Suryaa.co.in

Padayatra News

ఐదో రోజుకు చేరిన అమరావతి రైతుల ‘మహా పాదయాత్ర’

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన ‘మహా పాదయాత్ర’ ఐదో రోజుకు చేరుకుంది. ఐదోరోజు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం నుంచి ప్రారంభమైంది. మార్గంమధ్యలో ఇంజినీరింగ్‌ విద్యార్థులు పాదయాత్రకు మద్దతు తెలిపారు. తమ భవిష్యత్తు బాగుండాలంటే అమరావతే ఏపీ రాజధానిగా కొనసాగాలని…

మొక్కవోని దీక్షతో ముందుకెళ్తున్న రాజధాని రైతుల మహాపాదయాత్ర

మొక్కవోని దీక్షతో రాజధాని రైతుల మహా పాదయాత్ర కొనసాగుతోంది. గుంటూరులో పాదయాత్ర చేసిన రైతులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, కులసంఘాలు మద్ధతు ప్రకటించాయి. రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నాయి. స్థానిక ప్రజలు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించి తమ మద్దతు తెలిపారు. అమరావతి పరిరక్షణే లక్ష్యంగా రాజధాని రైతులు, మహిళలు…

జనసంద్రంగా అమరావతి రైతు పాదయాత్ర..

మూడవ రోజు పాదయాత్ర బుధవారం గుంటూరు నగరంలో అపూర్వంగా సాగింది. ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు. స్థానిక అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్ నుండి ఉదయం బయలుదేరిన పాదయాత్రలకు గుంటూరు నగరంలో అపూర్వ స్పందన లభించింది. న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు తిరుమలకు చేపట్టిన యాత్ర కు పట్టణంలో అడుగడుగునా జనం…

పల్లె కదిలినట్టుగా…రైతాంగం పాదయాత్ర

రెట్టింపు ఉత్సాహంతో రెండవ రోజు కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర.. అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం-దేవస్థానం పాదయాత్ర రెండవ రోజు మంగళవారం తాడికొండలో ఉదయం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. వేలాది మంది మహిళలు,రైతులు ఓకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతే రాజధాని అంటూ నినదించారు. ఏడు కొండలవాడ వెంకటేశ్వరా గోవిందా గోవిందా అంటూ పాలకులకు కనువిప్పు…

ఉరికే ఉత్సాహం

అదే ఉరకలెత్తే ఉత్సాహం అదే మరుగుతున్న రక్తం ఉప్పెనలా సాగుతున్న జనం ప్రభంజనం లా మారుతున్న నారీ లోకం ఏడు వందల రోజుల ఆవేదనకు ఏడుకొండల వాడి స్వాంతన కొరకు భూములిచ్చి మోసపోయిన రైతన్నలకు లక్షలాది భూమి పుత్రుల దీవెనల కొరకు దారుణ అమానుషానికి గురైన ఆడపడుచులకు తెలుగు మహిళామ తల్లుల ఆదరణ కొరకు ఆవేదనతో…

రెండోరోజు మహాపాదయాత్ర.. కదం కలిపి కదిలిన రైతులు

రాజధాని రైతులు, మహిళల మహా పాదయాత్ర రాజధాని రైతులు, మహిళల రెండోరోజు మహాపాదయాత్ర కొనసాగుతోంది. తాడికొండ రైతులు, మహిళలు ఉద్యమస్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు.. ఈ రోజు తాడికొండ నుంచి గుంటూరులోని అమరావతి రోడ్డు వరకు 13 కిలోమీటర్ల మేర.. పాదయత్ర చేయనున్నారు. ఇవాళ గుంటూరులోని గోరంట్లలో రెండోరోజు మహాపాదయాత్ర ముగియనుంది. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరిట…

కొత్త పుంతలు తొక్కుతున్న అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం

న్యాయస్థానం నుండి దేవస్థానం, తుళ్ళూరు నుండి తిరుమల మహాపాదయాత్ర నిన్న ప్రారంభమైనది. “జై అమరావతి” నినాదం ప్రతిధ్వనించింది. వేలాది మంది ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. వారిలో మహిళలే అత్యధికులు. వృద్ధులు, పిల్లలు సహితం కదంతొక్కారు. మహాసంకల్పంతో ప్రారంభమైన పాదయాత్రలో నేను పాల్గొన్నాను. నడకసాగిస్తూ ఎవర్ని కదిపినా ప్రభుత్వం అనుసరిస్తున్న అమరావతి విధ్వంసం దుష్పరిణామాలపై ఆవేదన, ఆక్రోశం,…

జనం..జనం..తిరుమలకు అడుగులేసిన అమరావతి రైతు ప్రభం‘జనం’

– చాలా ఏళ్ల తర్వాత ఏపీకి రేణుకాచౌదరి ( మార్తి సుబ్రహ్మణ్యం ) వాళ్లకి దానం చేయడమే తప్ప యాచించడం తెలియదు. వాళ్లకి గౌరవంగా బతకడమే తెలుసు తప్ప, బజారునపడటం తెలియదు. వాళ్లకి పండించడమే తప్ప రాజకీయాలు తెలియవు. వాళ్లకు పొలం-ఇల్లు తప్ప బయట ప్రపంచం తెలియదు. వాళ్లకు మోసపోవడమే తప్ప, మోసం చేయడం తెలియదు….