Suryaa.co.in

Business News

దుస్తులు.. సామాన్ల రీసైక్లింగ్.. గూంజ్!

బీరువా తెరిస్తే బట్టలన్నీ కింద పడిపోతుంటాయి.. ఈ మధ్య కాలంలో ఇలాంటి పరిస్థితిని చాలా ఇళ్లలో ఆడా మగా అందరం ఎదుర్కుంటున్నాం… దాని గురించి జోకులు కూడా వేసుకుంటాం.
ఇలా మనకి ఎక్కువైపోయిన బట్టల్ని తీసుకుని రీసైకిల్ చేసి మళ్లీ పనికొచ్చే రూపాల్లోకి మార్చి అవసరమైన వాళ్ళకి అందించే సంస్థ ఒకటి ఉంది.. దాని పేరు Goonj.. (ఇది హిందీ పదం.. దీనికి అర్థం ప్రతిధ్వని.. Subject to correction)Hindi లో అమితాబ్ బచ్చన్ తో వచ్చే Kaun Banega Crorepati(KBC) ని రెగ్యులర్ గా చూసేవాళ్లకి గత వారంలో ఈ Goonj ని స్థాపించిన Anshu Gupta అందులో వచ్చిన సంగతి తెలిసే ఉండచ్చు.
ఈ సంస్థని ఆయన 1999 లో ఒక ఆరేళ్ల పాప ఆయనకి కలిగించిన స్ఫూర్తితో మొదలు పెట్టారు … ఢిల్లీలో అనాధ శవాల్ని దహనం చేసి అలా వచ్చిన డబ్బుతో పొట్ట పోసుకునే ఒక వ్యక్తి కూతురు ఆ అమ్మాయి…. ఒంటి మీద సరైన దుస్తుల్లేని ఆ పాపని అక్కడ డిసెంబర్ లో గడ్డ కట్టే చలిలో నిద్ర పడుతుందా అనడిగిన ప్రశ్నకి ఆ పాప ‘శవాన్ని గట్టిగా పట్టుకుని నిద్ర పోతాను’.. అని జవాబు చెప్పిందట.
దానికి చలించిపోయిన Anshu బాగా ఆలోచించి ఈ సంస్థని కేవలం 67 దుస్తుల్తో మొదలు పెట్టారు.. ప్రస్తుతం ఇది ఏటా 3000 టన్నుల దుస్తులు, సామాగ్రిని రీసైకిల్ చేస్తోంది… పాతబడిన, ఎక్కువగా వాడని బట్టలు, ఇతర సామాగ్రి సేకరించి వాటిని disinfect చేసి అవసరమైన మార్పులు చేయించి అవసరమైన వాళ్ళకి అందిస్తున్నారు.. మొదటగా ఢిల్లీలో మొదలు పెట్టి ప్రస్తుతం దేశంలో 22 రాష్ట్రాలకి విస్తరించారు.వరదలూ, కరువులూ భూకంపాలూ లాంటి వాటిలో మెటీరియల్ కూడా సేకరించి దాన్నే వనరుగా మార్చి బాగు చేసి ఉచితంగా పంచుతారు.. దీని వల్ల చాలా మందికి ఉపాధి కూడా దొరుకుతోంది… వాళ్ళు చేసిన పనికి బదులుగా సరిపడా దుస్తులు, ఆహారం ఇస్తారు.. రీసైకిల్డ్ దుస్తులతో తయారు చేసిన sanitary pads ని బయట ఎక్కువ డబ్బుతో కొనుక్కోలేని వాళ్ళకి రెండు రూపాయలకి ఒకటి చొప్పున అమ్ముతున్నారు..మొదటి అయిదేళ్లలో ఇలా నాలుగు మిలియన్ల pads పంచారు.
గత 18 ఏళ్లుగా Goonj చేస్తున్న ఈ పనితో డబ్బు అవసరం లేని parallel economy యే తయారైందంటే ఆశ్చర్యం లేదు.. ఈ పనులకే 2015 లో Anshu Gupta కి Ramon Magsasay అవార్డు కూడా వచ్చింది.. World economic forum కి sister organization అయిన Schwab foundation 2012 లో బెస్ట్ social entrepreneur అవార్డు ఇచ్చింది.. NASA, Nike, US agency for international development లు కూడా Goonj తో కలిసి పని చేశాయి.. ఇంకా ఎన్నో సంస్థలు ఏవేవో పురస్కారాలిచ్చాయి.
అలాంటి గొప్ప, పరోపకారం తప్ప ఇంకెలాంటి ఉద్దేశం లేని సంస్థని మొదలు పెట్టిన Anshu, ఆయన కుటుంబం ఎంత మామూలుగా (without any airs) ఉన్నారో అని KBC లో వాళ్ళని చూసిన వాళ్లందరికీ అనిపించే ఉంటుంది.. I am glad I watched it and have come to know about him.
2009 నించీ ప్రతీ ఏటా మన దేశంలో అక్టోబర్ 2 నించి 8 దాకా Joy of giving week ( తర్వాత దీని పేరు దానోత్సవ్ గా మార్చారు) జరుపుతున్నారు.. అంటే ఆ వారమంతా దేశవ్యాప్తంగా వాలంటీర్లు అందరి దగ్గర్నించీ వాళ్ళకి అవసరం లేని బట్టలూ సామాగ్రీ సేకరించి Goonj కి పంపుతారు.. అవి అక్కడ రీసైకిల్ అయి అవసరమైన వాళ్ళకి అందుతాయి.
ఈ week ని హైదరాబాద్, వైజాగ్ ల్లో చాలా స్కూళ్లు, కాలేజీలూ జరుపుతున్నాయి.. మనకి ఎక్కువై ఏం చెయ్యాలో తెలీని, పారెయ్యడం తప్ప ఎలాంటి ఉపయోగం లేని బట్టలు, సామాగ్రిలని ఈ Goonj కి అందజెయ్యగలిగితే చాలు.. తర్వాత ఏం చెయ్యాలో వాళ్ళు చూసుకుంటారు.. (అక్టోబర్ 2 నించి 8 దాకా)
Address for dropping…. Barsyl House, KK Towers-3, Sitaram Nagar, Near Diamond Point, Secunderabad, Telangana… 500009……… Timings for dropping: 8 am to 8 pm. All days except Monday. Contact person: Sadhana Srivatsav….. 9490750617…

LEAVE A RESPONSE