జైభీం సినిమా అవార్డుకు అర్హత లేదా?
దొపిడీదారుల పాత్రలకు అవార్డులిస్తారా?
ఎర్రచందనం స్మగ్లర్లకు ఇది అంకితమా?
జైభీం సినిమాను జ్యూరీ సభ్యులు చూశారా?
బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ
జాతీయ అవార్డ్స్ నుంచి ఆస్కార్ వరకు న్యాయం అనేది లేనప్పుడు ఈ అవార్డ్స్ ఇవ్వటం ఎందుకు అని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ప్రశ్నించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమిళనాడులో “ఇరుల” అనే కులం వారినే ఆంధ్ర ,తెలంగాణ లలో ఎరుకలవారు అంటారు.
జైభీమ్ సినిమాలో వాస్తవ సంఘటనలో వున్న బాధితురాలు,ఆ వర్గం వారు అందరూ నిజ జీవితంలో దళితులే… అది వేరే విషయం అనుకోండి..కానీ సినిమాలో మాత్రం పాత్రల పరంగా ఎరుకలవారుగా చూపారు ఈ సినిమా దర్శకుడు..ఒక న్యాయవాది ఒక ఆటవిక మహిళా కోసం చేసే పోరాటమే “జై భీం” సినిమా..!!
ఈ మూవీ లో నటించిన సూర్య నటన అద్భుతం.. హీరో సూర్య తో పాటు మహిళ పాత్రలో నటించిన లిజోమోల్ జోస్ పడిన కష్టం అంత ఇంత కాదు..ఆ అమ్మాయి ఈ పాత్ర కోసం ఈ “ఇరుల” కుల ఆదివాసీలతో కలిసి కొంతకాలం ఆమె జీవించింది… వారి ఆహారపు అలవాట్లు కూడా ఓన్ చేసుకుంది అంటే ఆమె ఆ పాత్రలో ఎంత ఇన్వాల్వ్ అయ్యిందో చెప్పక్కరలేదు.
హీరో సూర్య ఈ “జై భీం” సినిమాలో వేసిన పాత్ర అంబేద్కర్ దారిలో నడుస్తూ దళిత,గిరిజన, బడుగు ,బలహీన వర్గాలు హక్కులు కోసం పోరాడిన బ్రాహ్మణ కులానికి చెందిన గొప్ప మానవతావాది, తమిళ సామాజిక హక్కుల పోరాటాయోధుడు,ప్రముఖ న్యాయవాది అయిన “చంద్రు” గారి నిజ జీవిత పాత్ర అది..!!
పుష్ప సినిమాలో ఎర్రచందనం దొంగతనం చేసి జాతి సంపదను అమ్మే అతను జాతీయ హీరో.. ఇది హాలీవుడ్ వెబ్ సిరీస్ “నార్కోస్” కాపీ.. మన్షుర్ అలీ ఖాన్ “కెప్టెన్ ప్రభాకర్”, షోలే గబ్బర్ సింగ్, కిల్లర్ వీరప్పన్ సినిమాల్లో నటించిన నటన కాపీ తో పాటు శ్రీహరి డ్యూయల్ రోల్ చేసిన “పృద్వి నారాయణ” అనే మూవీ లో జబ్బ జారిపోయిన పాత్ర నటించాడు. ఈ పాత్రలన్నింటిని కూడా ప్రేరణగా తీసుకుని అల్లు అర్జున్ పాత్రను ఈ సినిమాలో దర్శకుడు మలిచాడు అని స్పష్టంగా తెలుస్తుంది.
ఎర్రచందనం దొంగతనం చేసి అమ్మిన హీరో/దొంగ పాత్రల కు,సినిమాకు జాతీయ అవార్డులు ఇవ్వడం ఏంటి. కేంద్ర ప్రభుత్వం, అవార్డ్స్ జ్యూరి కమిటీ దేశ ప్రజలకు ఏమి సందేశం ఇస్తుంది, జాతి సంపదను దోచేవారిని, ఆర్ధిక నేరగాళ్లని, రేపులు చేసేవారిని,రౌడీలు,గూండాల్ని పోలీసులకు వ్యతిరేకంగా ప్రోత్సహించమని ఈ మోడీ ప్రభుత్వం ఈ విదంగా తెలితజేస్తుందా.. ఇవేనా ఈ దేశ ప్రజలకిచ్చే సందేశాత్మక చిత్రాలు?
వాటిని స్వయంగా మోడీ ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందా… చాలా దారుణం అని శ్రీధర్ వాపోయారు. దళిత సామాజిక హక్కులు,న్యాయం కోసం పోరాడిన,సినిమా ద్వారా నవ నాగరిక సమాజంలో ప్రజా సామాజిక,న్యాయ చైతన్యం తెచ్చే సినిమాలకు జాతీయ అవార్డులు ఇవ్వరా…? అవార్డుల్లో కూడా దళితుల పట్ల వివక్ష చూపించిన కేంద్ర ప్రభుత్వం… సినిమాల్లో మహిళలను అంగాంగ, అర్ధనగ్న ప్రదర్శనలు చేయించే అశ్లీల సినిమాలకు జాతీయ స్థాయిలో అవార్డులా…?
ఇదేనా మోడీ ప్రభుత్వ నైతికత, ఇలాంటి దొంగ పాత్రల సినిమాకి జాతీయ స్థాయిలో ఈ మోడీ కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చినందుకు తెలుగు వాడిగా గర్వపడాలో బాధపడాలో తెలియటం లేదు..ఈ దేశంలో న్యాయం అనేది అసులువుందా…అని శ్రీధర్ ప్రశ్నించారు.
ప్రశ్నించడం నేర్పే వారికి, దళితులకు సహయం చేసేవారికి ఈ దేశంలో అవార్డులు ఉండవని, ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం తీరు మారాలని,లేనిపక్షంలో ప్రజలే బుద్ధి చెప్తారని శ్రీధర్ హెచ్చరించారు.