– ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగుడాలో కాల్పులు కలకలం
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణంగుడాలో కాల్పులు కలకలం రేపాయి. కర్ణంగుడా గ్రామ సమీపంలో సెటిల్మెంట్‌కు పిలిచి రఘు, శ్రీనివాస్ అనే ఇద్దరు రియల్టర్ల పైన సుపారీ గ్యాంగ్ కాల్పులు జరిపింది. స్పాట్‌లోనే శ్రీనివాస్ మృతి చెందగా.. రఘు తీవ్ర గాయాలపాలయ్యాడు. రియల్టర్లకు చెందిన స్కార్పియో వాహనంపై సైతం రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రఘుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సెటిల్మెంట్‌కి పిలిచి కాల్పులు జరిపినట్టు రఘు తెలిపారు. ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి రఘు వెళ్లినట్టు తెలుస్తోంది. సుపారీ గ్యాంగ్ కాల్పులు జరిపింది. సీసీ కెమెరాలు, కాల్ డేటా ఆధారంగా పోలీస్ విచారణ కొనసాగుతోంది.