– పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ ల కార్యదర్శి యమ్. యమ్. నాయక్
విజయవాడ: దేశవ్యాప్తంగా 25 అక్టోబర్ 2024 నుండి 28 ఫిబ్రవరి 2025 వరకు 21 వ అఖిల భారత పశు గణన చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖ ల కార్యదర్శి యమ్. యమ్. నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
పశుసంవర్ధక శాఖ ఆఫీసు నుండి గురువారం పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖ ల కార్యదర్శి యమ్. యమ్. నాయక్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులకు 21వ అఖిల భారత పశు గణన నిర్వహణపై తగు సలహాలు మరియు సూచనలు అందించామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మన రాష్ట్రంలో మొత్తం 1.50 కోట్ల కుటుంబాలకు సంబంధించిన పశువుల వివరాలను నమోదు చేయాల్సి ఉందన్నారు.
విషయ సేకరణదారులు మీ గృహ సందర్శనకు వచ్చిన సమయంలో తమ వద్ద ఉన్న పశువులు మరియు కోళ్ళ సంఖ్యపై సరైన సమాచారాన్ని వారికి అందించాలన్నారు. పశు గణనలో భాగంగా, గణన ప్రక్రియ పూర్తయినట్లు గుర్తుగా ప్రతి ఇంటి ముందు తలుపు యొక్క కుడి ఎగువ మూలలో స్టిక్కర్లు ఉంచుతారని తెలిపారు.