త్రిజ్యేష్ఠ

త్రిజ్యేష్ఠ అనే అంశంలో నుండి ప్రారంభమైంది ఈ జ్యేష్ఠ మాసం జ్యేష్ఠుడి పెళ్లి అనే అంశం. అయితే ముహూర్తాల విషయంలో వివాహం జ్యేష్ఠ మాసంలో శుభప్రదము అని చెప్పారు. ‘మాఘ ఫాల్గుణ వైశాఖా జ్యేష్ఠ మాసాశ్శుభప్రదా’ అని జ్యేష్ఠ మాసం విశేషంగా చెప్పారు. అందునా మరొక విశేషం ఏమిటి చెప్పారు అంటే ‘జ్యేష్ఠమాసి కరగ్రహో నశుభకృత్ జ్యేష్ఠాంగనా పుత్రయో’ అని వున్నది. అనగా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులుగా పుట్టిన వధూవరులకు వివాహం చేయరాదు అని. ఈ మధ్యకాలంలో…

Read More

చూసుకో పదిలంగా..

నాన్నంటే.. కాదోయ్ ముసలాడు జీవిత పర్యంతం నీ కోసమే మసలినోడు… తన జీతం..జీవితం నువ్వై.. నీ ఉన్నతే తన నవ్వై…! అమ్మంటే.. కానే కాదు ముసల్ది ఆమె నీ చిన్ననాటి చద్ది.. నీ బతుకును చక్కదిద్ది.. నీ ముఖానికి రంగులద్ది ఇప్పుడయిందా దద్ది.. అమ్మ అవ్వయ్యాక బువ్వ కరువై.. బతుకు బరువై! పాశ్చాత్యులు చిన్నప్పుడే పంపేసి అమ్మానాన్నలను ఓల్దేజి హోముకు.. ఏడాదికోసారి చూసి వచ్చే అలవాటు ..గ్రహపాటు.. అందుకే వారికి మదర్స్ డే.. ఫాదర్స్ డే..ఎల్డర్స్ డే…..

Read More

ఈ శరీరం నేను కాదు..వాడుకొనే పరికరం మాత్రమే

మన శరీరాన్ని ఎలా వాడుకోవాలి ? నిత్య జీవితంలో మనమేమి చేయాలి ? ఈ శరీరం ఎప్పుడూ ఇలాగే ఉండేది కాదు, ఇప్పుడు అందంగా, బిగువుగా, ఆకర్షణీయంగా ఉన్న శరీరం కొంతకాలం గడిచేసరికి సడలిపోతుంది, కృశించిపోతుంది, అందవిహీనమౌతుంది, చివరకి రాలిపోతుంది. ఈ విషయాన్ని మనం మరువరాదు, ఈ శరీరం నేను కాదు. ఇది కేవలం నేను వాడుకొనే పరికరం మాత్రమే అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నా వాచీని నేను ఎలా జాగ్రత్తగా వాడుకుంటున్నానో, దానిని ఎలా…

Read More

వయస్సు మీరుతున్న కొద్దీ ఎక్కువగా మాట్లాడాలి

వైద్యులు ఇలా అంటున్నారు. పదవీ విరమణ చేసిన వారు (సీనియర్ సిటిజన్లు) ఎక్కువగా మాట్లాడాలి, ఎందుకంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా నిరోధించడానికి ప్రస్తుతానికి మార్గం లేదు. ఎక్కువగా మాట్లాడటం ఒక్కటే మార్గం. సీనియర్ సిటిజన్లు ఎక్కువగా మాట్లాడితే కనీసం మూడు ప్రయోజనాలు ఉన్నాయి మొదటిది: మాట్లాడటం మెదడును సక్రియం చేస్తుంది మరియు మెదడును చురుగ్గా ఉంచుతుంది, ఎందుకంటే భాష & ఆలోచన ఒకదానితో ఒకటి సంభాషించుకోవడం, ముఖ్యంగా త్వరగా మాట్లాడటం, ఇది సహజంగానే వేగంగా ఆలోచించే ప్రతిబింబాన్ని కలిగిస్తుంది…

Read More

పెళ్లి పేరుతో మనం చేసే పనులు కరెక్టేనా?

మనం ప్రస్తుతం చేస్తున్న పెళ్లిళ్ళు సాంప్రదాయ బద్ధమైనవేనా? అసలు పెళ్లి పేరుతో మనం చేసే పనులు కరెక్టేనా? ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి. కాలంతో పాటు మన పద్ధతులు కూడా మారాలి అనే చట్టుబండ కబుర్లు కాదు.. మనస్ఫూర్తి గా చెప్పండి కరెక్టేనా? ముందు ప్రస్తుతం మనం చేస్తున్న పెళ్లిళ్ళకు అనుకరణలు,ఆర్భాటాలు, అట్టహాసములు మానుకోవాలి! కాలంతో పాటు మనం కూడా మారాలి అనే వింత పోకడ లో పెళ్లి లో మనం చేస్తున్న తప్పులు…

Read More

విజయం అంటే ఏమిటి?

ఇదే ప్రశ్న మన దేశం నుండి ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక కాలేజీ లో విద్యార్థులతో మాట్లాడుతూ “విజయం అంటే ఏమిటి?” అని అడిగితే ఒక యువతి “విజయం అంటే దండిగా డబ్బు సంపాదించడం!”అన్నది…అపుడు ఆ ప్రొఫెసర్ “అయితే ఇరవైఏళ్ళక్రితం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో చెప్పండి?” అంటే ఎవరూ చెప్పలేదు. ఎందుకటే ప్రతి ఏడాదికీ అది మారిపోతూవుంటుంది కాబట్టి. బ్రతకడానికి కొంత డబ్బు కావాలి కానీ , డబ్బే బ్రతుకు కాదు! అంటే…

Read More

హే మానవా ! ఏంటి ఈ వింత ప్రవర్తన?

ఎంత చిత్రమో ఈ జీవిత సత్యాలు? పట్టీల విలువ వేల రూపాయల్లో… కాని వేసేది కాళ్ళకి.. కుంకుమ విలువ రూపాయలలో… కానీ పెట్టుకొనేది నుదుటిపైన.. విలువ ముఖ్యము కాదు.. ఎక్కడ పెట్టు కుంటామనేది ముఖ్యము.. ఉప్పులాగ కటువుగా మాట్లాడే వాడు నిజమైన మిత్రుడు… చక్కెర లాగ మాట్లాడి మోసగించే వాడు నీచుడు. ఉప్పులో ఎప్పుడూ పురుగులు పడ్డ దాఖలాలు లేవు.. తీపిలో పురుగులు పడని రోజూ లేదు. హే మానవా ! ఈ జీవితం అంత విలువైనదేమి…

Read More

యువ హృదయం నలిగింది

కుసుమించు మల్లియలే నీ సౌరభం అడిగే కురిసేటి వెన్నెలలే నీ కాంతులే కోరే .. ప్రియురాలా ..ప్రియమార .. తాకింది చిరుగాలే .. విషమించు విరహాలే ..చంద్రుణ్ణి కాల్చేసే విరిసేటి నగవులలో హృదయాన్ని బలిచేసే జాగేలా ..కళ్లారా .. చూడాలనే తలపే .. నిదురమ్మ ని తరిమింది .. ఇక కలలకి చోటేది .. ఎర్రబారే కన్నులలో తానేగా కొలువైంది .. రేపవలు ఎపుడొచ్చి వెళ్ళాయో తెలియని మాయలో యువ హృదయం నలిగింది . నిశి లోన…

Read More

కరిగిపోయే నిశి ..మెరిసిపోయే శశి

చంద్రకిరణాల జల్లులో .. తడిసి మురిసేటి మనసులో .. పున్నమై మెరిసిందిలే యామినీ .. వెన్నెలై కురిసిందిలే ఆమనీ .. వేసంగి హృదయాలలో .. సంపంగి సౌరభం నిండే .. ఆ నింగి లోని హరివిల్లులో .. సప్తవర్ణాల సొగసు కనువిందే .. నడిఝాము మేఘాలలో .. చిరుగాలి పెత్తనమేమిటో చల్లని రేయిలో పలకరింపుల పరవశాలు పరచేటి హాయిలో కరిగిపోయే నిశి ..మెరిసిపోయే శశి . – రాధిక ఆండ్ర

Read More

భువి తొడిగే పచ్చదనం ..ఉదయాల వెచ్చదనం .

కూసింది కోయిలమ్మ ..పూసింది పూలరెమ్మ ఝల్లు మనే చల్లని పవనం .. ఆపైన లేలేత రవికిరణం .. భువి తొడిగే పచ్చదనం .. ఉదయాల వెచ్చదనం .. హృదయంలోనే జరిగే సూర్యోదయం .. హరిత వనముల వెంట తుమ్మెదల ఝుంకారం .. లలిత కుసుమాల మధువులే కోరి ఆ ఆరాటం .. చిరుచిరు నగవులే చిందే ఆనందం .. తామస హరణం తదుపరి వెలుగుల బంధం మధురోహలతో మరురోజుకి స్వాగతం – రాధిక ఆండ్ర

Read More