Suryaa.co.in

Andhra Pradesh

పోలవరం పనులు అయినవారికి కట్టబెట్టడంతోనే నిర్మాణం ఆగిపోయింది

– ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి శనిగ్రహం
– జగన్ పబ్జీ ఆడుకోవడానికి సమయం సరిపోతోంది
– పోలవరానికి మూడు సంవత్సరాల్లో రూ.45 వేల కోట్లు ఖర్చుపెడతామని .. పది వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు
– జగన్ బూటకాలు, నాటకాలకు తెరపడే రోజులు ఆసన్నమయ్యాయి.
– టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశారు. పోలవరం ప్రాజెక్టు వైఫల్యం జగన్మోహన్ రెడ్డిదే. పోలవరం ప్రాజెక్టుకు ఎందుకు నిధులు సాధించలేకపోతున్నారు?. డిసెంబర్ 20 కల్లా పూర్తి చేసి నీరు పారిస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు పారించలేకపోయారు?. జగన్ చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటికొస్తున్నాయి. తన బంధువు పీటర్ చేత నిర్మాణ దర్యాప్తు చేయించడంలో అర్థంలేదు. మూడు సంవత్సరాల్లో 3% పనులు కూడా పూర్తిచేయలేదు.

తెలుగుదేశం అధికారంలోకి రాగానే పోలవరం వద్ద శిలాఫలకాలు తప్ప ఏమీ లేవు. అధికారంలోకి వచ్చి 72 శాతం పూర్తి చేశాం. అవగాహన, ఇంగితజ్ఞానంలేని వ్యక్తులు మంత్రులు కావడం దౌర్భాగ్యం. అప్రోచ్ ఛానల్ సరిగా చేయకపోవడంతో నీరు ఆగి పోలవరానికి గండి పడింది. ప్రాజెక్టులమీద ఏమాత్రం అవగాహన లేని మంత్రులు మీడియా మీద విరుచుకుపడుతున్నారు. జగన్ పాలనతో రాష్ట్రం సర్వనాశనమైంది. ప్రాజెక్టు పూర్తిపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ప్రాజెక్టులను ప్రతిపక్ష నేతలు పరిశీలించకూడదా?. ప్రాజెక్టుల వద్ద 144 సెక్షన్ ఎందుకు అమలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తెలివితక్కువ తనంవల్ల, అహంకారపూరిత విధానాల వల్ల పోలవరం ప్రాజెక్టుకు ఈ దుర్గతి పట్టింది. ఎడమ, కుడి కాలువ పనులు చేయలేదు. ప్రాజెక్టు పనుల్లో లోపాలున్నాయని కేంద్ర జలశక్తి సంఘమే చెప్పింది. బావర్ కంపెనీ ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ అటువంటి సంస్థను కాదని అయినవారికి పనులు అప్పగించారు. వేరే సంస్థకు పనులు అప్పగించడంవల్లే పనులు ఆగాయి.

21కల్లా పూర్తి చేస్తాం, 22కల్లా పూర్తి చేస్తాం, 23 కల్లా పూర్తి చేస్తామని చెబుతూ వస్తారు. 24కల్లా వీరే ఉండకుండా ఇంటికి పోతారు. నేడు జరిగిన నష్టానికి వైసీపీదే బాధ్యత. టీడీపీ హయంలో వేగంగా జరుగుతున్న ప్రాజెక్టుని వైసీపీ ప్రభుత్వం తెలివి తక్కువతనం వల్ల ఆగిపోయింది. రివర్స్ టెండరింగ్ పేరుతో దోపిడీ చేశారు. ఇసుక సీనరేజ్ అని మరోరకంగా పరోక్షంగా వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారు. అయినా అభివృద్ధి శూన్యం. మూడు సంవత్సరాల్లో 45 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడతామని బడ్జెట్ లో పెట్టిమూడు సంవత్సరాల్లో పది వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు.

ఎంతసేపు చంద్రబాబు, టీడీపీ మీద ఏడ్వడం, గగ్గోలు పెట్టడం తప్ప పోలవరం నిర్మాణ పురోగతి లేదు. వైసీపీ చరిత్ర సమాధి కాబోతోంది. బూటకాలు, నాటకాలకు తెరపడే రోజులు ఆసన్నమయ్యాయి. కేంద్ర జలవనరుల శాఖే టీడీపీ హయాంలో ఇంత ఖర్చు పెడితే వైసీపీ ఇంత ఖర్చు పెట్టిందని క్లియర్ గా చెబుతోంది. వైసీపీ ప్రభుత్వానికి సిగ్గులేదు. అమరావతిని, పోలవరాన్ని పాడు చేశారు. జగన్ రాజీనామా చేసి ఇంటికెళ్లడం మంచిది. చెంచల్ గూడ, రాజమండ్రి సెంట్రల్ జైలుకో వెళ్లి కూర్చోవడం మంచిది. లేకుంటే హాయిగా విశ్రాంతి తీసుకొని పబ్జీ ఆడుకోవచ్చు. జగన్ అరాచక, ఆటవిక విధానాల వల్ల, అనుభవ రాహిత్యంవల్ల పోలవరం ప్రాజెక్టు మట్టికొట్టుకపోయే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం, నాయకులమీద ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారు. మూడేళ్లలో ఏం సాధించారో చెప్పాలి.

ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి శనిగ్రహం. ఇప్పటికైనా మేల్కోవాల్సిన పరిస్థితి వుంది. మీనమేషాలు లెక్కిస్తూ కూర్చొంటే వరదలొస్తే ఉన్న పోలవరం కూడా కొట్టుకుపోయే పరిస్థితి జగన్ తెస్తాడు. కనీసం ఒక టన్ను కాంక్రీటన్నా వేశారా అని ప్రశ్నిస్తున్నాను. పోలవరం బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. 45 కాంటూరు నుంచి 41 కాంటూరుకు తగ్గించి కూడా పనులు పూర్తి చేయలేకపోయారు. అధికారుల నోర్లు ఎంతకాలమని మూయించగలరు? కేంద్ర జలశక్తి సంఘం నోరు మూయించలేరు. వారు వాస్తవాలు చెబుతున్నారు. ఇది కేంద్ర ప్రాజెక్టు కావున కేంద్రం జోక్యం చేసుకొని పూర్తి ఖర్చులు కేంద్రమే భరించాలి. తమ ఆధీనంలోకి తీసుకొనైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి.

ఆంధ్రప్రదేశ్ ని ఈ కష్టకాలంలో గట్టెక్కించాలని కోరుతున్నాం. ఇలాగే వదిలేస్తే అరాచక ఆటవిక విధానాలవల్ల రాష్ట్రం ఛిన్నాభిన్నమౌతుంది. ప్రాజెక్టు నిర్మాణాలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. ప్రాజెక్టులే కాకుండా అనేక రంగాలకు కేటాయించిన నిధులన్నీ కూడా పక్కదారిపట్టిపోతున్నాయి. సోషల్ వెల్ఫేర్ కు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిధులన్నీ పక్కదారిపట్టాయి. వ్యవసాయ, నీటిపారుదల, పరిశ్రమ రంగాలకు కేటాయించిన నిధులు ఎక్కడా ఖర్చు పెట్టడంలేదు.

జగన్ పబ్జీ ఆడుకోవడానికి సమయం సరిపోతోంది. జగన్ చెప్పేదానికి జరిగేదానికి పొంతన ఉండడంలేదు. చిప్ప పట్టుకొని ఢిల్లీ చుట్టూ తిరిగే దౌర్భాగ్యపు స్థితిని జగన్ తెచ్చాడు. వారం వారం డిల్లీ చుట్టూ తిరగడానికే సరిపోతోంది. ఏపూటకాపూట పబ్బం గడుపుకునే పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో కాలమే నిర్ణయించాలి. త్వలో ముఖ్యమంత్రి తగిన మూల్యం చెల్లించక తప్పదు.

LEAVE A RESPONSE