– నారా లోకేష్ సమక్షంలో 200 మంది పార్టీలో చేరిక
యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభానికి ముందే మంగళవారం సాయంత్రం సాలుచింతల క్యాంప్ సైట్ లో వైసిపికి చెందిన కీలక నాయకులు, వారి అనుచరులు తెలుగుదేశంపార్టీలో చేరారు. యువనేత లోకేష్ వారందరికీ పసుపుజెండాలు కప్పి, సాదరంగా ఆహ్వానించారు.
రాష్ట్రంలో నెలకొన్న అరాచకపాలనపై పోరాటానికి టిడిపి సిద్ధాంతాలకు కట్టుబడి వచ్చే వారెవరినైనా పార్టీలోకి స్వాగతిస్తామని చెప్పారు. కొడవలూరు మండలం కమ్మపాలెంకు చెందిన వైఎస్సార్ సిపి రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి, రూరల్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరక్టర్ నాపా వెంకటేశ్వర్లు నాయుడు 200మంది అనుచరులతో వచ్చి లోకేష్ సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీలో చేరిన ప్రముఖుల్లో కె.కిషోర్, ఎన్ అమరయ్య, మల్లిఖార్జున, ఎన్.బాలకృష్ణ, ఎన్.రామారావు, సాదు శ్రీకాంత్, కన్నం చైతన్య, ఆనంద్, కుందుర్తి నాగేశ్వరరావు, కుందుర్తి ఏసోబు, కుందుర్తి కోటయ్య, కుందుర్తి ఇస్రాయిల్, గరిక నరసింహరావు, ఉండ్రాళ్ల ఏలియేజర్, ఎ.పెంచలనాయుడు తదితరులు ఉన్నారు.