టిడిపి మీడియా కోఆర్డినేటర్ నరేంద్ర అరెస్టును ఖండించిన చంద్రబాబు

అమరావతి:- తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రను సిఐడి పోలీసులు అరెస్టు చెయ్యడాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. కోర్టు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా సిఐడి పోలీసుల తీరుమారడం లేదని చంద్రబాబు మండి పడ్డారు. ఇదే కేసులో జర్నలిస్ట్ అంకబాబు అరెస్టును కోర్టు తప్పు పట్టిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. పార్టీ కార్యాలయంలో పని చేసే వారిని అరెస్టు చేసి భయపెట్టాలనే సిఎం జగన్ వైఖరిని ఖండించారు. ఇటువంటి కేసుల్లో 41 A నోటీసు ఇవ్వాలని నిబంధనలు స్పష్టంగా చెపుతున్నా….పోలీసులు అందుకు భిన్నంగా వ్యవహరించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా రాత్రి పూట చేస్తున్న అరెస్టులు కోర్టులో నిలబడవని చంద్రబాబు అన్నారు. అక్రమ అరెస్టులపై పోలీసులను కోర్టు షో కాజ్ అడిగినా వారి తీరు మారకపోవడాన్ని తప్పు పట్టారు. దీనికి అధికారులు తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. వెంటనే పార్టీ నేత నరేంద్రను విడుదల చెయ్యాలని పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.

Leave a Reply