రెండోరోజు మహాపాదయాత్ర.. కదం కలిపి కదిలిన రైతులు

రాజధాని రైతులు, మహిళల మహా పాదయాత్ర
రాజధాని రైతులు, మహిళల రెండోరోజు మహాపాదయాత్ర కొనసాగుతోంది. తాడికొండ రైతులు, మహిళలు ఉద్యమస్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు.. ఈ రోజు తాడికొండ నుంచి గుంటూరులోని అమరావతి రోడ్డు వరకు 13 కిలోమీటర్ల మేర.. పాదయత్ర చేయనున్నారు. ఇవాళ గుంటూరులోని గోరంట్లలో రెండోరోజు మహాపాదయాత్ర ముగియనుంది.
‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరిట తుళ్లూరు నుంచి తిరుమల వరకూ చేపట్టిన మహా పాదయాత్ర.. సోమవారం ఉదయం తుళ్లూరులో ఉద్విగ్నభరిత వాతావరణంలో ప్రారంభమైంది. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం పరితపిస్తున్న ప్రజలు, భూములిచ్చిన రైతులు సాగిస్తున్న ఈ లాంగ్‌ మార్చ్‌కి దారి పొడవునా ప్రజలు నీరాజనాలు పట్టారు.
తొలి రోజు 14.5 కిలోమీటర్ల మేర రైతులు పాదయాత్ర చేశారు. పాదయాత్రకు వైకాపా తప్ప అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం రైతులు పోరాటం చేస్తున్నారు. 45 రోజుల పాటు మహాపాదయాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 15న పాదయాత్ర తిరుమలకు చేరుకునేలా ప్రణాళిక రచించారు.

Leave a Reply