పల్లె కదిలినట్టుగా…రైతాంగం పాదయాత్ర

రెట్టింపు ఉత్సాహంతో రెండవ రోజు కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర..
అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం-దేవస్థానం పాదయాత్ర రెండవ రోజు మంగళవారం తాడికొండలో ఉదయం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. వేలాది మంది మహిళలు,రైతులు ఓకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతే రాజధాని అంటూ నినదించారు. ఏడు కొండలవాడ వెంకటేశ్వరా గోవిందా గోవిందా అంటూ పాలకులకు కనువిప్పు కలగాలని పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. మధ్యాహ్నానికి గుంటూరు రూరల్ లోని పాదయాత్ర లాంమ్ గ్రామానికి చేరుకుంది.
ఈ కార్యక్రమంలో అమరావతి పరిరక్షణ సమితి నాయకులు, టిడిపి, వామపక్షాల నేతలు, మహిళా నేతలు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాడికొండ మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పాదయాత్ర సాగింది. గుంటూరు తూర్పు పశ్చిమ టీడీపీ ఇంచార్జ్ లు నజీర్ అహ్మద్, కోవెలమూడి రవీంద్ర తదితర నేతలు ఘన స్వాగతం పలికారు. మొదటి రోజు కంటే రెండవ రోజు రైతులు చేపట్టిన పాదయాత్ర రెట్టింపు ఉత్సాహంతో సాగుతుంది. పల్లె కదిలినట్టు గా రైతాంగం తో పాదయాత్ర నిండిపోయింది.