– ల్యాబ్ నివేదికను బయటపెట్టిన టీడీపీ నేతలు
నాడు మద్యపాన చేస్తానన్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మద్యనిషేదం చేయకపోగా కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలు తీస్తున్నారని, ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్న మద్యంలో ప్రజల ప్రాణాలు తీసే విషపధార్దాలున్నాయంటూ టీడీపీ నేతలు ఆ ల్యాబ్ నివేదికలు బయటపెట్టారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమాణారెడ్డి, రసాయణ నిపుణులు వరుణ్ కుమార్ లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా…
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ…
మద్యపాన నిషేదం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజల చావులతో వ్యాపారం చేస్తున్నారు. జగన్ రెడ్డి కల్తీ మద్యంతో మహిళల తాళిబొట్లు తెంపుతూ తాడేపల్లి ప్యాలెస్ లో కమీషన్లు లెక్కలేసుకుంటూ కూర్చున్నారు. జగన్ రెడ్డి లాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా చూడలేదు. ప్రభుత్వం అమ్ముతున్న మద్యం ప్రజలు ప్రాణాలు తీసే విషపధార్దాలున్నాయని ప్రజల శవాల మీద వ్యాపారం చేయొద్దని గతంలో చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నాయకులు నేతలు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకపోగా నాటి ఎక్సైజ్ కమిషనర్ బాద్యతారాహిత్యంగా మాట్లాడారు. కల్తీ మద్యంపై క్రిమినల్ ముఖ్యమంత్రికి బుద్దిచెప్పకపోగా నాటి ఎక్సైజ్ కమిషనర్ రజత్ భార్గవ్ టెక్నికాలటీ గురించి మాట్లాడటం సిగ్గుచేటు.
జగన్ రెడ్డి ప్రభుత్వం అమ్ముతున్న కల్తీ బ్రాండ్లు త్రాగినవారికి బ్రెయిన్ సంబందిత, మానసిక వ్యాదులతోపాటు జన్యపరమైన సమస్యలు వస్తామని పలు ల్యాబ్ నివేదికలు చెబుతున్నాయి. భావి తరాలు కూడా కుంటి, గుడ్డి, మూగ, పోలియో లాంటి జబ్బులతో బిడ్డలు పుట్టే అవకాశం ఉందని చెప్పినప్పటికికూడా వినిపించుకోలేదు. ఇలాంటి మద్యం విక్రయిస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని అంగవైకల్యప్రదేశ్ గా మార్చింది. విషపూరితమైన కాంపౌండ్స్ ఉండటంవల్ల గొంతు నొప్పి, కళ్లు ఎర్రబడటం, వళ్లు నొప్పులు, నరాలు పట్టేయటం, బ్రెయిన్ సంబంధించిన వ్యాధులకు గురవుతారని తెలిసి కూడా ప్రభుత్వం పట్టించుకోవడలేదు.
ఇంత హానికరమైన మద్యంపై వచ్చే ఆదాయాన్ని హామీగా చూపి రూ. 25 వేల కోట్లు అప్పులు తేవటం దుర్మార్గం. జగన్ రెడ్డి కల్తీ మద్యం త్రాగిన వారు సైకోలు గామారిపోతున్నారు. మద్యం మత్తులో తండ్రి కన్న కూతురిపై అత్యాచారం చేయటం, 70 ఏళ్ల వృద్దుడు 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయటం ఏంటి? వీటన్నింటికి కారణం జగన్ రెడ్డి అమ్ముతున్న కల్తీ మద్యమే. ఈమద్యం వల్లే జరిగే అనర్ధాలు ప్రస్తావించకుండా ఐఏయస్ అధికారులు జగన్ రెడ్డి మద్యం దందాకు వంతపాడటం సిగ్గుచేటు. ప్రజల మరణాలపై వ్యాపారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ప్రజలంతా సిద్దంగా ఉన్నారని పంచుమర్తి అనురాధ అన్నారు.
రసాయణ నిపుణులు వరుణ్ మాట్లాడుతూ…
జగన్ ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యం హానికరం. ఈ మద్యం తాగినవారు మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా పూర్తిగా క్షీణించిపోతారు. పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన సమస్యలు, శ్వాసకోష వ్యాధులు వస్తాయి. ఈ మద్యం సేవించడం శ్రేయస్కరంకాదని గతంలో ల్యాబ్ పరీక్షలో వెల్లడైంది. కానీ అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఈ శాంఫిల్స్ ఆంధ్రలోనే కొన్నారా? ఎక్కడ నుంచి కొన్నారు? అనాథరైజ్ఢ్ గా కొన్నారా? లేక ట్యాంపరింగ్ చేశారా? ఇదంతా తప్పంటూ ప్రజల ప్రాణాల పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా మాట్లాటం బాధాకరం. కానీ మేం రాష్ట్రంలోని అనంతపురం, గుత్తి, చిలకలూరిపేట ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని మద్యం షాపుల్లో ర్యాండమ్ గా జియోట్యాగింగ్ ద్వారా కొనుగోలు చేసి ఆ శాంపిల్స్ టెస్టు చేయించాం.
పరీక్షల్లో వైల్లడైన విషయాలు
1. బ్రాండ్ – ఆంద్రా గోల్డ్
రసాయనాలు – పైరో గెలాల్, ఐసో ప్లూరిక్ యాసిడ్
పరిణామాలు – దగ్గు, గొంతునొప్పి, చర్మం కందిపోవడం, కళ్లు ఎరుపెక్కడం, వాంతులు, అతిసారం, శ్వాస
ఒక్కసారిగాపెరిగిపోవడం, బీపీ పడిపోవడం, ఒక్కసారిగా నాడీ వ్యవస్థ పనితీరు వేగంవంతం కావడం, తల తిరగటం, తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, మానసిక గందరగోళం, శరీరం మెలికలు తిరగడం, మూర్చపోవడం.
2. బ్రాండ్ – సిల్వర్ స్ట్రైప్స్ విస్కీ
రసాయనాలు – పైరో గెలాల్, ఐసో ప్లూరిక్ యాసిడ్, డైతలీ పాతలేట్
పరిణామాలు – చర్మంపై దురద,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లివర్ సంబంధిత వ్యాధులు దగ్గు,
గొంతునొప్పి, చర్మం ఎర్రబడటం, కళ్లు ఎర్రబడటం, వాంతులు, అతిసారం సమస్యలని ఎదుర్కొంటారు. చేతులు, అరికాళ్ళకింద సూదులతో గుచ్చినట్లు ఉండటం.
3. బ్రాండ్ – నైన్ సీ హార్స్
రసాయనాలు – పైరో గెలాల్, ఐసో ప్లూరిక్ యాసిడ్
పరిణామాలు – కళ్లు మండటం, చర్మంపై దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లివర్ సంబంధిత
వ్యాధులు దగ్గు, గొంతునొప్పి, చర్మం ఎర్రబడటం, కళ్లు ఎర్రబడటం, వాంతులు, అతిసారం. కెమికల్ అనాలసిస్ చేసి మేము ఈ రిపోర్టులు వెల్లడించాం. మా రిపోర్టు తప్పని ప్రభుత్వం నిరూపించగలదా? ఈ మద్యం హానికరంకాదు, ఇందులో ఆ కాంపౌండ్స్ లేవని ప్రభుత్వం చెప్పలగలదా? జగన్ రెడ్డి ప్రభుత్వం అమ్ముతున్న మద్యం బ్రాండ్ న్ టెస్ట్ చేసి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత అబ్కారీశాఖపైనా, ప్రభుత్వంపైనా ఉందని వరుణ్ అన్నారు.
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ….
హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి… చదువురాని, చదువులేని ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం విధిస్తానని పదే పదే చెప్పారు. టీడీపీ హయాంలో మద్యం ఏరులై పారిందన్నారు. ఇప్పుడు సారాయి ఏరులై పారుతోంది. మేనిఫెస్టోని బైబిల్, ఖురాన్, భగవద్గీతతో పోల్చిన జగన్ రెడ్డి మద్యాపాన నిషేదం ఎందుకు అమలు చేయలేదు? కిల్లీ కొట్టు పానీపూరి బండ్ల దగ్గర సైతం డిజిటల్ పేమెంట్లు తీసుకుంటుంటే ఎలైట్ మాల్స్, మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసుకోవటం లేదు?
గోవా, పాండిచ్చేరి, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా వైసీపీ నేతలు మద్యం తెచ్చి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ఇలా అక్రమ మద్యం అమ్ముకునేందుకే మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ తీసుకోవటం లేదు. గతంలో నెల్లూరులో అక్రమ మద్యం దొరికితే అసలు దొంగల్ని వదిలేసి సేల్స్ మెన్స్ ని అరెస్ట్ చేస్తారు. కరోనా సమయంలో ఓ ప్రభుత్వ దుకాణంలో మద్యం మాయమైతే ఎలుకలు తాగాయని ప్రభుత్వం చెప్పటం సిగ్గుచేటు. ఆ మద్యం తాగింది ఎలుకలు కాదు వైసీపీ ఎలుగుబంట్లు. ఆ ఎలుగుబంట్లే ఆ మందంతా బ్లాక్ లో అమ్మారు. దేశంలో మందుబాబులను తాకట్టు పెట్టిన ఏకైక సీఎం జగన్ రెడ్డి. జగన్ రెడ్డి చదుకు రాకపోబట్టి సరిపోయింది కనీసం ఇంటర్ పాసైనా దేశాన్ని అమ్మేసేవాడు.
గతంలో అమరావతి బాండ్లతో రూ. 2 వేల కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు తెస్తే… సాక్షిలో బాండ్లతో ప్రజలకు బ్యాండ్ అంటూ నానా యాగీ చేసిన సాక్షి, ఇప్పుడు మద్యంపై జగన్ రెడ్డి రూ. తెచ్చిన రూ. 35 వేల కోట్లపై రాస్తారు? మందు అమ్మడం ఆపేస్తే ఈ రూ. 35 వేల కోట్లు తిరిగి కట్టాలనే నిబంధన అగ్రిమెంట్ లో ఉంది. ఈ విషయాన్ని సాక్షి దాచింది. భవిష్యత్ లో పాక్షికంగా గానీ సంపూర్ణంగా గానీ మద్యపాన నిషేదం చేయమని చెప్పి అప్పులు తెచ్చారు? ఆ అధికారం జగన్ రెడ్డికి ఎవరిచ్చారు? రెండేళ్లలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతారు తర్వాత ఆ అప్పులకు బాద్యులెవరు?
బుగ్గన ముంబాయికి వెళ్లి బటన్ నొక్కి డబ్బులు మాయం చేస్తారు. తెచ్చిన రూ. 35 వేలు ఎలా కట్టాలి? హాఫ్ టికెట్ జగన్ త్వరలో జగనన్న సారాయి యాప్ ను తొందరలో రిలీజ్ చేయబోతున్నాడు. వాలంటీర్ల ద్వారా జనం సారా తాగకపోతే జగనన్న సారా యాప్ కి అప్ లోడ్ చేయాలని నిబంధన పెడతాడు. బినామీ ఇన్వెస్టర్స్, సూట్ కేసు కంపెనీలు తప్పితే… రెగ్యులర్ బ్రాండ్స్ రాష్ట్రంలో ఎందుకు లేవో జగన్ రెడ్డి చెప్పాలని ఆనం వెంకటరమణారెడ్డి నిలదీశారు.
