-రాష్ట్రంలో మరో స్వాతంత్ర్యపోరాటానికి ఇరుపార్టీల సన్నద్ధం
-వైసిపి రౌడీయిజాన్ని ఎదుర్కోవడానికి ఉమ్మడి ప్రణాళిక
-ఇద్దరినేతల భేటీతో వైసిపి నేతల ప్యాంట్లు తడుస్తున్నాయి
-ప్యాకేజిలకు పేటెంట్ వైసిపి అధినేత జగన్ రెడ్డిదే!
-2004లో వైఎస్… కెసిఆర్ కు ఎంత ప్యాకేజి ఇచ్చారు?
-పోలీసులకు దమ్ముంటే వీధిరౌడీ భరత్ పై 307 కేసు పెట్టండి!
-బిపిలు మీకే కాదు… 5కోట్ల జనానికి కూడా వస్తాయి జగన్ రెడ్డీ!
-టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజం
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం సాయంత్రం పట్టాభిరామ్ విలేకరులతో మాట్లాడుతూ…. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది మరో స్వాతంత్ర్య పోరాటం. వైసిపి సైకో పాలనుంచి ప్రజలకు స్వేచ్చ కోరుకుంటున్నారని అన్నారు.
వైసిపి ప్రభుత్వ రౌడీయిజం, అరాచకాన్ని ఎదుర్కొనేందుకు ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్లాలని చంద్రబాబు, పవన్ ఈరోజు నిర్ణయించుకున్నారని తెలిపారు. వైసిపి మంత్రులు, నేతలు ప్యాకేజిలంటూ అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారు. అడ్డంగా ప్రజాధనాన్ని దోచుకోవడం, ప్యాకేజిలు ఇవ్వడం వంటి అలవాటు ఉన్నది వైసిపి వాళ్లకు తప్ప తమకు కాదని తెలిపారు. పవన్, చంద్రబాబు కలిశారని వైసిపి నేతలు ప్యాంట్లు తడుపుకుంటున్నారు. మీ అందరికీ డైపర్లు పంపిస్తాం. ఇకపై వాటిని తొడుక్కొని తిరిగితే మంచిదని పట్టాభిరామ్ ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో పట్టాభి ఏమన్నారో ఆయన మాటల్లోనే…
ప్యాకేజిలు ఇవ్వడానికి మావద్ద దోపిడీ సొమ్ములేదు!
పవన్ కళ్యాణ్ కు సంఘీభావం తెలియజేయడానికి ఈరోజు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆయనను కలవడం జరిగింది. ఈ సమాచారం తెలిశాక ఏంచేయాలో పాలుపోని వైసిపి మంత్రులు, నాయకులు మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఈవాళ నోరుపారేసుకున్న వైసిపి సన్నాసులందరినీ కూడా కొన్ని ప్రశ్నలందరినీ కొన్ని ప్రశ్నలు అడగదలచుకున్నా. ప్యాకేజి అని మాట్లాడుతున్న మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మావద్ద మీలాగా దోచుకున్న సొమ్ము లేదు. మీవద్ద వేలకోట్ల పాపపు సొమ్ము ఉంది, ప్యాకేజి ఇవ్వడానికి మీ వద్దే ఉంది. ఊరికో ప్యాలెస్ కట్టుకొని అందులో దోచుకున్న సొమ్ము పెట్టుకున్నారు. మీలాగా ప్యాకేజిలు ఇచ్చే డబ్బు ఉంటే ఈ పరిస్థితుల్లో మేము ఎందుకుంటాం. దోచుకున్న సొమ్ముతో ప్యాకేజిలు ఇచ్చిపుచ్చుకునే అలవాటు ఉన్నది మీకే. 2004లో వైఎస్ కెసిఆర్ కి ఏం ప్యాకేజి ఇచ్చి తెచ్చుకున్నారు. 2004లో ఎంత ప్యాకేజితో కెసిఆర్ మద్దతు తీసుకున్నారు? మీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి కెసిఆర్ కు ఏం ప్యాకేజి ఇచ్చాడో సమాధానం చెప్పగలరా?
ప్యాకేజిలకు పేటెంట్ హక్కు జగన్ రెడ్డిదే!
ప్యాకేజిలకు పేటెంట్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిదే. గంగవరం పోర్టులో ఏ ప్యాకేజికి ఒప్పుకుని అమ్మారు. ఏ ప్యాకేజికి ఒప్పందం కుదుర్చుకొని దసపల్లా భూములు కట్టబెడుతున్నారు? గంజాయి మాఫియాతో ఎంత ప్యాకేజి కుదుర్చుకొని ఉత్తరాంధ్రను గంజాయికి అడ్డాగా మార్చారు? ఏ డ్రగ్ డీలర్ ఎంత ప్యాకేజి కుదుర్చుకున్నారు? మన్యం ప్రాంతంలో దోచుకుంటున్న వేలకోట్ల బాక్సయిట్ కు ఎవరితో డీల్ కుదుర్చుకున్నారో సమాధానం చెప్పండి. ఎల్ జి పాలిమర్స్ ను పిలిపించుకొని సైకో స్టార్ జగన్ ఎంత ప్యాకేజి కుదుర్చుకున్నారు. పోస్కో కంపెనీ వారితో మీ ప్యాకేజి ఎంతో సమాధానం చెప్పండి. వారిని తాడేపల్లి ప్యాలెస్ కు ఎందుకు ఆహ్వానించారు?
ప్యాకేజిల గురించి మీరు మాట్లాడాతారా? జెపి వెంచర్స్ తో ఎంత ప్యాకేజి కుదుర్చుకున్నారు? లిక్కర్ సిండికేట్ తో, డిస్టిలరీస్ తో ఎంత ప్యాకేజి కుదుర్చుకున్నారు? మీరు కుదుర్చుకున్న ఈ ప్యాకేజిల లిస్టు చదవాల్సి వస్తే కొన్ని వందలున్నాయి. ప్యాకేజి అన్న పదానికి పేటెంట్ రైట్ మీదే. మీరు ఇతరులకు ప్యాకేజిలు అంటగడతారా? మీ ప్యాకేజిల బాగోతం రాష్ట్రం అంతా చూస్తోంది. ఎవరతో ప్యాకేజి కుదుర్చకుని దోచుకుంటున్నారో, తెగనమ్ముతున్నారో రాష్ట్రం చూస్తోంది. పెయిడ్ మీడియాను అడ్డుపెట్టుకుని బురదజల్లితే నమ్మే పరిస్థితి లేదు.
శాంతిభద్రతల గురించి మీరా మాట్లాడేది?
పేర్ని నాని, జోగి రమేష్, అంబటి రాంబాబు వంటివారు ఈరోజు శాంతిభద్రతల గురించి మాట్లాడుతున్నారు. పేర్ని నాని రాడ్లు, కర్రలతో దాడి చేస్తారా అంటున్నారు. మా పార్టీ ఆపీసుపై దాడిచేసినపుడు వైసిపి వీధికుక్కలు, సైకోగాళ్లు ఏం పట్టుకొని వచ్చారో తెలియదా? గత ఏడాది వైసిపి మూకలు మారణాయుధాలతో ఆఫీసుపై దాడిచేసి, సిబ్బందిని దాడిచేసినరోజు మీకు శాంతిభద్రతలు గుర్తుకురాలేదా? కడపలో మీ నాయకుడి బతుకే ఫ్యాక్షన్, రౌడీయిజం. మా ఇంటిపైనా, నాపై దాడిచేసి గాయపర్చిన రోజున మీ సైకోగాళ్లచేతిలో ఏం ఉన్నాయి?
రాజమండ్రిలో వీధిరౌడీ భరత్ ఈరోజు రాజధాని రైతులపై చేసింది ఏమిటి? రాళ్లు విసిరి, పెట్రోలు చల్లుతారా? మేం చేతికి గాజులు తొడుక్కుని ఉన్నామా, దమ్ముంటే ఎంపిపై 307 సెక్షన్ పెట్టండి. సిఐడి పోలీసులు మాపై తప్పుడు కేసులు పెట్టడం కాదు. రాజమండ్రి ఎంపిపై 307 పెట్టండి చూద్దాం. ఇళ్లపైకి వచ్చి కొడతారా… మీరు చేసింది ఏమిటి? రాష్ట్రంలో ఎంతమంది తెలుగుదేశం వారి ఇళ్లపైకి వచ్చి తగులబెట్టారు? జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు ఇంటిపైకి వచ్చి దాడిచేసి ఘనతగా చెప్పుకుంటున్నారు. అవసరమైతే మరోసారి వస్తామని అంటున్నారు. నువ్వు మారణాయుధాలతో వచ్చింది వాస్తవం కాదా? గొప్ప ఘనకార్యం చేసినట్లు చెబుతున్నావు. దమ్ముంటే ఈసారి చంద్రబాబు ఇంటి దరిదాపులకు రా చూసుకుందాం… తాటతీస్తాం.
కులగజ్జితో పబ్బం గడుపుకుంటున్నది ఎవరు?
ప్రజాసేవలో ఉన్నవారికి కులం ఉంటుందా అని గుడివాడ అమర్నాథ్ నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు పొద్దున లేచి ఏ మర్రిచెట్టు కింద కూర్చొని జ్జానోదయం పొందారు? పొద్దున లేస్తే మీరు మాట్లాడేది ఏమిటి? విజయసాయి రెడ్డి ఏం మాట్లాడాడు? కులగజ్జి, కులపిచ్చితో రోడ్లపై వీరంగం వేసిన మీరు రాజకీయ పార్టీలకు కులాలు ఉండటవని మాట్లాడుతున్నారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకొనే సైకోలు మీరు. మా ఓర్పు, సహనానికి ఓ హద్దు ఉంటుంది. మా సహనాన్ని పరిక్షించేలా మీరు చేస్తున్న పనులు. పోలీసు, సిఐడిని అడ్డుపెట్టుకొని మీరు చేస్తున్న అరాచకాలతో సహనం చచ్చిపోవడం వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది. మాటలు మాట్లాడేముందు మీ చేతలు ఎలా ఉన్నాయో గుర్తుతెచ్చుకోండి.
బిపిలు 5కోట్లమంది ప్రజలకు కూడా వస్తాయి!
సైకో స్టార్ జగన్ రెడ్డి టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినపుడు ఏమన్నారు? మా కార్యకర్తలకు బిపిలు వచ్చి దాడిచేశారని అన్నారు. బిపిలు వచ్చేది మీకేనా, మీ పాలనతో విసిగి వేసారిపోయిన ప్రజలకు రావా? పెరిగిన కరెంటు బిల్లు, నిత్యావసర వస్తువుల ధరలు, ఇళ్లపన్నులు చూసినపుడు 5కోట్లమంది ప్రజలకు కూడా బిపి వస్తోంది. అణచివేతకు గురవుతున్న ప్రతిపక్షనేతలకు బిపి వస్తోంది.. మీరు చేసిన పనులు గుర్తు తెచ్చుకుంటే ఈ పరిస్థితికి కారణమెవరో అర్థమవుతుంది. పవన్, చంద్రబాబు కలిసినప్పటి నుంచి ప్యాంట్లు తడుపుకుంటున్నారు.
మీ అందరికీ డైపర్ లు పంపిస్తా. డైపర్ లు వేసుకొని తిరగండి. ఎంత భుజాలు తడుముకున్నా చంద్రబాబు, పవన్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసమే కలిశారు. శాంతిభద్రతల విఘాతం గురించి మాట్లాడుతున్నారు. మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అమరావతి వెళ్తున్నటిడిపి అధినేత చంద్రబాబుపై దాడి భావప్రకటనా స్వేచ్చ అంటారా? ఆరోజే మీ విధ్వంసకాండ ఆరంభమైంది. మూడున్నరేళ్లుగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ,బిసిలపై దాడులు చూశాక రాష్ట్రంలో ఎక్కడైనా శాంతిభద్రతలు ఉన్నాయని చెప్పగలరా? శాంతిభద్రతల గురించి మీరు మాట్లాడటం దెయ్యాలు, వేదాలు వల్లించినట్లుగా ఉంది.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఇరువురి నేతల కలయిక
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలి. ప్రజలకు స్వేచ్చ కావాలి. ప్రజాస్వామ్యం బతికితినే రాజకీ పార్టీలకు మనుగడ ఉంటుందన్న ఉద్దేశంతో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇద్దరు నేతలు కలిశారు. కలిసివచ్చి పార్టీలను కలుపుకుంటామని చెప్పారు. ప్రజాస్వామ్యం బతకాలని టిడిపి-జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి చూశాక రాజ్యాంగం హక్కులను పొందేలా ప్రజల ఆకాంక్ష మేరకు నిర్ణయం తీసుకున్నారు. రౌడీయిజనాన్ని, అరాచకాన్ని ఎదుర్కోవడానికి ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్తాలన్నదే ఇరుపార్టీల లక్ష్యం. వైసిపి మంత్రులు, నాయకులందరికీ ఒకటే చెబుతున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నది మరో స్వాతంత్ర్య ఉద్యమం. బ్రిటిష్ పాలకుల చెరనుంచి దేశానికి విముక్తికోసం నాడు జరిగిన ఉద్యమమే ఎపి నుంచి సైకోస్టార్ చెరనుంచి రక్షించడానికి మరోమారు పునరావృతమవుతోంది. జగన్ రెడ్డి కబంధ హస్తాలనుంచి రాష్ట్రప్రజలను కాపాడటానికి అన్నిరకాలుగా యుద్ధానికి మేం సిద్ధంగా ఉన్నాం.
ఇకనైనా వైసిపి నేతలు ఒళ్లు బలుపు తగ్గించుకుంటే వారికే మంచిది. నిత్యం గుడివాడ గుట్కా నాని, రోజారెడ్డి మాట్లాడే మాటలు మీకు కనపడవా? రౌడీ ముఠాలు, గూండాలకు భయపడే వారు టిడిపి, జనసేనలో ఎవరూ లేరు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మాత్రమే ఇరుపార్టీల నేతలు ఒక నిర్ణయం తీసుకున్నారు. వారి భేటీలో ఎన్నికల పొత్తుపై చర్చ జరగలేదు. సైకో ప్రభుత్వంపై రెండుపార్టీలు కలిసి పోరాడాలని నిర్ణయించాయి. అవసరమైతే మరిన్ని సమావేశాలు ఏర్పాటుచేసుకొని ప్రజలు స్వేచ్చాయుతంగా జీవించే వాతావారణం కలిగించేలా పోరాడాలని నిర్ణయించాయి. వైసిపి నేతలు ఇకనైనా పద్దతి మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకపోతే తిరుగుబాటును ఎదుర్కోకతప్పదని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ హెచ్చరించారు.