Home » International

జర్మనీలో ఘనంగా మినీ మహానాడు వేడుకలు

జర్మనీ: జర్మనీలోని ఫ్రాంక్‌ఫార్ట్‌లో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం ఆధ్వర్యంలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఏపీలో విధ్వంసకర పాలన, నియంత పాలన వధించినందుకు గాను జర్మనీలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మతో పాటు జర్మనీ ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కావలి గ్రీష్మ మాట్లాడుతూ…. “ఈ ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు టీడీపీ విజయ కోసం ఎనలేని కృషి చేశారు. ఎన్నికల ముందు కొన్ని నెలల పాటు…

Read More

నేడు ప్రధాని మోదీ ఇటలీ పర్యటన

జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఇటలీ వెళ్లనున్నారు. మూడోసారి పీఎం పదవి చేపట్టిన అనంతరం మోదీ తొలి విదేశీ పర్యటన కానుంది. ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జపాన్ పీఎం ఫ్యూమియో కిషిడా, తదితరులు హాజరు కానున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణలపై చర్చించనున్నారు.

Read More

కువైట్ లో భారీ అగ్నిప్రమాదం

– 41మందికి పైగా మృతి కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఎత్తైన భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు భారతీయులతో సహా 41 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కువైట్‌లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 41 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని కువైట్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో భవనంలో మంటలు వ్యాపించాయి. మంటలు అంటుకుని…

Read More

విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు మృతి

ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా విమాన ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు లజరాస్ చెఖ్వీరా టీవీ ప్రకటనలో తెలిపారు. పర్వత శ్రేణుల్లో విమానం కుప్పకూలినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో 9 మంది మరణించినట్లు పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.

Read More

చైనాలో సుగర్ వ్యాధి మాయం

-షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేసిన చైనా -వైద్య చరిత్రలోనే గొప్ప ముందడుగు -ప్రపంచ వ్యాప్తంగా 53.7 కోట్ల మంది డయాబెటిస్‌ బాధితులు -2021లో రోగులు ఖర్చు చేసిన డబ్బు 966 బిలియన్ డాలర్లు -ప్రతి ఏడుగురు షుగర్ రోగుల్లో ఒకరు భారతీయులే -గోవాలోని మొత్తం జనాభాలో 26 శాతం మంది డయాబెటిస్ రోగులే అవును. మీరు చదువుతున్నది నిజమే. ఆ దేశంలో సుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేసే పరిశోధనలు సక్సెస్ అయ్యాయి. అన్నీ కలసివస్తే…..

Read More

మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా షీన్బామ్!

మెక్సికో రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం నమోదు కానుంది. ఆ దేశ అధ్యక్షురాలిగా తొలిసారిగా ఓ మహిళ ఎన్నికవనున్నారు. రూలింగ్ పార్టీకి చెందిన క్లాడియా షీన్బామ్ 60% ఓట్లు సాధిస్తారని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఇటు ప్రతిపక్ష అభ్యర్థిగానూ మహిళే బరిలో నిలిచారు. విపక్షానికి చెందిన గాల్వెజ్కు 30% ఓట్లు వస్తాయని అంచనా. కాగా ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ఒకసారి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి మరోసారి పోటీ చేయకూడదు.

Read More

అమెరికాలో జూన్‌ 4 తర్వాత గూగుల్‌ పే నిలిపివేత

ప్రముఖ పేమెంట్స్‌ సంస్థ గూగుల్‌ పే జూన్‌ 4 నుంచి అమెరికాలో తన సేవలు నిలిపివేయనున్నట్టు సంస్థ తాజాగా ప్రకటించింది. గూగుల్‌ పే యాప్‌ భారత్‌, సింగపూర్‌లో మాత్రమే పనిచేయనుందని తెలిపింది. కంపెనీ ప్రకారం వినియో గదారులందరూ గూగుల్‌ వాలెట్‌కు బదిలీ చేయబడతారని వెల్లడిరచింది. దీంతో గూగుల్‌ పే సేవలు బంద్‌ కానున్నాయి. గూగుల్‌ వాలెట్‌ను ప్రమోట్‌ చేసేందుకే కంపెనీ ఇలాంటి చర్య తీసుకుందని భావిస్తున్నారు.

Read More

ఇరాన్ అధ్యక్షుడి మృతి ..సంతాపదినం ప్రకటించిన భారత్

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నెల 21న సంతాపదినం పాటించనున్నట్లు ప్రకటించింది. రైసీ గౌరవార్థం ఆ రోజున దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. 1989లో ఇరాన్ తొలి సుప్రీంలీడర్ అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణించిన సమయంలో భారత్ 3 రోజులు సంతాప దినాలు పాటించింది.

Read More

ఇరాన్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్‌ మొఖ్బర్‌

ఇరాన్‌: ఇరాన్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్‌ మొఖ్బర్‌ నియమి తులయ్యా రు. సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్య క్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ తాజాగా హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న మొఖ్బర్‌ను తాత్కాలిక దేశాధ్య క్షుడిగా నియమించారు. రైసీ సంతాప సందేశంలో అలీ ఖమేనీ ఈ విషయాన్ని వెల్లడిరచారు. అదేవిధంగా దేశంలో ఐదు రోజుల సంతాప దినాలు ప్రకటిం చారు.

Read More

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి

-ధ్రువీకరించిన అధికారిక మీడియా -హెలికాప్టర్‌ కూలిన ప్రదేశానికి రెన్క్యూ బృందాలు -మీడియాకు ఫొటోల విడుదల ఇరాన్‌: హెలికాప్టర్‌ కుప్పకూలిన ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిచెందారు. ఈ విషయాన్ని అధికారిక మీడియా ధ్రువీకరించింది. తూర్పు అజర్‌బ్కెజాన్‌ ప్రావిన్స్‌లోని జోల్ఫా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. అయితే భారీవర్షం, గాలులతో అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. హెలికాప్టర్‌ కూలిన ప్రదేశానికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌ వారిని గుర్తించింది. ముక్కలైన హెలికాప్టర్‌ ఫొటోలను మీడియాకు…

Read More