Suryaa.co.in

Telangana

తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ భవన్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ఫ్లయింగ్ కేక్ ను రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు కట్ చేసి పంపిణీ
Whats-App-Image-2022-02-17-at-17-52-16 చేశారు. అనంతరం KCR జీవిత చరిత్ర, ఉద్యమ నేపథ్యంతో 3D గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో హిందీలో రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శనను కేశవరావు ప్రారంభించారు. అదేవిధంగా లైటింగ్ ఎఫెక్ట్ తో ప్రత్యేకంగా రూపొందించిన ఫోటో సెల్ఫీ బూత్ లను ప్రారంభించారు.

ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్ ను కటౌట్ లు, గులాబీ రంగు బెలూన్ లతో చేసిన అలంకరణ తో భవన్ పరిసరాలను గులాబీమయం చేశారు. భవన్ కు వచ్చే రహదారి కి
Whats-App-Image-2022-02-17-at-17-52-15 ఇరువైపులా భారీ ఎత్తున ముఖ్యమంత్రి ఫ్లెక్సీలను, కటౌట్ లను ఏర్పాటు చేశారు. భవనం ప్రధాన ద్వారం వద్ద LED ఎఫెక్ట్ తో ఏర్పాటు చేసిన కాకతీయ కళాతోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చెంచు, కోయ, ఒగ్గు కళాకారులు నిర్వహించిన డప్పు, నృత్య ప్రదర్శనలు వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి.

ఈ జన్మదిన వేడుకలలో హోంమంత్రి మహమూద్ అలీ, MP రంజిత్ రెడ్డి, MLC MS. ప్రభాకర్, MLA లు మాగంటి గోపినాధ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, దానం నాగేందర్, MLC పాడి కౌశిక్ రెడ్డి, మేయర్
Whats-App-Image-2022-02-17-at-17-52-16-1 గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్ లు ఆయాచితం శ్రీధర్, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, గజ్జెల నగేష్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, పలువురు కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, TRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.Whats-App-Image-2022-02-17-at-17-52-17-1

LEAVE A RESPONSE