Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రి భయపడుతున్నట్టే లెక్క

గవర్నర్ ప్రసంగంలో రాజధాని ప్రస్తావనే లేదు
అన్నమాటప్రకారం ముఖ్యమంత్రి డీమ్డ్ టూ బీ డిస్ క్వాలిఫైడ్ చేయగలరా?
ఆత్మలు చెప్తే వినేది మేంకాదు… ముఖ్యమంత్రే
పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్

ప్రజలసమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఉన్న అన్నిఅవకాశాలను సద్వినియోగం చేసుకుంటాం. 7 ఎమ్మెల్సీ స్థానాలు గెలవాల్సిందే, లేకపోతే పదవుల పీకేస్తా అని ముఖ్యమంత్రి, మంత్రుల్ని హెచ్చరిస్తున్నాడు అంటే.. ఆయన భయపడుతున్నట్టే లెక్క. తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ కమిటీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించాము. ప్రజాసమస్యలను రకరకాలరూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ అధినేత సూచించారు. పడకేసిన సాగునీటిరంగం, రైతుల కష్టాలు, ప్రజలపైన పడినపన్నులభారం, యువతకుఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం, మహిళలకు ఇచ్చిన మాటతప్పడం వంటి అంశాలను శాసనసభద్వారా వెలుగులోకి తీసుకురావాలని నిర్ణయించాము.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీవర్గాలకు ఈ ప్రభుత్వం చేస్తున్న తీరని అన్యాయాన్నికూడా అసెంబ్లీలో ఎండగట్టాలని తీర్మానించాము.

ముఖ్యమంత్రి జూలైకి విశాఖపట్నం వెళ్తాము అంటున్నారు. గవర్నర్ ప్రసంగంలో రాజధాని అంశమే లేనట్టుగా ఎక్కడా అసలు ఆ ప్రస్తావనే లేదు.ఒక రాజధాని కాదు..మూడు రాజధానులు అన్నారు. తరువాత మరలా మూడు కాదు.. ఒక్కటే అన్నారు. ఇప్పుడు విశాఖే రాజధాని అంటున్నారు. ప్రభుత్వం అసలు రాజధాని విషయాన్ని ప్రస్తావించిందా.. లేదా? ప్రస్తావించినా గవర్నర్ గారు సుప్రీంకోర్టులో ఉన్న అంశంపై తాను మాట్లాడను అన్నారా?ఊరికే ఎక్కడో చీకట్లో మాట్లాడటం దేనికి? బహిరంగంగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి విశాఖపట్నమే రాజధాని అనిప్రకటించవచ్చు కదా? ఏ శాసనసభలో అయితే మాటతప్పారో అక్కడే చెబితే ఆయన మాటతప్పుతాడో, మడమతిప్పుతాడో తేలిపోతుంది కదా!

మంత్రులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 7 ఎమ్మెల్సీ స్థానాలు కచ్చితంగా గెలవాలని చెప్పారు. సొంతపార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఆత్మప్రబోధానుసారం ఓటేస్తారో అన్నభయంతో ముఖ్యమంత్రి అలా అన్నారా?లేకపోతే 7 స్థానాలు గెలవాల్సిందే అని, లేకపోతే మంత్రులపదవులు తీసేస్తానని చెప్పడం ముఖ్యమంత్రిలోని అభద్రతాభావానికి నిదర్శనం. 151+4 అని గతంలోనే ముఖ్యమంత్రి అన్నారు. అదే వ్యక్తి శాసనసభలో అటూఇటూ మారితే ఆటోమేటిగ్గా వారిపదవులు రద్దైపోవాలని కూడా అన్నారు.ఈ ఓటింగ్ కు ముందే అన్నమాటప్రకారం ముఖ్యమంత్రి డీమ్డ్ టూ బీ డిస్ క్వాలిఫైడ్ చేయగలరా? 4గురో, 5గురో ఎంతమంది ఉంటే అంతమందిని డిస్ క్వాలిఫై చేస్తే సరిపోతుంది కదా! ఆత్మలు చెప్తే వినేది మేంకాదు… ముఖ్యమంత్రే. పోలవరం ఎత్తు తగ్గించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.. కేంద్రం ఆ ఆలోచన చేస్తుంది..మీరు ఎక్కడా తలవంచవద్దు అని ఒక ఆత్మ మాట్లాడినట్టు ఇప్పుడే టీవీల్లో చూశాము. అలా ఆత్మలు చెప్పేది వినేవారు కాబట్టే ఆత్మప్రబోధానుసారం ఓట్లేస్తారని అంటున్నాం.

LEAVE A RESPONSE