Suryaa.co.in

Andhra Pradesh

ప్రతిభావంతుడు గుణిపల్లి లచ్చన్నకు ట్రై సైకిల్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు

జగ్గంపేటకు మండలం కాట్రావులపల్లెకు చెందిన విభిన్న ప్రతిభావంతుడు గుణిపల్లి లచ్చన్నకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ట్రై సైకిల్ అందించారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత జగ్గంపేట పర్యటనకు వెళ్ళినప్పుడు లచ్చన్న చంద్రబాబును సాయం కోరారు. నాడు ట్రైసైకిల్ ఇస్తాను అని హామీ ఇచ్చిన పార్టీ అధినేత ఈ రోజు లచ్చన్నకు లక్ష రూపాయల విలువైన ట్రై సైకిల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE