Home » సీఐ శంకర్రావు పశువుల మంత్రికి కలెక్షన్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు

సీఐ శంకర్రావు పశువుల మంత్రికి కలెక్షన్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు

– మద్యంపై వచ్చే ఆదాయంతోప్రభుత్వాన్ని నడుపుతన్న ముఖ్యమంత్రిని, మద్యం అమ్మకాలు పెంచాలనిచెబుతున్న చీఫ్ సెక్రటరీని ప్రశ్నించగల దమ్ము పలాస సీఐ శంకర్రావుకి ఉందా?
అకారణంగాటీడీపీవారిపై తప్పుడుకేసులు పెడుతూ, వేధింపులకు గురిచేస్తున్నాడు.
• టీడీపీ కార్యకర్తలు మద్యం తాగారని, వారినిఅరెస్ట్ చేసిరాత్రంతా ష్టేషన్లోఉంచి చిత్రహింసలకు గురిచేసిన సీఐకి, వారితోపాటు మద్యంతాగిన వైసీపీకార్యకర్తలు కనిపించలేదా?
• పలాస డీఎస్పీగా ఉన్న శివరామిరెడ్డి మాట్లాడితే హత్యాయత్నం కేసులుపెడుతూ, టీడీపీకార్యకర్తలను దారుణంగా వేధిస్తున్నాడు.
– టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతుశిరీష
మద్యపానం ప్రోత్సహిస్తున్నప్రభుత్వాన్ని, అధికారపార్టీపెద్దలను వదిలేసి, తమప్రాణాలు కోల్పోతున్నామనితెలిసీకూడా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న మందుబాబులపై పోలీసులుజులుం ప్రదర్శించడం, తప్పుడుకేసులు పెట్టిహింసించడం ఏమిటని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి గౌతుశిరీష ప్రశ్నించారు. శనివారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు…
పలాసకాశీబుగ్గ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా ఉన్న సీఐ శంకర్రావుని, పలాసకు చెందిన పశువుల మంత్రి (సీదిరి అప్పలరాజు) ఏరికోరి తననియోజకవర్గానికి తెచ్చుకున్నారు. సదరు సీఐ, మంత్రిగారికి కమీషన్ ఏజెంట్ గా పనిచేస్తున్నారు. పలాసలో కొందరు తెలుగుదేశం కార్యకర్తలు మద్యంతాగారని సదరు సీఐ శంకర్రావు అరెస్ట్

చేశారు. వాస్తవానికి టీడీపీవారితో పాటు, వైసీపీవారు మద్యం సేవించినవారిలో ఉన్నాకూడా, వారిజోలికి సీఐ వెళ్లలేదు. కావాలనే టీడీపీవారిని లక్ష్యంగా చేసుకొని వారిపై తప్పుడుకేసులు పెట్టి, అరెస్ట్ చేశారు. మద్యంతాగి బయటకువస్తే న్యూసెన్స్ కేస్ కింద రూ.500లు జరిమానాకట్టించుకొని వదిలేయాల్సి ఉండగా, దానికి విరుద్ధంగా సీఐ శంకర్రావు ప్రవర్తించారు.
తెలుగుదేశం కార్యకర్తలను రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచి, హింసించి తెల్లారాక వదిలేశాడు. సీఐ శంకర్రావుకి మద్యం సేవించిన టీడీపీకార్యకర్తలు నేరస్తుల్లా కనిపిస్తే, మరి అదే మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా అమ్ముతున్న ప్రభుత్వం, ప్రభుత్వపెద్దలు నేరస్థుల్లా కనిపించడంలేదా? సీఐ శంకర్రావు వ్యవహారశైలిపై జిల్లాపోలీస్ అధికారులకు, మరీ ముఖ్యంగా స్థానికడీఎస్పీ శివరామిరెడ్డి గారికి కూడా ఫిర్యాదుచేశాము.
సదరు డీఎస్పీని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరుప్రభుత్వపెద్దలు ఏరికోరి మరీ కడపనుంచి పిలిపించుకు న్నారు. డీఎస్పీ శివరామిరెడ్డినికావాలనే టీడీపీవారిని వేధించడంకోసం, తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపడానికే పిలిపించారు. సదరుడీఎస్పీకి ఇష్టమైన సెక్షన్ 307, (హాత్యా యత్నం), ఎవరేంమాట్లాడిన ఆఖరికి టీడీపీరాష్ట్రఅధ్యక్షులు అచ్చెన్నాయుడిపైనే సదరు డీఎస్పీ 307కేసు పెట్టారు. ఆయన కింద పనిచేస్తున్న సీఐ శంకర్రావు మరీ బరితెగించాడు.
వినోద్ అనే కార్యకర్త, పశువులమంత్రిని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఏదో అన్నాడని చెప్పి, రాత్రిపూట సీఐ శంకర్రావు, వైసీపీగూండాలను వెంటబెట్టుకొని మరీ వినోద్ ఇంటికెళ్లి, వీరంగం వేశాడు. వినోద్ ను అకారణంగా, అర్థరాత్రి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేశారు. చట్టవిరుద్ధంగా సీఐ శంకర్రావు వినోద్ ను అదుపులోకి తీసుకోవడంపై, తాము కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడానికి సిద్ధమయ్యాము.
దాంతో ఏంచేయాలో పాలుపోక, తాగుడే అలవాటు లేని వినోద దగ్గర రెండుమద్యం సీసాలు దొరికాయనిచెప్పి రాత్రికి రాత్రి పాతపట్నం జైల్లో పడే శారు. పశువులమంత్రి (సీదిరి అప్పలరాజు)కి, సీఐ శంకర్రావుకి టీడీపీవారంతా నేరస్తుల్లానే కనిపిస్తున్నారు. సీఐ శంకర్రావే తన మనుషులను, టీడీపీ కార్యకర్తలఇళ్లకు పంపి, వారి ఇళ్ల ల్లో అక్రమమద్యాన్ని, నల్లమందునుఉంచుతున్నారు. శంకర్రావు గతంలో స్థానికఎన్నికల సమయంలోకూడా పశువులమంత్రిని కౌంటింగ్ కేంద్రాల్లోకి పంపించారు. సీఐ వ్యవహార శైలిపై జిల్లాఎస్పీకి ఫిర్యాదుచేసినా ఆయన స్పందించలేదు.
ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏదైనా ఇబ్బందిఉంటే మెసేజ్ చేయాలని హితబోధచెబుతున్నారు. సీఐ శంకర్రావుకి, పోలీస్ శాఖకు ఉన్న రూల్స్ అన్నీ టీడీపీవారిని అరెస్ట్ చేయడానికి.. జైళ్లకు పంపడానికే పనికొస్తా యా? మద్యంపై నడుస్తున్న ప్రభుత్వానికి అధినేతను అనిచెప్పుకుంటున్నవ్యక్తిని, మద్యం అమ్మకాలుపెంచాలని బహిరంగంగానే అధికారులకుఆదేశాలిస్తున్న చీఫ్ సెక్రటరీని పోలీస్ శాఖ ఎందుకుప్రశ్నించదు?
అక్కషెల్లెమ్మలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మద్యపాననిషేధం హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నాం. పలాస సీఐ శంకర్రావు పశువులమంత్రికి కమీషన్ ఏజెంట్ గా పనిచేస్తూ, హద్దులుమీరిప్రవర్తిస్తున్నాడు. ఆయనపై డీజీపీ తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలనిలేకుంటే, భవిష్యత్ లోప్రజలు సీఐపై చేయబోయే తిరుగుబాటుకి డీజీపీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.

Leave a Reply