Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రానికి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్

-జగన్ చేసే ఇష్టారీతి అప్పులతో ప్రజలపై భారం
-రాష్ట్రం ఎటుపోతుందోనన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది.
-కులాల వారీగా ప్రజల్ని జగన్ విడదీశారు..ఐదుగురు కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదు
-కడప, నెల్లూరు జిల్లాల్లో మెజార్టీ సీట్లు గెలవబోతున్నాం
-తీసుకున్న నిర్ణయాల్లో తప్పులుంటే సరిదిద్దుకుంటా
-టీడీపీ వచ్చాక జర్నలిస్టులపై దాడులు అరికడతాం
-నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం, సాలుచింతలలో మీడియాతో చిట్ చాట్ లో నారా లోకేష్

కోవూరు/సాలుచింతల :- రాష్ట్రానికి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు. జగన్ చేసే ఇష్టారీతి అప్పులతో ప్రజలపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం, సాలుచింతలలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…‘‘ఈ ప్రభుత్వం చేతిలో మీడియా వారూ బాధితులే. నాకు చీటింగ్ చేయడం తెలీదు..అక్రమాస్తుల కేసులు లేవు. టీడీపీ ప్రభుత్వంలో మీరు చేసిన పోరాటం ఇప్పుడు చేయడం లేదు. ఇళ్ల స్థలాల కోసం గతంలో కమిటీ వేశాం..కుదరలేదు..ఈసారి ఇస్తాం. జర్నలిజం కష్టమైన వృత్తి. తమిళనాడులో మీడియా వారికి పెన్షన్ అంశం నా దృష్టిలో ఉంది. సోషల్ మీడియా కూడా పవర్ ఫుల్ గా మారింది.

రాష్ట్రం నెంబర్ 1 గా ఉండాలన్నది చంద్రబాబు లక్ష్యం. అందులో మీడియా భాగస్వామ్యం కావాలి. టీడీపీ అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు వేధింపులు లేకుండా చేసే బాధ్యత నాది. న్యాయవాదులు కూడా రక్షన చట్టం అడుగుతున్నారు. జగన్ లా నేను భయపడను. అన్నింటికీ సమాధానం చెప్తా.

టీడీపీ హయాంలో 40 వేల పరిశ్రమలతో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అసెంబ్లీలో గౌతం రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలిస్తాం. గతంలో ఉద్యోగాలకు రాష్ట్రంలో చంద్రబాబు విత్తనం వేశారు. కియా తెచ్చాం తద్వారా 25 వేల ఉద్యోగాలు ఇచ్చాం.జగన్ చేసే అప్పులు ప్రజలపై భారాలపై మోపుతోంది. అగ్రరాజ్యాల్లోనూ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఎకానమీని ముందుకు తీసుకెళ్లాలి. చంద్రబాబే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్. రెవెన్యూ రాబడిలోనూ రాష్ట్రం వెనకబడింది. చంద్రబాబు ఉన్నప్పుడు ఉన్న గ్రోత్ రేట్ ఇప్పుడు లేదు. వ్యవసాయం వెనకబడింది.

ఇచ్చిన హామీలు తప్పకుండా టీడీపీ నిలబెట్టుకుంది. 20 లక్షల ఉద్యోగాలు సంక్షేమం కాదు..అదొక ఎకానమీ యాక్టివిటీ. కేజీ టు పీజీ కరికులమ్ మార్చేస్తాం. ధరలు పెరగడం వల్ల పెట్టుబడి పెరుగుతోంది. చేపలు, రొయ్యలు సాగులో ఇన్ పుట్ సబ్సీడీ తగ్గింది..పెట్టుబడి పెరిగింది.

ఆక్వా రైతులకు విద్యుత్ తక్కువ ధరకే అందించాం. రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఆక్వా ఏపీకి అవసరం. పక్కరాష్ట్రాల్లో వరి సాగు చేస్తున్నారు…మనమూ వరినే సాగుచేస్తే కుదరదు. గతంలో ఇచ్చిన సబ్సీడీలు మళ్లీ ఇచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది.

నెల్లూరు, కడప జిల్లాల్లో 10కి 10 సీట్లు వైసీపీకి ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో టీడీపీకి మంచి ఆదరణ ఉంది. నిన్న 8 కి.మీ 7 గంటలకు పైగా పట్టింది. మహిళలు పెద్దఎత్తున బయటకు వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారు.

రాష్ట్రం ఎటుపోతుందోనన్న ప్రజల్లో ఆందోళన ఉంది. నెల్లూరు, కడప జిల్లాలో మెజారిటీ సీట్లు సాధిస్తాం. గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు పున:ప్రారంభిస్తాం.జర్నలిస్టులకు సంక్షేమ నిధి, రిటైర్ మెంట్ తర్వాత బెనిఫిట్స్, ప్రత్యేక చట్టం గురించి పార్టీ పెద్దలతో మాట్లాడి నేను నిర్ణయం ప్రకటిస్తాం.

సమాజాన్ని జగన్ గీత గీసి విడదీశారు. ఇది మీడియాకూ అంటుకుంది. మీడియాను విడదీసింది జగనే. ఇది చాలా దూరం వెళ్లింది. మా కార్యకర్తల్లోనూ ఆవేదన ఉంది. మా తల్లిని అవమానించలేదు..రాజకీయం కోసం మాట్లాడుతున్నానని వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు.

జగన్ అసెంబ్లీ ప్రతిష్టనూ దిగజార్చారు. కొన్ని ఛానల్స్ వైసీసీ ప్రోత్సాహంతో లేనిది ఉన్నట్లు చూపిస్తూ..వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాయి. తప్పులు చూపిస్తే సరిదిద్దుకోవడానికి సిద్దంగా ఉన్నా. ఐదుగురు వేరు వేరు కులస్తులు కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి ఉందా.? ఇదంతా ఐ ప్యాక్ తెచ్చిందే. రామ్ గోపాల్ వర్మ కూడా ఇక్కడ కులాల ప్రస్తావన తెస్తున్నారు..అదే తెలంగాణలో మాట్లాడితే తంతారు. పూతలపట్టులో జర్నలిస్టులకు అవకాశం ఇచ్చాం.

జగన్ లా ఊరికో హామీ నేను ఇవ్వను..రక్షణ చట్టంపై స్టడీ చేస్తాం. టీడీపీ కార్యకర్తలపై, కార్యాలయాలు, బీసీ, దళితులపై దాడులు చేస్తే మాపై కాదు కదా..అని అందరూ అనుకున్నారు. నన్నూ వ్యక్తిగతంగా దూషించారు. జాఫర్, విజయ్ పాత్రుడు ఫ్యామిలీని బయటకు లాగారు. అది రేపు మీ ఇంటికి కూడా వస్తుంది.

2012 నుండి నన్ను, బ్రాహ్మణిని ట్రోల్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా వెళ్తే భయపడతారనేది వైసీపీ విధానం. మీడియాపై దాడి జరిగితే టీడీపీ అండగా ఉంటుంది. బకాయిలు పెట్టడం వల్ల ఆరోగ్య శ్రీ పనిచేయడం లేదు. మేమొచ్చాక స్ట్రీమ్ లైన్ చేసి, సక్రమంగా అమలు చేస్తాం.

మా ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టులపై దొంగ కేసులు ఉండవు. మీడియా మిత్రుల గొంతు నొక్కే జీవోలు వస్తే మీ సంఘాలు ఎందుకు స్పందించడం లేదు.? జర్నలిస్టులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటాం. విద్యుత్ రంగాన్ని చంద్రబాబు అర్థం చేసుకుని సోలార్ రంగాన్ని ప్రోత్సహిస్తాం.

మిగులు విద్యుత్ లో ఏపీ అగ్రస్థానంలో ఉండాలన్నది చంద్రబాబు ఆలోచన. వైసీపీ వచ్చాక 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. పీపీఏలు జగన్ వచ్చాక రద్దు చేశారు. డిమాండ్ పెరిగేకొద్దీ..అధిక ధరకు కొంటున్నారు. ఆ భారం ప్రజలపై పడుతోంది.

స్మార్ట్ మీటర్ల కొనుగోలులోనూ అవినీతికి పాల్పడుతున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే విద్యుత్ ఛార్జీలు తక్కువ ఉండాలి..గతంలో మేము తక్కువకే అందించాం..కానీ ఇప్పుడు మన రాష్ట్రంలోనే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

లక్ష కోట్లు ఉన్న వ్యక్తికి పేదల బాధలు తెలియవు. ప్రజలతో పాటు జర్నలిస్టులకు కూడా మూడేళ్లలోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. విభజన అనంతరం పాలించడానికి రూములు కూడా లేవు. రైతులను ఒప్పించి 32 వేల ఎకరాలు రాజధానికి సేకరించాం..అందులో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ నాలుగేళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

యూట్యూబ్ ఛానల్స్ కు ట్రాక్షన్ ను బట్టి అక్రిడేషన్ అందిస్తాం. జర్నలిస్టులకు రుణాలు ఇవ్వడం బ్యాంకు పరిధిలోని అంశం. దామాషా ప్రకారం అన్ని కులాల వారికి నిధులు కేటాయిస్తాం. ఏపీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి.

అభివృద్ధిపై చర్చకు నేను రెడీ..ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి. మాజీమంత్రి అనిల్ అవినీతికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా బయటపెడతాం. జగన్ కూడా ఊరూరా హామీలిచ్చారు..అవికూడా విడుదల చేస్తాం. అనిల్ కు నెల్లూరు సిటీ టికెట్ ఉందా..లేదా.? జగన్ చెప్పారా.? నెల్లూరు ప్రజలు అనిల్ ను ఓడిస్తారు. అనిల్ మొదట టికెట్ తెచ్చుకోవాలి. కార్పొరేట్ సీట్లు కూడా అనిల్ అమ్ముకున్నాడు.

వివేకాను మేము హత్య చేయించలేదని గతంలో వెంకన్నపై ప్రమాణం చేశా..అనిల్ కూడా తాను అవినీతికి పాల్పడలేదని చేయాలి. ఏపీలో మొదటి సారిగా కుప్పంలో 2 ఎకరాలు భూమి కొన్నాం. మేము అవినీతి చేసుండుంటే బయట ఉండేవాళ్లమా.?

ఉద్యోగాల కోసమే పరిశ్రమలకు విలువైన భూములిచ్చాం. మా అస్తులు ఎంతున్నాయో ప్రకటిస్తున్నాం.. జగన్ తో నన్ను పోల్చవద్దు. నేను తీసుకున్న నిర్ణయాల్లో తప్పులుంటే సరిదిద్ధుకోవడానికి సిద్ధంగా ఉన్నా.

నారా లోకేష్ ను కలిసిన కోవూరు రైతులు :
కోవూరుకు చెందిన రైతులు యువనేత నారా లోకేష్ ను కలిసి వినతి పత్రం అందించారు.
• మేము సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.
• సాగునీటి నీటి సమస్యకు పరిష్కారానికి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలి.
• పెన్నానది నుంచి గొలుసుకట్టు చెరువులకు నీరు సరిగా అందక తాగు, సాగు నీటికి ఇబ్బందిగా ఉంది.
• ప్రస్తుత ప్రభుత్వానికి ఎన్ని అర్జీలు పెట్టినా లాభం లేకుండా పోయింది.
• మీరు అధికారంలోకి మా సమస్య పరిష్కరించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
• టిడిపి ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, వనరులపై రూ.68,294 కోట్లు ఖర్చుచేస్తే, జగన్ వచ్చాక అందులో నాలుగోవంతు కూడా ఖర్చుచేయలేదు.
• టిడిపి అధికారంలోకి రాగానే లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుచేసి కోవూరు ప్రజల సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం.
• రాష్ట్రంలో రైతాంగ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది.

నారా లోకేష్ ను కలిసిన మీ-సేవ ఉద్యోగులు
కోవూరు నియోజకవర్గం మండబయలు గ్రామంలో మీ-సేవ సిబ్బంది యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• ప్రజలకు మెరుగైన సేవలందించాలన్న ఉద్దేశంతో 2003లో చంద్రబాబునాయుడు మీ-సేవ వ్యవస్థను ప్రారంభించారు.
• గత 19 సంవత్సరాలుగా 139రకాల సేవలను మీ-సేవ కేంద్రాలద్వారా ప్రజలకు అందిస్తున్నాము.
• ప్రస్తుతం మాకు రూ.8వేలు మాత్రమే వేతనంగా ఇస్తున్నారు, ఉద్యోగ భద్రత లేదు.
• వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2020 మార్చి నుంచి రామ్ ఇన్ఫోటెక్ వారు మాకు ఇవ్వాల్సిన జీతాలు, పిఎఫ్, ఈఎస్ఐ చెల్లించడం లేదు.
• సచివాలయ వ్యవస్థ రాకతో మీ-సేవలు కూడా నిలచిపోయాయి.
• దీర్ఘకాలంగా జీతాల్లేక, వేరే ఉద్యోగాలు చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.
• మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• ప్రజలకు మెరుగైన పౌరసేవలను అందించాలన్న ఉద్దేశంతో చంద్రబాబునాయుడు మీ-సేవ వ్యవస్థను ఏర్పాటుచేశారు.
• దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఈ వ్యవస్థను జగన్ అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేశారు.
• వేలాదిమంది మీ-సేవ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది జీవితాలను అగమ్యగోచరంగా మార్చారు.
• తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మీ-సేవ వ్యవస్థను మరింత సమర్థవంతంగా వినియోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం.
• మీ-సేవ ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలను అందజేసి, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన యానాది సామాజికవర్గీయులు
కోవూరు నియోజకవర్గం గుమ్మలదిబ్బ ఎస్టీ కాలనీలో యానాది సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు రుణాలు ఇచ్చింది..కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎటువంటి రుణాలు ఇవ్వడం లేదు.
• గత ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ కింద రుణాలు, ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేది. ఈ ప్రభుత్వంలో ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించడం లేదు.
• యానాదుల అభివృద్ధికి గతంలో ఇన్నోవా కార్లు, ట్రాక్టర్లు, పంపుసెట్లు వంటివి అందాయి..ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని మాకు ఇవ్వడం లేదు.
• గతంలో ఉచిత విద్యుత్ మాకు అందేది..ఎరువులు కూడా అందేవి.
• విద్యుత్ ఛార్జీలు పెంచడంతో ప్రస్తుతం బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం.
• ఇటీవల కాలం నుండి యానాదులపై కారణం లేకుండా దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.
• ఎస్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందేవి..కానీ ఇప్పుడు లేవు.
• మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్టీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారు.
• అధికారంలోకి వచ్చాక రూ.5,355 కోట్ల ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన గిరిజన ద్రోహి జగన్ రెడ్డి.
• కాసుల్లేని కార్పొరేషన్ ఏర్పాటుచేసి, యానాదులను మోసగిస్తున్నారు.
• టీడీపీ హయాంలో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 50 శాతం సబ్సిడీతో స్వయం ఉపాధి రుణాలు అందించాం.
• జగన్ సీఎం అయ్యాక 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారు.
• ఎస్టీ యువత ఉన్నత చదువులు చదవుకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేశాడు. మేము వచ్చాక పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తాం.
• ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో యానాది కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, వారి అభివృద్ధికి కృషిచేస్తాం.

LEAVE A RESPONSE