వరంగల్ : కాళేశ్వరం పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి ప్రజలకు వాస్తవాలను వివరంచడానికి మార్చి 1 చలో మేడిగడ్డకు బి ఆర్ ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.
పార్టీ కి చెందిన ఎంపీ లు,ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీ లు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్లు,డీసీసీబీ చైర్మన్లు, పార్టీ నాయకులు మరియు ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్ నుండి కాళేశ్వరం ప్రాజెక్టు లో అంతర్భాగం అయిన మేడిగడ్డ కు బయలుదేరుతున్నారు.
చలో మేడిగడ్డను జయప్రదం చేయడానికి ఏర్పాట్లను సమీక్షించడానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసం లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్యుల సమావేశం జరిగింది. చలో మేడిగడ్డ కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ నుండి భూపాలపల్లి వరకు కొనసాగుతుంది .జనగామ,ఘనపూర్, వరంగల్ బైపాస్,గుడేప్పాడు, పరకాల ,భూపాలపల్లి,మీదుగా కొనసాగుతుంది .దారిపొడవునా భద్రత ఏర్పాట్లు చెయ్యాలని,బారాస ప్రతినిధుల బృందం సిపి ని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది.
తెలిసి తెలియక మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్లకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేలా సజీవంగా చూపెడతాం. కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదు మూడు బ్యారేజ్ ల సమాహారం. కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు. కాళేశ్వరం అంటే 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ..240 టీఎంసీల వినియోగం. వీటన్నింటి సమగ్ర స్వరూపమే కాళేశ్వరం ప్రాజెక్టు’ అని తెలిపారు.
ఈ సమావేశం లో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ ,ఎంపీ పసునూరి దయాకర్ ,మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ,మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ,వరంగల్ బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ,మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి ,చల్లా ధర్మారెడ్డి ,పెద్ది సుదర్శన్ రెడ్డి ,వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ,వరంగల్ మేయర్ గుండు సుధారాణి ,జడ్పీ చైర్మన్లు సుధీర్ కుమార్ ,గండ్ర జ్యోతి ,మాజీ రాష్ట్ర రైతు రుణ విమోచన సమితి కార్పొరేషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న ,మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి ,రాష్ట్ర నాయకులు భారత్ కుమార్ రెడ్డి,మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.