Suryaa.co.in

Andhra Pradesh

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

– పేదలకు అన్నదానాలు, పండ్లు పంపిణీ చేసిన పార్టీ శ్రేణులు
– రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటాయి. తమ అధినేత జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ శ్రేణులు కేట్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపాయి. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. మూసేసిన అన్నా క్యాంటీన్ల వద్ద అన్నదానం, వస్త్ర వితరణ, రక్తదానం, రోగులకు పండ్ల పంపిణీ చేశారు. మరి కొన్ని చోట్ల టెంకాయలు కొట్టి చంద్రబాబుకు నిండు జీవితాన్ని ప్రసాదించాలని దేవున్ని వేడుకున్నారు.

ఈ సందర్భంగా నేతలు.. చంద్రబాబు హయాంలో జరగిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో నీతి, నిజాయితీతో రాష్ట్ర అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. తెలుగురాష్ట్రాల్లో చంద్రబాబు చేసిన అభివృద్ధి తప్ప, మరేమీ కనిపించదని పేర్కొన్నారు.

ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే, ఆత్మవిశ్వాసంతో ఏదైనా చేయగలరని చంద్రబాబు చూపించారని స్పష్టం చేశారు. చంద్రబాబు దార్శనికత, ఆయన పోరాట పటిమ అందరికీ స్ఫూర్తి దాయకమన్నారు. మళ్లీ తెలుగుజాతికి పూర్వవైభవం తీసుకురావాలంటే అది చంద్రబాబు వల్లేనల్లేనని, దీని కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు జన్మదినం సదర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ లో సుమారు 2 వేల యూనిట్ల వరకు రక్తాన్ని సేకరించారు. సుమారు 60 వేల మందికి అన్నదానం నిర్వహించారు. 30 వేల మందికి పండ్ల పంపిణీ చేశారు.

LEAVE A RESPONSE