గుంటుపల్లి నాగేశ్వరరావు మృతికి చంద్రబాబు సంతాపం

కుటుంబ సభ్యలకు ఫోనులో పరామర్శ

అమరావతి :- తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గుంటుపల్లి నాగేశ్వరరావు మృతిపట్ల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. గురజాల నియోజకవర్గానికి చెందిన నాగేశ్వరరావు ఇటీవల అనారోగ్యానికి గురై నేడు కన్నుమూశారు. కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫోనులో మాట్లాడి పరామర్శించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ పదవులతో పాటు, రాష్ట్ర స్థాయిలో నాగేశ్వరరావు నాయకత్వం వహించారని చంద్రబాబు అన్నారు. పార్టీ క్రమశిక్షణా సంఘం జాతీయ సభ్యులుగా సేవలందించారని అన్నారు. నాగేశ్వరరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Leave a Reply