ప్రభుత్వ పాలనా నిర్లక్ష్యం వల్ల చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి

– చిన్నారి దర్శిత్ కోసం చేసిన ప్రార్థనలు నిరర్ధకం అయ్యాయి
– టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

వైసీపీ ప్రభుత్వ పాలనా నిర్లక్ష్యం వల్ల మూడేళ్ళ చిన్నారి దర్శిత్ కి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి కన్నవాళ్ళతో పాటు రాష్ట్ర ప్రజలందరి ప్రార్ధనలు నిరర్ధకమయ్యాయి. వరుస విద్యుత్ ప్రమాదాలతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నా ఈ పాలకులకు అధికార మత్తు వదలట్లేదు. ఫలితంగా ఈరోజు ఎంతో భవిష్యత్తు ఉన్న పసివాడు అర్ధాంతరంగా కనుమూశాడు. ఇప్పటికైనా ఈ ఘటన పై విచారణ జరిపించి బాద్యులపై చర్యలు తీసుకోవాలి. దర్శిత్ కుటుంబసభ్యులకు అండగా నిలిచి నష్ట పరిహారం అందించాలి. ముఖ్యంగా ఇకపై ఇటువంటి ప్రమాదాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి.