కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు ఇవ్వాలి

– కేంద్ర కార్యాలయంలో మొమెరాండం ఇచ్చిన ఏపీ కౌలు రైతు సంఘం ప్రతినిధులు

భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా వాస్తవ కౌలు రైతులందరికీ సీసీఆర్ కార్డులు ఇవ్వాలని ఏపీ కౌలు రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాయంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి గారిని కలిసి మెమొరాండం ఇచ్చారు.

వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో కౌలు రైతులందరికీ స్కేల్ ఆఫ్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని, భూమిలేని ఓసీ కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీసీఆర్ కార్డుతో సంబంధం లేకుండా సాగు చేస్తున్న వారందరికీ ఈ-క్రాపింగ్ చేయాలని తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు, కృష్ణా జిల్లా కార్యదర్శి పి.రంగారావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సీహెచ్. సైదులు, గుంటూరు జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply