– రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలంటే టీడీపీతో కలిసినడవాలి
– . సభ్యత్వనమోదు కార్డుతో ప్రతిఒక్కరిపూర్తిసమాచారం తెలిసేలా వినూత్నంగా రూపొందిస్తున్నాం
• మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో సభ్యత్వనమోదు ప్రక్రియ ప్రారంభించిన పార్టీ అధినేత
• ఉండవల్లిగ్రామ టీడీపీవిభాగం చేతులమీదుగా తనతొలిసభ్యత్వకార్డు అందుకొని, పార్టీ కార్యకర్తల సంక్షేమనిధికి రూ. లక్షవిరాళం అందించిన చంద్రబాబునాయుడు
• సాంకేతికతతోపాటు, కార్యకర్తలకు వచ్చేఇబ్బందులు, వారిని వేధించే పోలీసులు, ప్రభుత్వాధికారుల సమాచారంకూడా స్థానికంగా ఉండే పార్టీ అగ్రనాయకత్వానికి చేరేలా సభ్యత్వనమోదుకార్డుల్లో కొత్తపరిజ్ఞానం జోడించామన్న టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి లోకేశ్
• వాట్సాప్ ద్వారా జరిగే సభ్యత్వనమోదుని అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వం వాట్సాప్ యాజమాన్యానికి లేఖరాసిందన్న లోకేశ్
• నాయకులు, కార్యలయాలచుట్టూ తిరుగుతూ, పార్టీకోసం అంతాతామేచేస్తున్నామని చెప్పుకునేవారుకాకుండా, నిజంగా పార్టీకోసంఎవరు పనిచేస్తున్నారో సభ్యత్వనమోదు కార్డే తేల్చేస్తుందన్న పార్టీ రాష్ట్రఅధ్యక్షులు అచ్చెన్నాయుడు
• డిజిటల్ పరిజ్ఞానంతో ప్రతికార్యకర్తకు ఉపయోగపడేలా వ్యక్తిగత, ఆరోగ్య సమాచారంతోకూడిన సభ్యత్వ కార్డులు తీసుకురావడాన్ని స్వాగతించిన పార్టీనేతలు, కార్యకర్తలు
• బాదుడేబాదుడు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, సభ్యత్వనమోదు కార్యక్రమాలను ఏకకాలంలో నిరంతరాయంగా జరిగేలా చూస్తామన్న పార్టీశ్రేణులు
– తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు :
నేడు సభ్యత్వనమోదు ప్రారంభించగానే ఒక్క సెకన్ లో 8,765 మంది సభ్యత్వం తీసుకోవడానికి ముందుకొచ్చారు. కార్యకర్తల ఉత్సాహంతో కాసేపు ఆన్ లైన్ వ్వవస్థ స్తంభించింది. వెంటనే దాన్ని పునరుద్ధరించారు. మున్ముందు కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందిలేకుండా సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని సజావుగా, సక్రమంగా జరిగేలా చూస్తాం. టీడీపీసభ్యత్వంకోసం ప్రజలు ఎంత ఆదుర్దాగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతోంది. అదీ టీడీపీ సభ్యత్వానికి ఉన్నపవర్.
తెలుగుదేశంజెండా కప్పుకొని చనిపోతాం తప్ప, పార్టీమారం, ఎలాంటి ప్రలోభాలకు లొంగము అనే కార్యకర్తలు ఉన్నందుకు నిజంగా గర్వపడుతున్నాం. నేడు తెలుగురాష్ట్రాలతోపాటు, అండమాన్ లో సభ్యత్వనమోదు ప్రారంభించాము. రేపట్నుంచీ దేశంతోపాటు, ప్రపంచంలోని అన్నిదేశాల్లో ఉండేతెలుగువారు, ఇతరులు అందరూ తెలుగుదేశం కుటుంబంలో సభ్యులుగా చేరవచ్చు.
తెలుగుదేశంపార్టీ కార్యకర్తల్ని సంఘటితంచేసి, వారిసేవల్ని రాష్ట్రానికి, ప్రజలకు అందించడమే పార్టీసభ్యత్వనమోదు ముఖ్యఉద్దేశం, ప్రధానలక్ష్యం. మాచర్లలో చంద్రయ్యపైదాడిచేసి, చంపేస్తామని బెదిరిస్తూ, వైసీపీకి మద్ధతుపలకాలనికోరినప్పుడు, చావనైనా చస్తానుగానీ, ఆ పనిచేయనన్నాడు.
ఇప్పటివరకు పార్టీని కార్యకర్తలు కాపాడారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్యకర్తల్ని పార్టీ కాపాడాల్సిన పరిస్థితి. ఇప్పుడు తీసుకొచ్చిన డిజిటల్ మెంబర్ షిప్ నాయకులతో పనిలేకుండా అందరికీ చేరుతుంది.
అందర్నీ టీడీపీకుటుంబంలో సభ్యుల్ని చేస్తుంది. సభ్యత్వనమోదులో గతంలో చాలాచాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము.. పేపర్ మీద నమోదుచేసినప్పుడు బీరువాలకు బీరువాల సమాచారం సేకరించాము. తరువాత కంప్యూటర్లలో, ల్యాప్ ట్యాప్ లు, ట్యాబ్ లలో నమోదుచేశాము. ఇప్పుడు ఏకంగా వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ఆరుదశల్లో వివరాల సేకరణపూర్తై, డిజిటల్ సభ్యత్వకార్డు పొందనున్నారు. డిజిటల్ కార్డు లో కార్యకర్తలైనా, నాయకులైనా వారి పూర్తిసమాచారం మొత్తం నమోదవుతుంది.
పార్టీ కేంద్రకార్యాలయానికిఎవరైనావస్తే, సభ్యత్వనమోదు కార్డుని స్కాన్ చేస్తే చాలు… వారియొక్క పూర్తివివరాలు మాకుతెలుస్తాయి. వారు పార్టీకోసం ఏంచేశారనే దాన్నిబట్టే వారికి ప్రాధాన్యత, గుర్తింపు
ఉంటాయి. పార్టీని, పార్టీనేతలు, కార్యకర్తల్ని సమ్మిళితంచేస్తూ, 360 డిగ్రీలకోణంలో వారి వివరాలు, పనితీరు పరిశీలించి, పరిశోధించాకనే వారివివరాల్ని డిజిటల్ కార్డుల్లో నిక్షిప్తంచేయబోతున్నాం.
డిజిటల్ సభ్యత్వనమోదు కార్డులతో కార్యకర్తలకు ఎలాంటి ఆపదవచ్చినా వారిని కాపాడుకుంటాము. అధికారంచేతిలో ఉందికదా అని, ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలు, నేతల ఇళ్లపైకివెళ్లి అరాచకంచేయడం, ఆస్తులు ధ్వంసంచేయడం వంటి దారుణాలకు పాల్పడటాన్ని తీవ్రంగాప్రతిఘటిస్తాం. కార్యకర్తలకు అండగా ఉంటూనే, వారిపైజరిగే దారుణాలను నిరోధించేలా పార్టీ యంత్రాంగం అప్రమత్తం అవుతుంది.
కార్యకర్తలకు అన్నిరకాల సహాయసహాకారాలు అందించే వేదికగా సభ్యత్వనమోదు ప్రక్రియ నిలవనుంది. ఎలాంటి హద్దులు, అవరోథాలులేకుండా నేరుగా నేనే కార్యకర్తలతో మాట్లాడేలా సాంకేతికతను సభ్యత్వనమోదు కార్డుల్లో జోడిస్తున్నాం. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చేస్తున్న అరాచకాలతో రాష్ట్రప్రజానీకానికి మరీముఖ్యంగా నిరుద్యోగులు , యువతకు నిరాశానిస్పృహలే మిగిలాయి.
అమెరికాలో తెలుగువాళ్లు తలసరి ఆదాయార్జనలో అగ్రస్థానంలోఉన్నారు. అందుకుకారణం తానుతీసుకొచ్చిన ఐటీ (ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ) పరిజ్ఞానం. ఈ ప్రభుత్వం ఏమీచేయలేదని, తమజీవితాలు బాగుచేయలేదని యువతకు, నిరుద్యోగులకు అర్థమైంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ కింద కిరాణాదుకాణంపెట్టుకొని తనకుటుంబాన్ని పోషించుకుంటున్న విష్ణువర్థన్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాష్ట్రయువత తెలుగుదేశంపార్టీతోపాటు, వారివ్యక్తిగతఅభివృద్ధికోసం పాటుపడేలా ఆలోచించాలి.
రోడ్డుపైఉన్న కారు ఎత్తికెళ్లినట్లే, ఇళ్లల్లోకి చొరబడి ఆడపిల్లలను ఎత్తుకెళతారా?
వినుకొండ నుంచి కుటుంబంతో కలిసి తిరుమల వెళ్తున్న వేముల శ్రీనివాస్ తనకారుని రోడ్డుపై ఆపి టీ తాగుతుంటే, కానిస్టేబుల్ తీసుకెళ్లిపోయాడు. దొంగలకంటే హీనంగా కానిస్టేబుల్ దర్జాగా వచ్చి కారు తీసుకెళ్లడమేంటి? యజమానికి చెప్పకుండా ముఖ్యమంత్రి వస్తున్నాడనిచెప్పి కారు తీసుకెళతారా? అలానే భవిష్యత్ లో ఇళ్లల్లో ఉండే అమ్మాయిలను కూడా ఎత్తుకెళ్లిపోతారా? ప్రజలు చూస్తూ ఊరుకుంటున్నారులే అని మీఇష్టానుసారం ఏమైనా చేస్తామంటారా? ప్రజల్లో చైతన్యంవస్తే తప్ప, ఈప్రభుత్వానికి, ఉన్మాదపు పాలకులకు కళ్లెం వేయలేము.
నేను, తెలుగుదేశంపార్టీ ఎల్లప్పుడూ ప్రజలకోసమే పోరాడతాము. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అనర్హమైనది. ఆపార్టీవారు ప్రజలజీవితాలతో, రాష్ట్రంతో ఆడుకుంటూచేస్తున్నదుర్మార్గాలు చూస్తుంటే ఆవేశం ఆగడంలేదు. నిన్న కూడా నూజివీడుప్రాంతంలో పర్యటించాను. చాలామంది వారి బాధలు చెప్పుకున్నారు. స్వయంగా వైసీపీకి చెందిన నేత ఒకరు అక్కడి స్థానిక ఎమ్మెల్యే కొడుకు అవినీతిపై పోరాడుతున్నాను అని వాపోయాడు. ఒకఊరిలో ఎమ్మెల్యేకొడుకు ఒకల్యాండ్ కి సంబంధించిన వ్యవహారంలో రూ.75లక్షలు కాజేశాడని, అదేగ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ, వైసీపీనాయకుడే చెప్పాడు. ఒకఊరిలోనే 75లక్షలు కాజేశారంటే, రాష్ట్రవ్యాప్తంగా ఎంతదోచేసి ఉంటారో ఆలోచించండి. వృద్ధులు, వితంతువులు, మహిళలు, రైతులు, యువత అందరూ ఈ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు.
నిన్న ఏ గ్రామంలో అయితే ఎమ్మెల్యే కొడుకు అవినీతిగురించి విన్నానో, అదే గ్రామంలో విదేశీవిద్య కింద చదువుకున్న ఉదయ్ కుమార్ ఉదంతం కూడా విన్నాను. అతను విదేశాల్లో చదువుకుంటూ తన కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నారు చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగింది. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఎగతాళిచేశారు. ఈరాష్ట్రాన్ని పూర్తిగా పునర్నిర్మాణంచేయాల్సి ఉంది. దేశంలోనేకాదు, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా సంపదసృష్టికర్తలుగా నిలవాలనికోరుతున్నాను. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని, ప్రజలందరూ బాగుండాలని కోరుకునే వారంతా టీడీపీపక్షాన నిలవాల్సిన సమయం వచ్చింది. అలా నిలవలేనివారు ఎక్కడున్నా… కనీసం టీడీపీకి అండగా అయినా ఉండాలి.
రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఇసుక, ఇనుము, సిమెంట్ ధరలు పెంచి, నిర్మాణరంగాన్ని దెబ్బతీశారు. భారతిసిమెంట్ ధర ఆకాశాన్నంటుతోంది. అధికారంలో ఉన్నవారి ఆదాయం రోజురోజుకీ ఆకాశానికి అంటుతుంటే, ప్రజలజీవితాలేమో రోడ్డునపడుతున్నాయి. ప్రజలు ధైర్యం చేయకుంటే రాష్ట్రం కచ్చితంగా మరో శ్రీలంక అవుతుంది. శ్రీలంకవాసులంతా ఆఖరికి తిండికోసం యాచించే దుస్థితికి వచ్చారు. ఈ ముఖ్యమంత్రి రూ.7.76లక్షలకోట్ల అప్పుతెచ్చాడు. ఆ సొమ్మంతా ఏంచేశాడంటే సమాధానంచెప్పడు. రైతులైతై ఈ మఖ్యమంత్రి చేతగానితనం వల్ల ఉరేసుకుంటున్నారు. మీరెవరూ ఉరేసుకోవద్దు.. ఈ ప్రభుత్వానికి, వైఎస్సార్ పార్టీకి ఉరేయాలని అందరినీ కోరుతున్నాను.
వెనుకబడిన వర్గాల్ని రాజ్యాధికారంలో భాగస్వాముల్నిచేసింది స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు. ఆధునీకరణలో భాగంగా చేతి, కులవృత్తుల వారికి అండగా నిలిచేందుకు వివిధరకాల పనిముట్లు, యంత్రాలను ఆదరణకింద అందించాము.
టీడీపీ హయాంలో గతంలో మంజూరైన పనిముట్లు,పరికరాలు, యంత్రాలను ఈ ప్రభుత్వం గోడౌన్లలో తుప్పుపట్టించేసింది తప్ప, బీసీలకు ఇవ్వలేదు. అదీ ఈ ముఖ్యమంత్రికి బీసీలపైఉన్న ప్రేమ. వారికి అందాల్సిన పరికరాలు వారికి అందించని ముఖ్యమంత్రి బీసీలను ఉద్ధరిస్తున్నాడా? బీసీల్లో ఉన్న 133కులాలను అధ్యయనం చేసి, ఏకులానికి ఎలాంటి ఆర్థిక చేయూత అందించాలో ఆలోచిస్తాం.
ఏ ఒక్క కులానికి అన్యాయంజరగకుండా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తాం. దేవుళ్లను, ఆలయాలను, రాజకీయనేతల్ని, ప్రజల్నిఎవరినీ వదలకుండా పీడిస్తున్న ఏకైకప్రభుత్వం ఈప్రభుత్వం. బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రతిఇంటికి వెళ్లి, ప్రభుత్వవైఫల్యాలు, ముఖ్యమంత్రి దోపిడీని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని కార్యకర్తలు, నేతలకు సూచిస్తున్నాం. రాష్ట్రంలో కోటి 40లక్షలనుంచి కోటి50లక్షల కుటుంబాలున్నాయి… ఎవరు ఏ ఇంటితలుపు తట్టారనే సమాచారం ఎప్పటికప్పుడు మాకు చేరుతుంది. బాధల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత తెలుగుదేశంపైనే ఉంది.
బాదుడేబాదుడు పేరుతో ప్రభుత్వఅరాచకాలతాలూకా సమాచారంతో రూపొందించిన స్టిక్కర్లు ప్రతి వాహనంపై కనిపించాలి. సభ్యత్వనమోదు కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతను ఈ సందర్భంగా నలుగురికి అప్పగిస్తున్నాం. సభ్యత్వనమోదు ప్రక్రియ కమిటీ సభ్యులుగా నారా లోకేశ్, చింతకాయల విజయ్, కిలారు రాజేశ్, మద్దిపాటి వెంకటరాజులు ఉంటారు. వారేంచేస్తున్నారనేది వారానికోసారి, పదిరోజులకోసారి పర్యవేక్షిస్తాను. ఏవైనా తప్పొప్పులుంటే వెంటనే వారికి చెప్పడంజరుగుతుంది. సభ్యత్వనమోదు అనేది రెగ్యులర్ గాచేయడంతోపాటు, ప్రజాస్వామ్యయుతంగా పార్టీని నడపడం.. వివిధకమిటీలను ఎంపికచేయడం చేస్తున్నాము.
అలానే దేశంలో రాజకీయ అవగాహనశిక్షణా తరగతులు నిర్వహించింది కూడా తెలుగుదేశంపార్టీనే. మిగతా రాజకీయపార్టీలకంటే ప్రజలకుఉపయోగపడే అంశాల్లో తెలుగుదేశంపార్టీ ఎప్పుడూ ముందుంటుంది. పార్టీకోసం అదిచేశాను..ఇదిచేశాను అని చాలామంది నావద్ద కూడా గొప్పలు చెప్పారు. బూత్ లవారీగా సమాచారం పరిశీలిస్తే వారి వ్యవహారం బయటపడింది. వచ్చేఎన్నికల్లో 40శాతం సీట్లు యువతకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఈరోజు మనం వేసే పునాది.. రాబోయే 40ఏళ్లలోపార్టీకి ఉపయోగపడాలి. అలానే రాజకీయాల్లో సత్తాచాటాలనకునే తటస్థులనుకూడా ఆహ్వానిస్తున్నాం. వారుప్రజలకు సేవచేయాలనుకుంటే తెలుగుదేశంపార్టీ వారికి వేదికగా నిలుస్తుంది.
ఇప్పుడున్న యువత ఆలోచనలకంటే నా ఆలోచనలే వేగంగాఉంటాయి. పార్టీలో ఉన్న యువత ఏదైనాచెబితే ‘అవుతుందా సార్’…. అంటుంటారు. తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అనిచెబుతుంటాను . మనిషి ఫిజికల్ గా, మెంటల్ గా ఫిట్ గా ఉంటే ఏదైనా సాధించగలడు. ఆరోగ్యంగా అంతాబాగున్నవారు కూడా ఏంతినాలో, ఏంతినకూడదనే నియమాలుంటాయి. ఆప్రకారమే ప్రతిఒక్కరూ నడుచుకోవాలి. నా ఆలోచన ఏమిటంటే మనంతీసుకునే ఆహారమే మనకు పరమౌషధంకావాలని, మనవంటిల్లే మనకు ఆసుపత్రిగా మారాలని.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
తెలుగుదేశంపార్టీకి బలం కార్యకర్తలే. దేశంలో, ప్రపంచంలోఏ మూలన ఉన్నా కార్యకర్తలంతా ఎత్తినపసుపుజెండాలు దించకుండా పోరాడుతున్నారు. పార్టీ వ్యవస్థాపకులైన స్వర్గీయ అన్నఎన్టీఆర్ మనకు రాముడైతే… చంద్రబాబుగారు మనకుదేవుడు. ఒక నియోజకవర్గంలో వైసీపీకార్యకర్తల దాడులకు వెరవకుండా, తెలుగుదేశం జెండాకోసం 70ఏళ్ల వృద్ధుడు తొడకొట్టి, మీసంతిప్పాడు… అదీ టీడీపీకార్యకర్త పౌరుషమంటే. కార్యకర్తలను అన్నిరకాలుగా ఆదుకోవడానికే సభ్యత్వనమోదుకి శ్రీకారం చుట్టాము.
వరల్డ్ బ్యాంక్ లో, హెరిటేజ్ లో, మంత్రిగా పనిచేసినా కలగని సంతృప్తి.. సంతోషం, టీడీపీకార్యకర్తలవిభాగం సమన్వయకర్తగా పనిచేసినప్పుడు కలిగాయి. 2004లో పార్టీఓడిపోయాక, అప్పుడున్న
ప్రభుత్వం పెద్దఎత్తున రాష్ట్రంలో ఫ్యాక్షనిజం దాడులకుపాల్పడింది. దాదాపు 167మంది పార్టీకార్యకర్తల్ని అతికిరాతకంగా హతమార్చారు. పార్టీకోసం ప్రాణాలర్పించిన వారి పిల్లల భవిష్యత్ కోసం ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ని చంద్రబాబు ప్రారంభించారు. 1250మంది విద్యార్థులు ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో ఇప్పటివరకు విద్యనభ్యసించారు. 1500మంది ఇప్పటికీ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. కార్యకర్తలు ప్రమాదవశాత్తూ చనిపోతే ప్రమాద బీమా కింద వారి కుటుంబాలకు రూ.2లక్షలు అందిస్తున్నాం.
గత 8ఏళ్లలో 4,844 మంది కార్యకర్తలు వివిధ ప్రమాదాల్లో చనిపోతే, రూ.96కోట్ల88లక్షల ప్రమాదబీమాసొమ్మని వారి కుటుంబాలకు అందించిన ఏకైక పార్టీ తెలుగుదేశంపార్టీనే. కార్యకర్తల పిల్లల చదువులకోసం రూ.2కోట్ల 80లక్షలవరకు ఖర్చపెట్టాము. కార్యకర్తలకు స్వయంఉపాధి, వారిపిల్లల చదువులనిమిత్తం రూ.20కోట్లను పార్టీ సంక్షేమవిభాగం ద్వారా ఆదుకున్నాము. 1982 నుంచి పార్టీలో ఉన్న సీనియర్లకు ప్రతినెలా పింఛన్లద్వారా 35లక్షలవరకు చెల్లించాము.
2019 నుంచి ఇప్పటివరకు ఈ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలపై పెట్టినదొంగకేసుల నుంచి వారిని బయట పడేయడానికి న్యాయసహాయంకోసం రూ.7కోట్లుఖర్చుపెట్టాము. కార్యకర్తల సంక్షేమంలో భాగంగా ఇదివరకు 1.O చూశాము…ఇకనుంచీ 2.O కొత్తవెర్షన్ చూడబోతున్నాం. కార్యకర్తలు, వారి కుటుంబసభ్యుల ఆరోగ్యానికి అధికప్రాధాన్యతఇచ్చేలా కొత్తగా తీసుకునే సభ్యత్వనమోదు కార్డుల్నితీర్చిదిద్దాము. తొలుత సభ్యత్వాన్నిపుస్తకాల్లో, తరువాత కంప్యూటర్లలోచేశాము. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్, టెలిగ్రామ్ ఫీచర్ల తో చేయబోతున్నాం.
మా కార్యకర్తలకు అండగాఉండేలా టెక్నాలజీని వాడుకుంటుంటే ఈ వేస్ట్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. సభ్యత్వనమోదుని వాట్సాప్ ద్వారాఎలాచేయొచ్చనే దాన్ని మనం లాంఛనంగా ఇదివరకు ప్రారంభించినవెంటనే, ఈ ప్రభుత్వం సిగ్గులేకుండా వాట్సాప్ వారికి నాలుగుపేజీల లేఖరాసింది. మాపార్టీ కార్యకర్తలను టెక్నాలజీతో మేం ఆదుకుంటున్నాకూడా ఈచేతగాని ముఖ్యమంత్రి ఓర్చుకోలేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి సాంకేతికపరిజ్ఞానం గురించి తెలియనప్పుడు నన్ను అడిగితే చెప్తాను కదా! వాట్సాప్ ద్వారా సభ్యత్వనమోదు చేపట్టామని, వాట్సాప్ యాజమాన్యానికి ఈప్రభుత్వం లేఖరాసింది.
ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఏంచేసినా… ఎన్నికేసులుపెట్టినా పసుపుజెండాను ఏమీ పీకలేరు. ఇప్పటికే నాపై 12కేసులు పెట్టారు.వాటికి భయపడేవాడు ఎవడూలేడని గుర్తుంచుకోండి. 2014-16, 2016-18, 2018-20లలో మూడుసార్లు ట్యాబ్ లద్వారా సభ్యత్వనమోదు నిర్వహించాము. ఇప్పుడు 2020-22కి నాలుగోసారి దేశంలో ఏపార్టీ వినియోగించని సరికొత్త సాంకేతిపరిజ్ఞానంతో సభ్యత్వాన్ని నమోదు చేయబోతున్నాం. సభ్యత్వనమోదుకి సంబంధించిన వాట్సాప్ నెంబర్ : 9858175175. ఆ నంబర్ కి హాయ్.. హలో అని మెసేజ్ పెడితే ఆటోమేటిగ్గా బాట్ వస్తుంది. దాన్నిక్లిక్ చేస్తే సభ్యత్వనమోదు ప్రక్రియవివరాలు అడుగుతుంది.
టెలిగ్రామ్ లో JAI TDP బాట్ అనికొడితే, టీడీపీసభ్యత్వం సమాచారం వస్తుంది. మూడో మార్గంలో గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే మన టీడీపీ యాప్ ద్వారా సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. ప్రతి కార్యకర్త తానొక్కడే సభ్యత్వం తీసుకోకుండా, తనకు తెలిసినవారు…తనమిత్రులుకూడా సభ్యత్వం తీసుకునేలాచూడాలని కోరుతున్నాను. టీడీపీకార్యకర్తలమైన మనందరం కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్లి సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని విజయవంతంచేద్దాం. నాడు-నేడు ఎప్పుడూ టీడీపీ కార్యకర్తలకోసం పనిచేస్తూనే ఉంటుంది. కార్యకర్తలకోసం ఏర్పాటుచేసిన ప్రత్యేకవిభాగం నడవాలన్నా, నిరుపేదలైన కార్యకర్తలకు సాయంచేయాలన్నా, పార్టీని అభిమానించే ప్రతిఒక్కరూ ఇతోధికంగా తోచినంత మొత్తం ఆర్థికసాయం అందించాలని కోరుతున్నాం. చంద్రబాబు గారు తనవంతుగా లక్షరూపాయలు అందించారు.
న్యూట్రి ఫుల్ అనే కాన్సెప్ట్ ను చంద్రబాబుగారు నాకుపరిచయంచేశారు. దానివల్లనే నేను బరువుతగ్గాను. ఆ విధానాన్నే టీడీపీకార్యకర్తలకు అందించాలన్నది జాతీయ అధ్యక్షుల వారి ఆలోచన. ఆయన ముమ్మాటికీ ఒక ట్రెండ్ సెట్టరే. డయాబెటిస్, ఓబేసిటీ, కార్డియాక్.. కేన్సర్ వంటివాటితో బాధపడేవారికి వైద్యసేవలు అందించడమేకాకుండా, ప్రతి టీడీపీకార్యకర్త జేబులో డాక్టర్ఉండేలా చూడాలన్నదే చంద్రబాబుగారి ఆలోచన. వైద్యపరీక్షలుకూడా తక్కువ మొత్తంలోజరిగేలా చూడాలనుకుంటున్నాం.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చింతకాయల విజయ్
ఆధునిక ప్రపంచంలో 90లలోనే రాష్ట్రంలో ఐటీ ఫ్లాట్ ఫామ్ వేసింది చంద్రబాబు అయితే, ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో సాంకేతికతను జొప్పిస్తూ ముందుకు వెళ్తన్నారు లోకేశ్ . ఈ దేశంలో సాంకేతికపరిజ్ఞానం వాడకంలో టీడీపీకి ఏ రాజకీయపార్టీ సరిరాదు. సభ్యత్వనమోదుని ప్రతివార్డులోజరిగేలా చూస్తాం. అలానే సభ్యత్వనమోదుని కేవలం నమోదులానేచూడకుండా, సమాజానికి,ప్రజలకు టీడీపీ ఏంచేయబోతోందోకూడా వివరిస్తాం. ప్రతికార్యకర్తను కాపాడుకోవడమే సభ్యత్వనమోదు యొక్క ముఖ్యఉద్దేశం.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మద్దిపాటి వెంకటరాజు
రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఆర్థిక అసమానతలు తొలగిస్తూ, ఎందరో అట్టడుగు వర్గాల నేతలు పైకి తీసుకు వచ్చింది తెలుగుదేశం పార్టీ నే. తెలుగుదేశంపార్టీ ఉన్నంతకాలం తెలుగువారు ఉండాలంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక్కటే ముఖ్యమైంది. కార్యకర్తలను కాపాడేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తూ, పార్టీని బలోపేతం చేయడానికి మావంతు సహాయ సహకారాలు అందిస్తాం. మాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన చంద్రబాబు గారికి, మమ్నల్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్న లోకేశ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన 40 సంవత్సరాలు పూర్తయింది. నేడు ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒకప్రత్యేకతఉంది. పార్టీపట్ల అభిమానం, అమితాసక్తి ఉండి సభ్యత్వం తీసుకోదలచిన ప్రతివారు వారి ఇళ్లవద్దనుంచే నేరుగా సభ్యత్వం తీసుకోవచ్చు. పసుపు సైనికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని నేడు చంద్రబాబు గారు ప్రారంభించారు. ఆధునిక సాంకేతికపరిజ్ఞానాన్ని సభ్యత్వనమోదు ప్రక్రియలో భాగంచేయడజరిగింది. పేపర్ లెస్ (కాగితరహిత) విధానంతో కొత్తగా ప్రారంభించిన సభ్యత్వనమోదు నాయకులకు, కార్యకర్తలకు మధ్యవారధిగా ఉండేలా సరికొత్తగా ఆరంభించాము.
సభ్యత్వం తీసుకున్నవారి చరిత్రఅంతా కార్డులోనేఉండేలా, వారిపనితనం వివరాలన్నీ తాజాగా తీసుకొచ్చిన సభ్యత్వనమోదు డిజిటల్ కార్డులో ఉండేలా చేయడంజరిగింది. పార్టీ కార్యాలయాలచుట్టూ, నాయకులచుట్టూ తిరిగేవారికి భవిష్యత్ లో ఎలాంటిపదవులు ఉండవు. ప్రజల్లోఉంటూ, వారికష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, అహర్నిశలు పార్టీకోసంశ్రమించే వారందరికీ తగినగుర్తింపు లభించేలా డిజిటల్ సభ్యత్వ తీరుతెన్నులు ఉండనున్నాయి.
లోకేష్ ఆధ్వర్యంలో వినూత్నంగా వాట్సాప్ ద్వారా సభ్యత్వనమోదు ప్రక్రియకు శ్రీకారంచుట్టాము. సభ్యత్వనమోదుని ఎవరికివారు కొత్తగా తీసు కోవాలో… పాతసభ్యత్వాన్ని ఎలా రెన్యువల్ చేసుకోవాలో వివరిస్తూ ఒకవీడియోను కూడా రూపొందించాము. (సదరువీడియోను కార్యక్రమంలోభాగంగా విలేకరులకుప్రదర్శించారు) ఒకపద్దతి, ప్రణాళిక ప్రకారం సభ్యత్వ నమోదును నిర్వహిస్తున్న ఏకైక పార్టీ దేశంలో తెలుగుదేశం ఒక్కటే. సభ్యత్వం తీసుకున్నవారికి పార్టీ అన్నివిధాలా అండగా ఉండి సహాయ సహకారాలందిస్తుందని తెలియచేస్తున్నాం. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్… టెలిగ్రామ్ ద్వారా సభ్యత్వం తీసుకునే అవకాశం తీసుకొచ్చిన లోకేశ్ గారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాం.
సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు 5ఏళ్లలో రూ.100కోట్ల వరకు బీమాసహాయం కింద చెల్లించడంజరిగింది. సభ్యత్వం తీసుకున్నవారు ప్రమాదవశాత్తూ చనిపోతే, వారికుటుంబానికి బీమాపరిహారంగా రూ.2లక్షలుచెల్లించడం జరుగుతుంది. టీడీపీ కుటుంబంలో 60లక్షల మంది సభ్యులుండటం గర్వంగా బావించాల్సిన గొప్ప విషయం. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆస్తులుకోల్పోయామని బాధపడే వారికి ఇకపై ఎవరి సిఫార్సులతో పనిలేకుండా న్యాయంజరగనుంది.
పార్టీకోసం ఎవరేంచేశారనే వివరాలతోపాటు, పూర్తిసమాచారంతో తాజాగా సభ్యత్వనమోదు చేయబోతున్నాం. గ్రామనాయకులో, మండల, నియోజకవర్గ నాయకులో రికమెండ్ చేసేవారికి, పార్టీ కార్యాలయాలచుట్టూ తిరిగేవారికి ఇకపై పదవులు ఉండవు. కష్టనష్టాలు భరించి పార్టీకోసం, నాయకుడికోసం త్యాగాలుచేసినవారికే ఇకనుంచీ నిజమైన గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వనమోదు అనేది ప్రతి గ్రామానికిచేరాలి. ప్రతిగ్రామంలో సభ్యత్వాలు ఉండేలా, కార్యకర్తలు పనిచేసేలాకొత్తవిధానం తీసుకొచ్చారు. సభ్యత్వనమోదు అనే యజ్ఞంలో అందరూ భాగస్వాములై , దాన్ని విజయవంతంచేయాలని, సమాజశ్రేయస్సు కోసం పనిచేస్తున్న తెలుగుదేశంపార్టీని బలోపేతం చేయాలని కోరుతున్నాం.
తెలంగాణ టీడీపీ అధ్యక్షులు బక్కిన నర్సింహులు
తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రతినిధులతోపాటు, దేశంలో ఉన్న తెలుగుదేశం అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పసుపుసైనికులకు సభ్యత్వనమోదుపండుగ సందర్భంగా శుభాకాం క్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తెలుగుదేశం పుట్టింది తెలంగాణలోనే. ఊరుమా రినా ఉనికిమారదు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా నిన్నతెలంగాణలోని హైదరాబా ద్ కార్యాలయంలో రక్తదానకార్యక్రమం నిర్వహించాము. చంద్రబాబు గారు తీసుకొచ్చిన బడిబాట కార్యక్రమం తెలంగాణలోనిపేదపిల్లలకు విద్యాభ్యాసంఅందించింది. తెలంగాణలో పార్టీలోఉండి పదవులు అనుభవించినవారంతా చాలామంది కాళ్లకు బుద్దిచెప్పారు. కానీ ఇప్పుడు సభ్యత్వనమోదులో తీసుకొచ్చిన కొత్తటెక్నాలజీతో సభ్యత్వం పొందేవారిసంఖ్య పెరగనుంది. ఐటీడీపీ విభాగం ఆధ్వర్యంలో, లోకేశ్ నాయకత్వంలో పార్టీసభ్యత్వనమోదు కార్యక్రమం తెలంగాణవ్యాప్తంగా విరివిగా జరిగేలాచూస్తాం. అంతరాలు, అవాంతరాలు అధిగ మించి పార్టీసేవకుడిగా సభ్యత్వనమోదుకార్యక్రమంజరిగేలా చూస్తానని తెలియచేస్తున్నాను.
తెలుగుదేశంపార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత, మాజీకేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు
తెలుగుదేశంపార్టీ సభ్యత్వనమోదు ప్రారంభంకావడం నాకు చాలాచాలా సంతోషం కలిగిస్తోంది. మరలా నేను కూడా సభ్యత్వం తీసుకోబోతున్నాను. మనపార్టీకి కార్యకర్తలే అన్నీ అయి కాపాడారు. అలాంటి కార్యకర్తలకు ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది. కార్యకర్తలతో సహా, దేవుడిని ఎవరినీ వదలిపెట్టకుండా ప్రస్తుతం ఉన్నపాలకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భారతీయతలో, మరీ ముఖ్యంగా తెలుగువారిలో పిరికితనమనేది లేదు. లేని పిరికితనాన్ని పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. మన తెలుగుదేశం అజెండాను ముందు ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎలాంటి ఉద్దేశంతో అన్నగారు పార్టీనిస్థాపించారో, ఆ లక్ష్యాలు, ఆ మహానీయుడి ఉద్దేశాలను నెరవేర్చే దిశగా ముందుకెళ్లాలని కోరుతున్నాను.
సభ్యత్వనమోదు కార్యక్రమంలో భాగంగా, అండమాన్ లోఉన్న టీడీపీనేతలు జూమ్ ద్వారా పార్టీఅధినేత చంద్రబాబుగారితో మాట్లాడారు. అండమాన్ లో పార్టీ బలోపేతానికి పాటుపడే ప్రతి ఒక్కరికీ భవిష్యత్ లో మంచి గుర్తింపులభిస్తుందని, చంద్రబాబుగారు సూచించారు. తెలుగువారంతా ఐకమత్యంతోఉండి, అండమాన్ లో ఉన్న ప్రజలకు అండగా ఉంటూ అక్కడ టీడీపీ జెండా ఎగరేయాలన్నారు.
టీడీపీసభ్యత్వనమోదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేతలు వర్లరామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,
టీ.డీ.జనార్థన్, కళా వెంకట్రరావు, నిమ్మల రామానాయుడు, పర్చూరి అశోక్ బాబు, బీ.టీ.నాయుడు, దువ్వారపు రామారావు, మంతెన సత్యనారాయణరాజు, కూనరవికుమార్, పంచుమర్తిఅనురాధ, బుర్లా రామాంజ నేయులు, కోమటి జయరాం, బుచ్చి రాంప్రసాద్, చప్పిడి రాజశేఖర్, పిల్లి మాణిక్యరావు, సయ్యద్ రఫీ, ఎం.ఎస్.రాజు, శ్రీరామ్ చిన్నబాబు, కిలారు నాగశ్రావణ్, మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గోనుగుంట్ల కోటేశ్వరావు ,దేవినేని చందు, శిష్ట్లా రోహిత్, బొద్దులూరి వెంకటేశ్వరరావు, దారపనేని నరేంద్రబాబు, నందం అబద్ధయ్య మరియు 175 నియాజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, పార్టీబాధ్యులు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున జూమ్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు.