లబ్ది పొందివాళ్ళందరూ ఈ ఏడు నెలల్లో రోజు ఓ అరగంట సమయం మనం కేసీఆర్ తీసుకొచ్చిన పధకాల గురించి , చేసిన అభివృద్ధి గురించి..మరోసారి కేసీఆర్ ని గెలిపిస్తే జరగబోయే అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజెప్పాలని దాసోజు శ్రవణ్ కోరారు. అంతకు ముందు అంబర్ పేట్ లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్నా యకత్వంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ , కిషర్ గౌడ్ , భూపతి లక్ష్మణ్ , రాంబాబు తదితరులు పాల్గొన్నారు.