Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసిన మంచి పనులను ఈ ముఖ్యమంత్రి ముందుకు తీసుకువెళ్లాలన్నారు. గత ప్రభుత్వం చేసిన పనులను ముందుకు తీసుకువెళ్లకుండా నిధులు వృథా చేయడం ద్వారా రేవంత్ రెడ్డి నిందితుడు అయ్యారని విమర్శించారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని, కాబట్టి ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ రేస్‌పై రేవంత్ రెడ్డి తీరు వల్ల, తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని ఫిర్యాదు చేసినట్లు ప్రవీణ్ కుమార్ చెప్పారు.

LEAVE A RESPONSE