Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు నాయుడి రా…కదలిరా సభలతో వైకాపా నాయకులకు మతిచలించింది

– కోర్టులో పత్రాలు దొంగతనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడి కేసులు గురించి మాట్లాడటం విడ్డూరం
– వ్యవసాయం రంగంపై బహిరంగ చర్చకు సిద్ధం
– వ్యవసాయ రంగానికి జగన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని నిరూపించడానికి మేం సిద్దం
– వ్యవసాయశాఖా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

చంద్రబాబు నాయుడు రా..కదలిరా సభలతో వైకాపా నాయకులకు మతి చెలించిందని…అందుకే కాకాణి గోవర్ధన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెదేపా సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన విమర్శలపై స్పందిస్తూ సోమిరెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు.

కోర్టులో పత్రాలు దొంగతనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడి కేసులు గురించి మాట్లాడటం విడ్డూరం. చట్టానికి దొరికిపోతామని కోర్టు నుంచి ఆధారాలను మాయం చేసిన వ్యక్తి కాకాణి. కోర్టులో పత్రాల దొంగతనంపై సీబిఐ విచారణ జరిపించాలని నాడు తెలుగుదేశం డిమాండ్ చేస్తే ఉలుకు-పలుకు లేని కాకాణి నేడు సీబీఐ విచారణకు పిలవడం దొంగే..దొంగా, దొంగా అన్నట్లు ఉంది.
వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిన వ్యక్తి జగన్ రెడ్డి.

ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 ఇస్తామని హామీ ఇచ్చి.. రూ.7,500లకే పరిమితం చేశారు. ఏడాదికి రూ.6 వేలు చొప్పున 5 ఏళ్లలో రైతుకు రూ.30వేలు ఎగనామం పెట్టారు. కౌలు రైతులు 15.36 లక్షల మంది ఉండగా.. లక్ష మందికి కుదించారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు కులాలను అంటగట్టిన వ్యక్తి జగన్ రెడ్డి. బీమా ప్రీమియం మొత్తాన్ని తామే చెల్లిస్తామంటూ ఉచిత పంటల బీమా పథకాన్ని నీరు గార్చారు. బీమా ప్రీమియం కట్టకుండానే కట్టినట్లు అసెంబ్లీలో అబద్దమాడారు.చంద్రబాబు నిలదీసిస తర్వాత రాత్రికిరాత్రి జీవో విడుదల చేశారు. ఇన్ పుట్ సబ్సీడీ చెల్లింపుల్లో మోసం చేశారు.

జగన్ పాలనలో సంభవించిన తుఫాన్ల ధాటికి 60 లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతింటే అంకెల గారఢీ చేస్తూ అరకొర సాయం చేశారు. సున్నా వడ్డీకి అడ్డగోలు నిబంధనలతో లబ్దిదారుల సంఖ్య కుదించారు. ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదు. లక్ష లోపు రుణానికే సున్నావడ్డీ పరిమితం చేశారు.

రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం ఇస్తామని చెప్పి మోసం చేశారు. దేశంలోనే ఎక్కువ అప్పులున్న రైతు కుటుంబాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని కేంద్రం వెల్లడించింది. ప్రతి రైతు కుటుంబంపై రూ.2.45 లక్షల అప్పు ఉంది. వ్యవసాయాన్ని ఇంతటి సంక్షోభంలోకి నెట్టి వ్యవసాయ రంగాన్ని ఉద్దరించినట్లు కాకాణి మాట్లాడుతున్నారు. కాకాణికి రైతులపై ఏమాత్రం చిత్తశుద్ది ఉన్న బహిరంగ చర్చకు రావాలి. వ్యవసాయ రంగానికి జగన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని నిరూపించడానికి మేం సిద్దంగా ఉన్నాం.

LEAVE A RESPONSE