-ధర రూ.3.25లక్ష లు (ఎక్స్-షోరూమ్)
-కిలోమీటరుకు రూ.2 సబ్ స్క్రిప్షన్ ఖర్చు
పుణె: భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఈవీని పుణెకు చెందిన వైవ్ మొబిలిటీ సంస్థ భారత్ మొబిలిటీ ఎక్స్పో2025లో ఆవిష్కరించింది రూ.3.25లక్షల (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన వైవే ఈవా సోలార్ టెక్నాలజీ తో రానుంది.ఇందులో నోవా (9 కిలో వాట్), స్టెల్లా (12 కిలోవాట్), వెగా(18 కిలోవాట్) వేరియంట్లు ఉన్నాయి.ఈ వాహనం ప్రత్యేకమైన బ్యాటరీ రెంటల్ ప్లాన్ ను అందిస్తుంది. ఇందుకోసం కిలోమీటరుకు రూ.2 సబ్ స్క్రిప్షన్ ఖర్చు అవుతుంది.