– ఆరు నెలల్లో రెండుసార్లు విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే
– జన సేవాదళ్ ముగింపు సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ
– జన సేవాదళ్ రెడ్ షర్ట్ వాలంటీర్స్ శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా కవాతు నిర్వహించిన ఎర్రదండు,శత వసంతాల సూచికగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 100 మీటర్ల సిపిఐ జెండా
నందిగామ: తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోలకి ఇచ్చే ప్రాధాన్యత రైతులకు లేకుండా పోయిందని సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు సిపిఐ శతజయంతి ప్రారంభ ఉత్సవాలలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా నందిగామ అయ్యదేవర కాళేశ్వరరావు ప్రాంగణంలో నిర్వహించిన రెడ్ షర్ట్ వాలంటీర్ జన సేవాదళ్ శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా నందిగామ గాంధీ సెంటర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలో సినీ హీరోలకు ఇచ్చిన ప్రాధాన్యత రైతులకు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి సినిమాలు తీసి వారి లాబా పేక్ష కొరకు చేసే పనులకు ప్రభుత్వాలు అడ్డగోలుగా సపోర్ట్ చేయటం ఏంటని ప్రశ్నించారు ఓ ధియేటర్లో తొక్కిసలాటలో ఆడపడుచు మృతి చెందగా, ఆమె కుమారుడు ప్రస్తుతం కోమా లో ఉన్నారని, ఆ కుమారుడు లేచి నా తల్లి ఎక్కడ అంటే ఏ రాజకీయ పార్టీ అయినా తీసుకురాగలదు అని ప్రశ్నించారు.
ఓ బిజెపి మంత్రి ఒక్కసారైనా బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా ప్రభుత్వం దే తప్పు అని ప్రగల్బాలు పలుకుతున్నారు అటువంటి మంత్రులకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు రైతులు పంటలు పండక అరా కొరగా పండిన పంటలకు కనీస సౌకర్యాలు కల్పించని ప్రభుత్వాలు ఒకవేళ వ్యయ ప్రయాసలు పడి పండించిన పంటలకు గిట్టుబాటు లేక నాన ఇబ్బందులు పడుతుంటే వారిని పట్టించుకోలేని ప్రభుత్వాలు అడ్డగోలుగా సినిమా హీరోలకు ఊడిగం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిపిఐ శతజయంతి ఉత్సవాలు ప్రారంభ కార్యక్రమం కామ్రేడ్ సూర్యదేవర నాగేశ్వరరావు పుట్టిన గడ్డపై నిర్వహించటం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఘనమైన విజయం సాధించింది. కానీ ప్రజలపై భారం మోపటం ఆపలేదని అన్నారు గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు అంటూ అధికారం చేపట్టిన ఆరు నెలల్లో రెండుసార్లు విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
ఆరు నెలల్లో 6000 కోట్లు ఒకసారి 9000 కోట్లు మరోసారి ప్రజలపై కరెంటు చార్జీల రూపంలో 15 వేలకు పట్ల రూపాయల భారం మోపిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చెబుతుందని ప్రశ్నించారు.
శత జయంతి ఉత్సవాలలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.