కరిగిపోయే నిశి ..మెరిసిపోయే శశి

చంద్రకిరణాల జల్లులో .. తడిసి మురిసేటి మనసులో .. పున్నమై మెరిసిందిలే యామినీ .. వెన్నెలై కురిసిందిలే ఆమనీ .. వేసంగి హృదయాలలో .. సంపంగి సౌరభం నిండే .. ఆ నింగి లోని హరివిల్లులో .. సప్తవర్ణాల సొగసు కనువిందే .. నడిఝాము మేఘాలలో .. చిరుగాలి పెత్తనమేమిటో చల్లని రేయిలో పలకరింపుల పరవశాలు పరచేటి హాయిలో కరిగిపోయే నిశి ..మెరిసిపోయే శశి . – రాధిక ఆండ్ర

Read More

భువి తొడిగే పచ్చదనం ..ఉదయాల వెచ్చదనం .

కూసింది కోయిలమ్మ ..పూసింది పూలరెమ్మ ఝల్లు మనే చల్లని పవనం .. ఆపైన లేలేత రవికిరణం .. భువి తొడిగే పచ్చదనం .. ఉదయాల వెచ్చదనం .. హృదయంలోనే జరిగే సూర్యోదయం .. హరిత వనముల వెంట తుమ్మెదల ఝుంకారం .. లలిత కుసుమాల మధువులే కోరి ఆ ఆరాటం .. చిరుచిరు నగవులే చిందే ఆనందం .. తామస హరణం తదుపరి వెలుగుల బంధం మధురోహలతో మరురోజుకి స్వాగతం – రాధిక ఆండ్ర

Read More

అందం..ఆనందం..ఆత్మానందమే

నువ్వంటే.. అందం అనుకున్నా.. అది నా హృదయ సౌందర్యమే.. అని తెలుసుకోలేకపోయా! నువ్వుంటే.. ఆనందం అనుకున్నా.. అది నా ఆత్మానందమే.. అని తెలుసుకోలేకపోయా! నీతోటే.. అనుబంధం అనుకున్నా.. అది నా ఋణానుబంధమే.. అని తెలుసుకోలేకపోయా! ఋణానుబంధ రూపేణా పశు,పత్ని,సుతాలయాత్! ఇవన్నీ తీరిపోయే.. ఋణానుబంధాలే! కాబట్టి.. వ్యామోహం పెంచుకోకుండా.. తిరిగి ఆశించకుండా.. నిష్కల్మషమైన.. మన ప్రేమను మాత్రమే పంచుదాం! తామరాకు మీద నీటిబొట్టు లాగా! ఆత్మ లేని శరీరానికి అసలు  విలువే లేదు!

Read More

ఓ అపర కుబేర మిత్రమా..

నీ చుట్టూ ఉన్న.. అమాయకులను తొక్కేసి.. డబ్బు సంపాదించడం తెలివి కానే కాదు! ఆ అమాయకులను కాపాడుతూ.. బాగు పరుస్తూ.. వారితో పాటుగా నువ్వు కూడా ఎదగడం మాత్రమే.. నిజమైన తెలివి అనిపించుకుంటుంది! ఆత్మవిశ్వాసం ఉన్నవాడు మాత్రమే.. అలా ధైర్యంగా,మనశ్శాంతితో బ్రతుకుతాడు! అభద్రతాభావంతో.. ఉన్నవాడు మాత్రమే.. ప్రజలను దోచుకుని బ్రతుకుతాడు! అలాంటి మానసిక రోగాలు ఉన్నవారికి.. పాలించే అధికారం,హక్కు రెండూ లేనే లేవు!

Read More

ఆత్మానందం

నీ కళ్ళు నిన్ను మోసం చేయొచ్చు.. మేకప్ ని కూడా అద్భుత సౌందర్యలాగా చూపించవచ్చు! నీ చెవులు నిన్ను మోసం చేయొచ్చు.. పచ్చి అబద్ధాల్ని కూడా.. పచ్చి నిజాలుగా వినిపించవచ్చు! నీ మనసు నిన్ను మోసం చేయొచ్చు.. నమ్మక ద్రోహాలను సైతం.. పవిత్ర ప్రేమలుగా.. భ్రమింప చేయవచ్చు.. మీ ఆత్మ మాత్రం.. ఎప్పటికీ.. నిన్ను మోసం చేయదు! ఎల్లప్పుడూ.. నీకు మంచి మార్గం.. చూపిస్తూనే ఉంటుంది! అందుకే.. ఆత్మ మాట విన్నవాళ్ళు మాత్రమే.. ఆత్మానందాన్ని పొందుతారు!!

Read More

నే చేరుతున్న గమ్యం నీ స్నేహమే ..

నీ అడుగు నాదై సాగదా పయనమే అణువణువు ప్రేమై చేరదా పరవశమే నే చేరలేని దూరం దూరమే .. నే చేరుతున్న గమ్యం నీ స్నేహమే .. కొమ్మల్లో ఆమని కోయిలా .. రేయంతా కురిసేటి ఆ వెన్నెలా .. నువు చూపించావు ఈ జగమిలా నేనెన్నడూ చూడలేదే ఇలా .. శశికిరణాల తడిసిన ఈ పుడమిలా నా మది మురిసింది పున్నమి వెలుగులా ఈ మాయ చేసింది నువ్వే కదా .. ఎదలో ఆశ తెలిపింది…

Read More

గాజుల గలగల .. కాలిమువ్వల సవ్వడి ..నొసటి సింధూరం

నీ గాజుల గలగలలో వినసొంపైన సంగీతం ఉంది అర్థం చేసుకుంటే, నీ కాలిమువ్వల సవ్వడిలో గృహలక్షి గా నీ ఆధిపత్యం ఏంటో తెలుస్తోంది అర్థం చేసుకుంటే, నీ నొసటి సింధూరం లో నా యోగక్షేమాలు కనిపిస్తున్నాయి అర్థం చేసుకుంటే, నీ మెడలో మెరిసే సౌభాగ్యం నా పనుల ఆటంకాలను తీరుస్తుంది అర్థం చేసుకుంటే, నీ కాలిమెట్టెల నిండుదనం నీవు వివాహం అయిన మహిళవి అని చెప్పకనే చెబుతున్నాయి అర్థం చేసుకుంటే, వివాహానికి ఉన్న గొప్పదనం ఏంటో తెలుసా…

Read More

మనిషి మనసుకు ఎందుకు ఇంత కన్నీరు ?

మనిషి మనసుకు ఎందుకు ఇంత ఆవేదన మనిషి మనసుకు ఎందుకు ఇంత ఆరాటం మనిషి మనసుకు ఎందుకు ఇంత సంఘర్షణ మనిషి మనసుకు ఎందుకు ఇంత బంధాలు మనిషి మనసుకు ఎందుకు ఇంత భావాలు మనిషి మనసుకు ఎందుకు ఇంత కన్నీరు మూగగా రోదించే మనసు నుండి జాలువారిన కన్నీరును చూడలేము అవి చూడాలనుకుంటే మాత్రం కనపడేవి కావు. అవి మనసు అనే కనురెప్పల మాటునుండి జాలువారే కన్నీరుని చూడాలంటే నీ మనసు ఆ మనసుతో లయం…

Read More

అమ్మకి థాంక్స్..!

ఎన్నో చదువులు చదివా.. డిగ్రీలు..పీజీలు..పీహెచ్డీలు.. కుప్పల కొద్ది మెడల్సు.. కట్టల కొద్ది సర్టిఫికెట్లు.. నేనే రాజును.. మహరాజును.. అనుకున్నా.. అమ్మ దగ్గరికి వచ్చాను.. సాధించిన పట్టాలన్నీ చూపించి గొప్పలు పోదామనుకునుకున్నా.. చిన్నప్పుడు ఎన్నిసార్లు నన్ను దండించావు.. చదవడం లేదని ఎంత తిట్టావు.. నాలుగు అక్షరాలు నేర్పావేమో… కొన్ని తప్పులు దిద్దావేమో.. తప్పటడుగులు సరిచేసావేమో.. తిన్నానా లేదా అని సరిచూసావేమో.. హోం వర్క్ చేస్తుంటే సాయపడ్డావేమో.. చదువుకుంటూనే నిద్రలోకి జోగేస్తుంటే తట్టి లేపావేమో.. అలా జోగి జోగి నేలపై…

Read More

అమ్మకి నువ్వే అన్నీ!

అమ్మకి నమస్సులతో.. అన్నం పరబ్రహ్మ స్వరూపం.. మరి ఆ అన్నం పెట్టే అమ్మ అంతకు మించిన దైవరూపం! నీ ప్రపంచం ఎంత పెద్దదైనా కాని అమ్మకి నువ్వే ప్రపంచం.. అమ్మ కూడా ఒకనాడు నీలాగే పుట్టింటి మహారాణి.. చదువుల శ్రీవాణి.. అమ్మానాన్నల ముద్దుల పూబోణి… తన స్నేహితులు.. చదువులు..ఆటలు..పాటలు అబ్బో.. ఆమెదీ ఓ పెద్ద ప్రపంచం..! ఈలోగా ఆమెకీ ఓ చక్కని ఉద్యోగం… పెద్ద జీతం.. కుదురుకునే లోగానే పెళ్లి.. కొత్త చోటు.. సరికొత్త వాతావరణం.. అప్పుడు…

Read More