– పజ్జన్న ఇంటికి కేటీఆర్, తలసాని, వద్దిరాజు
సికింద్రాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావుతో కలిసి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పరామర్శించారు. ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లిన ఆయన అస్వస్థతకు గురై చికిత్స అనంతరం హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపాన ఉన్న గౌడ్ నివాసానికి వెళ్లి ఆయన్ను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,వీ.శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,మాజీ ఎంపీ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ సలీం తదితర ప్రముఖులు పద్మారావును పరామర్శించారు.