Suryaa.co.in

Andhra Pradesh

వాలంటీర్లు చేస్తున్న బీసీ కులగణనకు విశ్వసనీయత..చట్టబద్ధత ఉంటుందని జగన్ రెడ్డి చెప్పగలడా?

• బీసీ లను వంచించడానికే జగన్ రెడ్డి వాలంటీర్లతో బీసీ కులగణన
• కులగణన పేరుతో ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించి, ఎన్నికల వేళ వారిన భయపెట్టి లబ్ధిపొందాలన్నదే జగన్ కపట ఆలోచన

• వాలంటీర్లు చేస్తున్న బీసీ కులగణనకు విశ్వసనీయత..చట్టబద్ధత ఉంటుందని జగన్ రెడ్డి చెప్పగలడా?
• కేవలం బీసీల్ని మరోసారి వంచించి ఎన్నికల్లో లబ్ధిపొందడానికే హడావుడిగా కేంద్రంతో సంప్రదించకుండా కులగణనకు శ్రీకారం చుట్టాడు
• బీసీలకు రాజ్యాంగపరంగా స్థానికసంస్థల్లో దక్కాల్సిన 16వేలకు పైగా పదవులు దక్కుండా చేసిన జగన్ రెడ్డి కులగణనతో వెనుకవడిన వర్గాలను ఉద్ధరిస్తాడా?
• దేశంలోని నాయకులంతా బీసీ కులగణనపై స్పందించినా జగన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు
• సొంతపార్టీ ఎంపీలతో ఎప్పుడూ పార్లమెంట్లో బీసీ కులగణనపై మాట్లాడించింది లేదు
• బీసీలు జగన్ రెడ్డిని నమ్మి మోసపోవద్దని, టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే బీసీలకు న్యాయం జరిగేలా బీసీ కులగణన జరుగుతుందని తెలియచేస్తున్నాం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

జగన్ రెడ్డి మరోసారి బలహీనవర్గాలను మోసగించడానికి కొత్త కుయుక్తులు పన్నుతున్నాడని, నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండి ఏనాడూ బీసీ కులగణన గురించి పట్టించుకోకుండా, బీసీలపై దారుణంగా ప్రవర్తించిన ముఖ్యమంత్రి నేడు ఎన్నికల ముంగిట బీసీ కులగణన చేయించడానికి సిద్ధమవ్వడం పలు అనుమానాలు కలిగిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీసీ కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ ప్రతిపాదనను కేంద్రప్రభుత్వానికి పంపారు. బీసీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి, మొత్తం బడ్జెట్లో 26శాతం నిదులు బీసీల సంక్షేమానికి వెచ్చించాలని కోరారు

“ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే బీసీల కులగణనపై అసెంబ్లీ లో తీర్మానం చేసి, కేంద్రప్రభుత్వానికి ఆ ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఎస్సీఎస్టీలకు సబ్ ప్లాన్ ఏర్పాటుచేసినట్టే, బీసీలకు కూడా సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి, దానికి చట్టబద్ధత కల్పించాలని కూడా అప్పుడు చంద్రబాబు కేంద్రప్రభుత్వాన్ని కోరారు. కేంద్రబడ్జెట్లో కనీసం 26శాతం నిధులు బీసీల సంక్షేమానికి వెచ్చించాలని, బీసీకమిషన్ కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలుచేయాలని చంద్రబాబు కోరారు.

ఆనాడు రాష్ట్రముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన విజ్ఞప్తులపై బీసీ కులగణనపై పరిశీలన చేస్తామని, కేంద్రప్రభుత్వం నాటి రాష్ట్రప్రభుత్వానికి చెప్పింది. కేంద్రప్రభుత్వంలోని మంత్రులతో పాటు, వివిధ పార్టీల జాతీయ నాయకులు లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేశ్ యాదవ్, శ్రీమతి మాయావతి వంటివారు స్పందించారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు న్యాయం జరగాలని గట్టిగా చెప్పారు. ఆ సమయంలో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ రెడ్డి మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడలేదు. కనీసం బీసీ కులగణనపై తన అభిప్రాయం వెల్లడిస్తూ ఆనాడు కేంద్రప్రభుత్వానికి లేఖ కూడా రాయలేదు.

ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి ఏనాడూ బీసీ కులగణనపై ప్రధానమంత్రికి కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేదు
జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎప్పడూ బీసీ కులగణన, వారికి అందించాల్సిన సాయంపై గతంలో చంద్రబాబు చేసిన ప్రతిపాదనలపై ఏనాడూ కేంద్రంతో మాట్లాడింది లేదు. 5ఏళ్లలో ఎప్పుడూ పార్లమెంట్లో తన పార్టీ ఎంపీలతో బీసీల కులగణన గురించి జగన్ రెడ్డి మాట్లాడించింది లేదు. ముఖ్యమంత్రి హోదా లో ఏనాడూ కనీసం ప్రధానమంత్రికి ఒక వినతిపత్రం కూడా ఇచ్చిందిలేదు.

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయ్యాక నాలుగున్నరేళ్లపాటు బీసీల గురించి పట్టించుకోని జగన్ రెడ్డి, ఇప్పుడు హడావుడిగా తన పార్టీ వ్యవస్థతో చేయిస్తున్న బీసీ కులగణన కేవలం కంటితుడుపు చర్యే
ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు బీసీ కులగణన గురించి పట్టించుకోని జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక నాలుగున్నరేళ్లపాటు ఆ ఊసే ఎత్తని జగన్ రెడ్డి, ఇప్పుడు హడావుడిగా జీవోలు ఇచ్చి రాష్ట్రంలో కులగణన చేపట్టడం కేవలం కంటి తుడుపు చర్యగానే భావించాలి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులతో చేయించాల్సిన కులగణను తన పార్టీ కార్యకర్తలైన వాలంటీర్లతో చేయిండం చూస్తేనే జగన్ రెడ్డి కులగణనపై ఎంత చిత్తశుద్ధితో ఉన్నాడో అర్థమవుతోంది. కులగణన పేరుతో ప్రజల వ్యక్తిగత వివరాలు వాలంటీర్లు ఎందుకు సేకరిస్తున్నారో ముఖ్యమంత్రి చెప్పాలి.

ఆఖరికి ప్రజల వేలిముద్రలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, రేషన్ కార్డు నంబర్..ఇంటినంబర్లు, ఆఖరికి మరుగుదొడ్ల సమాచారం ఎందుకు సేకరిస్తు న్నారు. ఆఖరికి ఏ పార్టీకి ఓటేస్తారనే ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారు? ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం తనచేతిలో పెట్టుకొని రేపు ఎన్నికల వేళ వారిని బ్లాక్ మెయిల్ చేయాలన్నదే జగన్ రెడ్డి ఆలోచన. జగన్ రెడ్డి గొప్పలు చెప్పుకునే వాలంటీర్లు ఇప్పటికే ప్రజలకు తెలియకుండా వారి ఆస్తులు, పొలాలు కాజేసే స్థితికి వచ్చారు. వేలిముద్రలు తీసుకొని బ్యాంకుల్లోని సొమ్ముని కాజేశారనే వార్తలు ఎన్నోచూశాం. ఇలాంటి పనులు ఎన్నిచేసినా జగన్ రెడ్డి వాలంటీర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

వాలంటీర్లు చేస్తున్న బీసీ కులగణనపై టీడీపీకి విశ్వసనీయత లేదు
వాలంటీర్లతో జగన్ రెడ్డి చేయిస్తున్న బీసీ కులగణ నపై టీడీపీకి విశ్వసనీయత లేదు. కేవలం బలహీనవర్గాలను మోసగించడానికే జగన్ రెడ్డి మొక్కుబడిగా రాష్ట్రంలో కులగణన చేయిస్తున్నాడు. కులగణన ముసుగులో బీసీలను భయపెట్టి, వారి ఓట్లు దండుకోవడానికి వాలంటీర్ వ్యవస్థను, సొంతపార్టీ నేతల్ని వాడుకోవాలని చూస్తున్నాడు. వైసీపీప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీ కులగణన చేయడంలేదు.

కేంద్రప్రభుత్వం కూడా బీసీ కులగణనపై వెంటనే దృష్టిపెట్టాలి
కేంద్రప్రభుత్వం తక్షణమే బీసీ కులగణనపై దృష్టి పెట్టాలని కోరుతున్నాం. కాకా ఖాలేల్కర్ కమిషన్ బీసీ కులగణన జరగాలని 1961లోనే చెప్పింది. తర్వాత 1978లో ఏర్పడిన మండల కమిషన్ కూడా బీసీల కులగణన చేస్తేనే, వెనుకబడి న వర్గాలకు సరైన అభివృద్ధి, సంక్షేమం అందించడం సాధ్యమవుతుందని తేల్చిం ది. 2018 ఆగస్ట్ 31 నాటి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పా టైన కేంద్రప్రభుత్వ కమిటీ బీసీ కులగణన చేపట్టాలని నిర్ణయించింది. 2019లో ఆ దిశగా కేంద్రప్రభుత్వం జస్టిస్ రోహిణి నేత్రత్వంలో కమిషన్ ఏర్పాటుచేసింది. వీటన్నింటిపై కేంద్రప్రభుత్వం దృష్టిపెట్టి, వెనుకబడిన వర్గాలకు ఎలా న్యాయం చేయాలో ఆలోచించాలి.

వాలంటీర్లు చేస్తున్నకులగణనకు విశ్వసనీయత..చట్టబద్ధత ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పగలడా?
మొన్నటికి మొన్న బీహార్ ప్రభుత్వం బీసీ కులగణనపై చేపట్టిన సర్వే లోపభూ యిష్టంగా ఉందని న్యాయస్థానాలు అడ్డుకున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా జగన్ రెడ్డి బీసీలను నమ్మించి మోసగించాలనే మరోసారి తూతూమంత్రంగా కులగణన కు శ్రీకారం చుట్టాడు. వాలంటీర్లతో చేయించే కులగణనకు చట్టబద్ధత విశ్వసనీయత ఉంటాయా అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. కేవలం 60 రోజుల్లో మొత్తం కులగణన చేయడం.. ఆ వివరాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించాక.. మొత్తం ముద్రించి అందుబాటులో ఉంచాలి. ఆ పనులన్నీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు.

ఇంతసమయంలో పూర్తి చేస్తామని కచ్చితంగా వెనుకబడిన వర్గాలకు న్యాయంచేస్తామని హామీ ఇచ్చే స్థితిలో జగన్ రెడ్డి , అతని ప్రభుత్వం లేదు. బీసీ కార్పొరేషన్లు నియమించి బీసీలను ఉద్ధిరించానని చెప్పినట్టే ఉంటుంది…ఇప్పుడు జగన్ చేయిస్తున్న బీసీ కులగణన కూడా! ఆఖరి కి బీసీల సంక్షేమానికి, వారి అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కేటాయించిన నిధులకు తోడు, రాష్ట్రప్రభుత్వ వాటాగా కేటాయించాల్సిన నిధులు కూడా జగన్ రెడ్డి ఇవ్వక పోవడంతో కేంద్రపథకాలు రాష్ట్రంలోని బీసీలకు అందకుండా పోయింది నిజం కాదా?

స్థానికసంస్థల్లో బీసీలకు ఉన్న 34శాతం రిజర్వేషన్లను 24శాతానికి కోత పెట్టింది ఈ ముఖ్యమంత్రి కాదా? స్థానిక సంస్థల్లో బీసీలకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన 16వేలకు పైగా పదవుల్ని వారికి దక్కకుండా చేసింది ఈ జగన్ రెడ్డి కాదా? బీసీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు లేకుండాచేసింది ఈ పెద్ద మనిషి కాదా? బీసీ యువతకు విదేశీ విద్య పథకం లేకుండా చేసింది ఈయన కాదా?

తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం ఏర్పడగానే బీసీ కులగణనపై దృష్టిపెట్టి కచ్చితత్వంతో కూడిన సమాచారం సేకరించి వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తుంది
తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం రాగానే బీసీ కులగణనపై దృష్టి పెడుతుంది. పకడ్బందీగా, కచ్చితత్వంతో కూడిన సమాచారంతో కులగణన పూర్తిచేస్తుంది. కేంద్రప్రభుత్వం నుంచి న్యాయంగా బీసీలకు రావాల్సిన అన్ని పథకాలు వచ్చేలా చేస్తుంది. కులగణన పేరుతో జగన్ రెడ్డి, వైసీపీనేతలు చెబుతున్న మాయమాట లు నమ్మవద్దని బీసీసోదరుల్ని కోరుతున్నాను. సొంతపార్టీ నేతలు… ఆఖరికి మంత్రులుగా ఉన్నవారే జగన్ రెడ్డిని నమ్మడంలేదని తెలుసుకోండి. బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేసేది..ఎప్పటికైనా వారిని ఆదుకునేది చంద్రబాబే నని బీసీలు గ్రహించాలి. వచ్చే ఎన్నికల్లో బీసీలంతా ఏకతాటిపై నిలిచి, వారి సత్తా ఏమిటో జగన్ రెడ్డికి చూపించాలి.

విలేకరుల ప్రశ్నలకు రవీంద్ర స్పందన…
జాతీయ సర్వేలు.. రాష్ట్ర ప్రజలు.. పరిణామాలు టీడీపీ-జనసేన కూటమి వైపు మొగ్గడంతో మరలా ఏదోరకంగా అధికారంలోకి రావాలని జగన్ రెడ్డి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఆ క్రమంలోనే మరలా ఢిల్లీ వెళ్లి కేంద్రపెద్దల చుట్టూ తిరుగుతున్నాడు. సీట్ల కేటాయింపులో టీడీపీ-జనసేన పార్టీల తొలిప్రాధాన్యత బీసీలకే ఉంటుంది.” అని రవీంద్ర ఆశాభా వం వ్యక్తం చేశారు

LEAVE A RESPONSE