Home » అడ్డగోలుగా పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని ఏకపక్షంగా ఎన్నికలను మార్చుకున్నారు

అడ్డగోలుగా పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని ఏకపక్షంగా ఎన్నికలను మార్చుకున్నారు

– టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు
ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా అప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరుగుతుంటే టీడీపీ ఆ ఎన్నికలను బహిష్కరించిందని టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఎంఎస్ రాజు మాట్లాడిన మాటలు మీ కోసం. రాజకీయాల్లో బూతులు మాట్లాడటానికి నాంది కొడాలి నానీ. పోలీసుల్ని పోలింగ్ బూతుల్లో ఏజెంట్లుగా పెట్టారు. జగన్ రెండున్నర సంవత్సరాలుగా ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు, చేసిందేమీలేదు. జగన్ కుటుంబమే జగన్ ని బహిష్కరించింది. దాడికి వచ్చిన వ్యక్తిని కాపాడటానికి డీఐజీ ప్రెస్ మీట్ పెట్టాల్సి రావడం దౌర్భాగ్యం.
టీడీపీ వారిపై జరుగుతున్న దాడులు ప్రజలకు కనిపిస్తున్నాయి, పోలీసులకు కనిపించడంలేదు. డీజీపీ నుంచి ఎస్ ఐ వరకు కళ్లకు గంతలు కట్టుకొని ఉన్నారు. వైసీపీ నాయకుల కనుసన్నల్లో పోలీసులు ఉన్నారు కాబట్టి జైళ్లకు మాత్రమే పంపగలరు. ప్రజలే ప్రజాక్షేత్రంలో కొడాలి నానీకి దేహశుద్ధి చేస్తారు. రాజ్యాంగాన్ని హేళన చేశారు. చంద్రబాబుపై బూతులు మాట్లాడితే హెరాయిన్ మత్తు దిగేదాకా కొడతాం. మొన్న జరిగిన మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వ్యవస్థల్ని సర్వ నాశనం చేశారు. పోలీసులు, వాలంటీర్లు, మద్యం మాఫియా డాన్ లు, ఇసుక మాఫియా డాన్ ల ద్వారా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు కొత్తకాదు. దౌర్జన్యంగా మారణాయుధాలతో బెదిరించి ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని, వారి ఆస్తుల్ని, వారి ప్రాణాలను కాపాడుకోవటం కోసం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల్ని బహిష్కరించాం.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానీ ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికలనుంచి పారిపోయిన పిరికి దద్దమ్మ చంద్రబాబునాయుడు అని చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరాం. శాసనసభ, న్యాయ, పోలీసు వ్యవస్థల్ని అగౌరవ పరుస్తూ అసాంఘిక పరమైన ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాలంటీర్లను ఇంటింటికి పంపి వైసీపీకి ఓటేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తాం, మీ ఇల్లు కూల్చేస్తాం, మీ ఆర్థిక మూలాల్ని ధ్వంసం చేస్తామని నామినేషన్లు వేయడానికి వెళ్లిన లీడర్లను బెదిరించారు. వారి సంక్షేమం కోసం ఎన్నికలను బహిష్కరించాం. కొడాలి నానీ ఓ పిరికి సన్నాసి. నేను లేస్తే మనిషిని కాదు అంటున్న కొడాలి నానీ లేచేదెప్పుడో అర్థం కావడంలేదు. రెండున్నర సంవత్సరాలపాటు మంత్రిగా ఉండి సాధించిందేమీ లేదు. కొడాలి నానీకి గుడివాడ సెంటర్ లో బట్టలూడదీసి అండర్ వేర్ పై చెప్పులతో దేహశుద్ది చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సభ్యత, సంస్కారం లేని హీనుడు కొడాలి నానీ. రాష్ట్ర రాజకీయాల్లో బూతులు మాట్లాడుతున్నారంటే దానికి నాంది కొడాలి నాని.
బూతులు మాట్లాడటం మా విధానం కాకపోయినా మాట్లాడాల్సివస్తోంది. చంద్రబాబునాయుడు పెట్టిన బిక్షతో జగన్ రాజకీయాల్లో ఉన్నాడు. మీ ముఖ్యమంత్రిని విమర్శిస్తే సహించవు, మా చంద్రబాబునాయుడును విమర్శిస్తే సహించాలా? ప్రస్తుత ఎన్నికల ఫలితాలే రెఫరండం అంటున్నారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రండి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకపక్షంగా రిగ్గుంగులకు పాల్పడ్డారు. నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారు. పోలీసు అధికారులను, వాలంటీర్లను అడ్డం పెట్టుకొని, దౌర్జన్యపరులతో దాడులు చేయించారు. ఆస్తులను ధ్వంసం చేయించారు. ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించుకున్నారు. మీదీ ఒక గెలుపేనా? పైగా 90 శాతం ప్రజా తీర్పు, దేవుడి ఆశిస్సులు అంటున్నారు. ఇలాంటివారిని దేవుడెప్పుడూ శపిస్తాడేగానీ ఆశీర్వదించడు. కొడాలి నానీకి త్వరలో ఖచ్చితంగా దేహశుద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం ఎస్ రాజు హెచ్చరించారు.

Leave a Reply