Suryaa.co.in

Andhra Pradesh

కారుమూరి టీడీఆర్ బాండ్ల అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలి

– టీడీఆర్ బాండ్లతో ప్రజలసొమ్ము తినేస్తున్న అవినీతి పందికొక్కు కారుమూరి బ్యాంకులకు రూ.4.20కోట్లు ఎగ్గొట్టాడు.
– అతని 420 ఆలోచనలతో ఆఖరికి ఆయన భార్య, తల్లికూడా రోడ్డున పడ్డారు
– కారుమూరి సాగించిన టీడీఆర్ బాండ్ల అవినీతిపై ముఖ్యమంత్రి తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి
• కారుమూరి లాంటి 420 ల బతుకేంటో రాష్ట్రమంతా తెలుసు
• నేనేంటో , నాకుటుంబమేంటో అందరికీ తెలుసు. నలుగురికిపెట్టి, ఆస్తులు పోగుట్టుకున్నవాళ్లమే గానీ, కారుమూరిలా తామేమీ బ్యాంకులకు టోపీపెట్టి,ప్రజలసొమ్ముని పందికొక్కుల్లా బొక్కేయలేదు
• గతంలో తాను బయటపెట్టిన టీడీఆర్ బాండ్ల జాబితాలో తాజాగా కొత్త బాండ్ ఒకటి చేరింది
• దానిద్వారా కారుమూరి రూ.35 కోట్ల వరకు బొక్కేశాడు
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

తణుకు మున్సిపాలిటీకేంద్రంగా జరిగిన టీడీఆర్ బాండ్ల స్కామ్, రూ.390కోట్ల కుంభకోణం ఏదైతేఉందో, దానికి సంబంధించినవాస్తవాలను, ఆధారాలను తాము సమాచార హక్కుచట్టంద్వారా సేకరించి, గతంలో మీడియావారికితెలియచేశామని, తామేమీ గాలి కబుర్లు పోగేసిచెప్పలేదని, పక్కాఆధారాలతోనే టీడీపీఎప్పుడూ మాట్లాడుతుందని ఆ పార్టీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు.మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

టీడీఆర్ బాండ్ల సమాచారం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాస్తవాలను ఇప్పటికే ప్రజల ముందుంచాము. 2019లో వైసీపీశాసనసభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆపార్టీ అవినీతి కాలనాగు, తణుకుఅసెంబ్లీ కేంద్రంగా ఎంతపెద్దఎత్తున టీడీఆర్ బాండ్లు మంజూరుచేయించాడో, అదికూడా మున్సిపాలిటీ కార్యవర్గం లేనప్పుడు ఎలాతన అవినీతిని కొనసాగించాడో స్పష్టం చేశాము.

2020-21లో 71,502 గజాలకు టీడీఆర్ బాండ్లు విడుదలచేసిన సమాచారం, ఆగస్ట్ 2021 నుంచి డిసెంబర్ 2022వరకు మరో 32,933 గజాలకు టీడీఆర్ బాండ్లు ఇచ్చిన సమాచారాన్ని బయటపెట్టాము. అవినీతికాలనాగు కారుమూరి నాగేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాక, గతరెండుసంవత్సరాల కాలంలోనే సుమారుగా లక్షా04వేల గజాలకు టీడీఆర్ బాండ్లు ఇష్యూచేయించారు.

రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేనివిధంగా, ఏ మహానగరంలో కానరానివిధంగా ఈస్థాయిలో టీడీఆర్ బాండ్లు చిన్నమున్సిపాలిటీ అయిన తణుకు మున్సి పాలిటీ నుంచే జారీ అయ్యాయి. అలానే గతంలో ఏఏసంవత్సరంలో ఎన్నిగజాలకు టీడీఆర్ బాండ్లు ఇచ్చారోకూడా చెప్పడం జరిగింది. 2013-14లో కేవలం 618 గజాలకు, 2012లో 1276 గజాలకు, 2018లో 3,972 గజాలకు టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరిగింది.

కానీ అనూ హ్యంగా ఒక్కసారిగా 2020-21లో 71వేల గజాలకు బాండ్లు విడుదలచేశారు. ఒక్కసారిగా ఉన్నట్టుండి 20రెట్లు పెరగడంజరిగింది. ఇలా 24-08-2021న తణుకు మున్సిపాలిటీ వారు సమాచారహక్కుచట్టం కింద తమకు ఇచ్చినసమాచారంతోపాటు, 17-02-2022న ఇచ్చిన సమాచారం ఆధారంగానే తాము మాట్లాడాము.

ఒక్కసారిగా అంతపెద్దఎత్తున లక్షా04వేల గజాలకు టీడీఆర్ బాండ్లు ఎందుకు ఇచ్చారని తాము ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఏప్రాంతంలో అయితే అభివృద్ధికార్యక్రమాలపేరుతో భూములుసేకరించారో, అవేభూములను కారుమూరి తనబినామీలతో కొనిపించి, తిరిగివాటినే మున్సిపాలిటీవారితో కొనిపించి, టీడీఆర్ బాండ్లు ఇవ్వడంజరిగిందని కూడా చెప్పాము.

2020 నుంచి 2022 జనవరి వరకు ఏఏస్థలాలకు అయితే టీడీఆర్ బాండ్లు మంజూరు చేశారో ఆయాప్రాంతాల్లో ఎన్నిరిజిస్ట్రేషన్లు జరిగాయి..ఎంతమందితో అవినీతికాలనాగు కారమూరి నాగేశ్వరరావు భూములుకొనిపించాడో సదరువ్యవహారంపై సమగ్రమైన విచారణ జరిపించాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము.దానిపై అవినీతి పందికొక్కు కారుమూరి నాగేశ్వరరావు ఇష్టానుసారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ తన అక్కసంతా వెళ్లగక్కాడు.

ఆసందర్భంలో ఆయనేం మాట్లా డాడో ఒక్కసారి ప్రజలంతా కూడా వినాలి. (కారుమూరి నాగేశ్వరరావు అసెంబ్లీ బయట విలేకరులతో మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా పట్టాభి విలేకరులకు వినిపించారు) తన మాటల్లో కారుమూరి ఏమన్నాడంటే టీడీఆర్ బాండ్ల విడుదలలో ఒక్కరోజు ముందు తనకు జరగకూడదని ఏదో జరిగినట్లు అనిపించిందని, అందుకే విచారణ జరిపించాలని మంత్రితో చెప్పానని చెప్పుకొచ్చాడు.

కారుమూరికి, వైఛీపీ అవినీతి కాలనాగులకు రాష్ట్ర ప్రజలు మరీ అంత వెర్రివాళ్లల్లా కనిపిస్తు న్నారా? తాను టీడీఆర్ బాండ్లపై మాట్లాడటానికి ఒక్కరోజు ముందే సదరు వ్యవహారంపై జర గకూడనిదిఏదో జరిగినట్లు ఎమ్మెల్యేకు అనిపించిందా? అందుకే మంత్రిగారిని అడిగాడంటా? మంత్రిని..వాళ్లను, వీళ్లను అడగటమెందుకు కారమూరి.. ముఖ్యమంత్రికి చెప్పు సీబీఐతో విచారణ జరిపించు. సదరు విచారణకు నువ్వుపూర్తిగాసహకరించు. అప్పుడు తేలుతుంది ఎవరు ఎంతమెక్కారో?

టీడీఆర్ బాండ్లద్వారా అవినీతికి పాల్పడ్డానని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కారుమూరి చెబుతున్నాడు. సవాళ్లు విసరడం మానేయ్ కారుమూరి.. నిన్ను, నీ అవినీతిని తణుకుప్రజలు ఎప్పుడో పసిగట్టారు. వారే నీకు పులుసుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వేమీ అంతకష్టపడి ఎలాంటి సన్యాసాలు తీసుకోనక్కర్లేదు కారుమూ రి… తణుకు ప్రజలు నీజీవితానికే చరమగీతం పాడటానికి సిద్ధంగాఉన్నారని గుర్తుంచుకో.

టీడీఆర్ బాండ్లపై బుకాయిస్తున్న కారుమూరి నాపైకూడా వ్యక్తిగత విమర్శలు చేశాడు. నేనే దో వ్యాపారంచేసి, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టానంటూపిచ్చికూతలు కూశాడు. నిజంగా కారుమూరి తాను నాపై చేసిన ఆరోపణలకు కట్టుబడాలి. ఆయనకు నిజంగా దమ్ముంటే, నాపై చేసిన ఆరోపణలకు రుజువులుంటే, ఆకాగితాలు బయటపెట్టాలి.పనికిమాలిన బులుగు మీడియా చేతిలోఉందికదాఅని.. మాట్లాడటంకాదు.

నిజంగా నేను తప్పు చేసుంటే, మీ బులు గుమీడియా ఈ మూడేళ్లనుంచి నాపై దుష్ప్రచారంచేయకుండా ఊరుకుంటుందా? నిజాయితీ పరుడైన చంద్రబాబుగారి నాయకత్వంలో నిబద్ధతతో, నీతినిజాయితీలతో పనిచేస్తున్నాను కాబట్టే, నీలాంటి అవినీతి కాలనాగుల ఆటకటిస్తున్నాను కారూమూరి.నీ అవినీతి, చీకటి బాగోతాలు ఏంటో చెప్పమంటావా కారుమూరి? ఆ చిట్టా విప్పితే ఎలా ఉంటుందో నీకు ఇకనుంచి చూపిస్తాను …చూసుకో.

జనవరి 29, 2022న దిక్కుమాలిన సాక్షి పత్రికలో పూర్తి పేజీ ప్రకటన ఒకటివచ్చింది. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టేవారినుంచి రికవరీచేయడానికి దేశంలో డెబ్ట్స్ రికవరీ ట్రిబ్యునల్ అని ఒకటుంది. వారుఇచ్చిన పత్రికాప్రకటనలోని అంశాలనే ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను.ఆప్రకటనలోవారు కారుమూరిపేరుని తాటికాయంత అక్షరాలతో రాశారు. దానిలో వివిధ అకౌంట్లద్వారా ఎన్నికోట్లు కారుమూరి బ్యాంకులకు ఎగ్గొట్టాడనేవివరాలు స్పష్టంగా చెప్పు కొచ్చారు.

అకౌంట్ ఆర్ పీ నంబర్ 479/2017 ద్వారా కోటి 5లక్షల 39 వేల 734 రూపాయల్ని బ్యాంకులకు ఎగ్గొట్టాడు. ఆర్ పీ నంబర్ 612/2017 కోటి 03 లక్షల 03వేల 375 రూపాయలు… ఆర్ పీ నంబర్ 642/2017 కోటి 07 లక్షల 82వేల 636 రూపాయలు, ఆర్ పీ నంబర్ 671/2017 కి సంబంధించి కోటి 02 లక్షల 2వేల 570 రూపాయలు. ఈ విధంగా నాలు గు అకౌంట్లద్వారా మొత్తం రూ.4.20కోట్లను బ్యాంకులకు ఎగ్గొట్టినందుకు కారుమూరి ఆస్తు లను వేలంవేస్తూ డెబ్ట్స్ రికవరీ ట్రిబ్యునల్ వారు పత్రికల్లో ప్రకటనలిచ్చారు.

వారు ఇచ్చిన ప్రకటనల్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయంటే కారుమూరి నాగేశ్వరరావు తల్లి, సతీమణిల పేర్లు కూడాఉన్నాయి. కారుమూరి నాగేశ్వరరావు సతీమణీ కారుమూరి లక్ష్మీకిరణ్, తల్లి కారుమూరి సూర్యకాంతం, కారుమూరి వెంకటనాగేశ్వరరావుల లపేర్లు ఉన్నాయి. ఆ ముగ్గురిపేర్లతో నోటీసులు ఇచ్చారంటే, కారుమూరి మోసాలకు, ఆయనచేస్తున్న 420 ప నులకు తన ఇంట్లోని ఆడవాళ్లను కూడా రోడ్డునపడేశారు.తన తల్లిని, అర్థాంగిని కూడా పత్రికలకుఎక్కించి, వారిని అగౌరవపరిచిన ట్రాక్ రికార్డ్ కారు మూరి నాగేశ్వరరావుది. బ్యాంకులకు టోపి వేసిన ఆయన బ్రతుకుఇదీ అని స్పష్టంగా ఆధా రాలతోసహా బయటపెడుతున్నా.

నేనేంటో ..నా కుటుంబమేంటో అందరికీ తెలుసు. మా కుటుంబం నలుగురికి పెట్టి, ఆస్తులు పంచిన కుటుంబమేగానీ, నీలాగా 420కుటుంబంకాదని తెలుసుకోకారుమూరి.నీ చరిత్ర ఇంకాఉంది.. ఇంతటితో అయిపోలేదు. గతంలో నువ్వు ఆంధ్రాబ్యాంకుకి ఎంత ఎగ్గొట్టావోకూడా బయటపెడతాను.

టీడీఆర్ బాండ్లకు సంబంధించి తాజాగా మరో సమాచారహక్కుచట్టం అర్జీవేసి, దానిద్వారా మరికొంతసమాచారం సేకరించాము. టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో లేటెస్ట్ గా 25-02-2022న పులుపు అనిల్ కుమార్ పేరుతో మరో టీడీఆర్ బాండ్ విడుదలచేశారు. టీడీఆర్ బాండ్ నంబర్ 1081 / 00039 / టీడీఆర్ /కేపీ / 2022. ఈ టీడీఆర్ బాండ్లో పేర్కొన్న అనిల్ కుమార్ ఎవరో కారుమూరికి బాగా తెలుసు.

డంపింగ్ యార్డ్ కోసమని 4,046 స్క్వేర్ మీటర్లు, అంటే దాదాపు 4,838గజాలను (అంటేఒకఎకరం స్థలం) అనిల్ కుమార్ నుంచి తణుకు మున్సిపాలిటీ తీసుకుందని, తాము విడుదలచేసిన టీడీఆర్ బాండ్లలో స్పష్టంగా ఉంది. 4,838 గజాలుఇచ్చినందుకు 16,186 స్క్వేర్ మీటర్లు ( అంటే 19,358 చదరపు గజాలకు) తణుకు మున్సిపాలిటీవారు టీడీఆర్ బాండ్లు ఇచ్చారు.

పులుపు అనిల్ కుమార్ రేలంగి గ్రామ వైసీపీ సర్పంచ్. ఆయనతల్లిగారు వైసీపీ వైస్ సర్పంచ్ గాఉన్నారు. ఆయన సోదరుడు పులుపు సునీల్ కుమార్ రేలంగిగ్రామ వైసీపీ వార్డ్ మెంబర్. అనిల్ కుమార్ తండ్రి శ్రీనివాస్ వైసీపీ నాయకుడు. ఆ విధంగా కుటుంబమంతా కూడా వైసీపీవారే. వారంతా కారుమూరికి అనుంగుఅనుచరులు, ఎమ్మెల్యేకి బినామీలు.

వారితో 4,838 గజాలను తణుకుమున్సిపాలిటీకి ఇప్పించినట్టే ఇప్పించి, తన బినామీ అనిల్ కుమార్ కు రూ.35కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లను కారుమూరి ఇప్పించాడు. ఈ వ్యవహార మంతా కారుమూరి సాగించిన అవినీతి వ్యవహారంకాదా? ఇదివరకు తాను డిసెంబర్ 2021 వరకు సంబంధించిన టీడీఆర్ బాండ్లపై మాట్లాడాను. ఇప్పుడు చెబుతున్నది తాజాగా తమకు అందిన టీడీఆర్ బాండ్ సమాచారం.

ఇప్పుడు తాను చెప్పిన దానిపై అవినీతి పంది కొక్కు కారుమూరి ఏంసమాధానంచెబుతాడని ప్రశ్నిస్తున్నాం. ఇలా నిత్యం ప్రతినెలా వైసీపీ నేతలపేరుతో పెద్దఎత్తున టీడీఆర్ బాండ్లు తణుకుమున్సిపాలిటీనుంచి విడుదల అవుతు న్నాయి. గతంలో 2013, 2014, 2018, 2019లో ఎంతభూమిసేకరించి, ఎంతమొత్తంలో టీడీఆర్ బాండ్లు ఇచ్చామో కూడాచెప్పాను.

కానీ అవినీతి తిమింగలంకారుమూరి హాయాం లో మాత్రం లక్షలగజాల భూమి టీడీఆర్ బాండ్ల రూపంలో తీసుకొని, దాన్ని సొమ్ముచేసు కుంటున్నారు. పులుపు అనిల్ కుమార్ నుంచి సేకరించిన భూమికి రూ.35కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు ఇవ్వడంకూడా ఆకోవలోనిదే.

గతంలో టీడీఆర్ బాండ్లు పొందిన కాటూరి లక్ష్మణరావు అనేవ్యక్తి ఎవరైతేఉన్నారో, అతను, అతనికుటుంబసభ్యులపేర్లుమీదనే 2020 నుంచి 2021 వరకు సేకరించిన భూమిఉంది. కాటూరి లక్ష్మణరావు స్వతహాగా బిల్డర్. కానీ ఆయన వియ్యంకుడు చరణ్ మంత్రి తానేటివని తకు కీలక అనుచరుడు. కొవ్వూరులోప్రముఖ వైసీపీనేత. ఇలా అంతా తనపార్టీ వారినే పోగే సుకొని తన అవినీతిని కారుమూరి కొనసాగిస్తున్నాడు.

కారుమూరి కూడా తన అవినీతిని తానే ఒకరకంగా ఒప్పుకున్నాడు. కాబట్టి, టీడీఆర్ బాండ్ల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాల్సిందే. కారుమూరి నాగేశ్వరరావు లాంటి 420లకు చంద్రబాబుగారిని సవాల్ చేసేంతటి అర్హత స్థాయిఉన్నాయా? కారుమూరి బ్రతుకేంటో వారి పార్టీ అవినితిపత్రిక సాక్షిలో వచ్చిన ప్రకటనతోనే తేలిపోయింది. అవినీతి తిమింగలం కారు మూరి ఇప్పటికైనా నోరుఅదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది.

గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధిపేరుతో తణుకుమున్సిపాలిటీ పరిధిలో తీసుకున్నభూములతోసహా, అప్పుడిచ్చిన ఆర్ టీఐ బాండ్లతో పాటు, కారుమూరి నాగేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యాక ఇచ్చిన టీడీఆర్ బాండ్ల జాబితాపైకూడా సీబీఐ విచారణజరగాలి. రైతులభూములు నిజమైన అభివృద్ధికోసం ఏనాడూ కారుమూరి, తణుకు మున్సిపాలిటీ సేకరించలేదు.

ముఖ్యమంత్రికూడా కారుమూరి టీడీఆర్ బాండ్ల అవినీతిని మెచ్చుకున్నాడంటున్నారు.
కారుమూరి అమలుచేసిన ఐడియా రాష్ట్రమంతా అమలుచేసిఉంటే, తనకు మరింత అవినీతి సొమ్ము వచ్చేఉండేదని ముఖ్యమంత్రి వాపోయారంటున్నారు. మూడేళ్లలో మీ పనికిమాలిన పత్రిక నా అవినీతి గురించి మూడులైన్లు కూడా రాయలేకపోయింది. ఏమైనా ఉంటే కదా రాయడానికి. ఏమీలేదనే చివరకు నాపై భౌతికదాడులకు యత్నించారు.

LEAVE A RESPONSE