Suryaa.co.in

Andhra Pradesh

అనంతపురం జిల్లాలో విద్యుత్ ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి

అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం దుర్గాహోన్నూరులో వ్యవసాయ కూలీలపై విద్యుత్ తీగలు తెగిపడి నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందడం అత్యంత విషాదకరం. విద్యుత్ తీగలు తెగిపడటం వారం రోజుల్లో ఇది రెండోసారి. మొన్న ఒక్కరోజే ఈ తరహా ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? విద్యుత్ శాఖ పర్యవేక్షణ ఏమయ్యింది…నిర్వహణ ఎందుకు అటకెక్కింది? ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ఈ ప్రభుత్వానికి పట్టదా? ప్రమాద ఘటనలపై సమగ్ర విచారణ జరపాలి. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి.

LEAVE A RESPONSE