Suryaa.co.in

Andhra Pradesh Business News

ఫ్లిప్ కార్ట్ లో చిర్రావూరు “విజయపీకిల్స్”

మారుమూల ఓ చిన్న గ్రామంలో 29 సంవత్సరాలు క్రితం ఆవిర్భవించిన ఓ చిన్న వ్యాపార సంస్థ విజయపీకిల్స్ అంతింతై నేడు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ డెలివరీ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో విజయ పీకిల్స్ వినియోగదారులు దేశవ్యాప్తంగా ఏ ప్రాంతం నుంచైనా ఆన్లైన్ ద్వారా బుక్ వేసుకొని నేరుగా తమ ఇంటి వద్దకే డెలివరీ పొందే సౌకర్యాన్ని సొంతం చేసుకుంది. ఈ మేరకు సోమవారం విజయవాడలో ఫ్లిప్ కార్ట్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో సంస్థ వైస్ చైర్మన్ ధీరజ్ కపూర్ తో విజయ పికిల్స్ అధినేత కాటూరి రాము ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ 29 సంవత్సరాల తమ శ్రమ నేటికి ఫలించిందని మా విజయపీకల్స్ సంస్థ నుంచి వెలువడే ప్రొడక్టు ఫ్లిప్ కార్ట్ ద్వారా దేశవ్యాప్తంగా తమ వినియోగదారులకు అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమకు ఈ అవకాశం రావడానికి సహకరించిన రాష్ట్ర మంత్రివర్యులు జోగి రమేష్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE