రాష్ట్రాన్ని వైసీపీ దుష్ట చతుష్టయం పట్టి పీడిస్తోంది

-తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని జగన్ రెడ్డి రాష్ట్రాన్ని మరింత అప్పుల ఉభిలోకి నెట్టాలని చూస్తున్నాడు
-కేంద్రం పట్టించుకోకపోతే రాష్ట్రం కొలేటరల్ ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోవడం ఖాయం
-జగన్ రెడ్డిది మోసకారి సంక్షేమం అని ప్రజలే భావిస్తున్నారు
– శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు

జగన్ రెడ్డి రాష్ట్రాన్ని కోలుకోలేని అప్పుల ఊబిలో పడేసి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించారు. రాష్ట్రం 7.76 లక్షల కోట్ల అప్పుల సుడిగుండంలో చిక్కుకుని పోయింది. కేంద్ర ప్రభుత్వం జగన్ రెడ్డి తదుపరి బహిరంగ మార్కెట్‌ రుణాలను, కార్పొరేషన్ల రుణాలను నిరోధించకపోతే రాష్ట్రానికి కొలెటరెల్ ఆర్థిక నష్టం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. జగన్ రెడ్డి దుర్వినియోగం చేసిన రుణాలను ఎవరు తిరిగి చెల్లిస్తారన్నదే ఇపుడు ప్రశ్న? కార్పొరేషన్లు గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ తిరిగి చెల్లించే స్థితిలో లేవు. కేంద్రం వైసీపీ ప్రభుత్వం చేసిన మొండి బకాయిలను ఎంతకాలం రక్షిస్తుంది?

మరలా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని జగన్ రెడ్డి చూస్తున్నారు. ఆయన తన పార్టీ గురించి తప్ప రాష్ట్రం, ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించడం లేదు. అవినీతి సొమ్ము జమచేసుకుని దానితో రాబోయే ఎన్నికలలో అక్రమాలకు పాల్పడాలని చూస్తున్నాడు.

అవినీతి, అక్రమాలు, లూటీతో సంపాదించిన సొమ్మును కేంద్రం బయటకు తీయాలి. ఆదాయం లేక సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేని రాష్ట్ర దయనీయ స్థితికి జగన్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? ఇటీవల జరిగిన వైసీపీ ప్రభుత్వ క్యాబినెట్ పునర్నిర్మాణం గమనిస్తే జగన్ రెడ్డి నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. జగన్ రెడ్డి అనుభవ రాహిత్యం, అహంకారం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కుప్పకూలిపోయేలా చేసింది.

వైసీపీ ప్రభుత్వం కౌరవసభలోని దుష్ట చతుష్టయమని టీడీపీ ముందే చెప్పింది. ఈ చతుష్టయ సభ్యులైన జగన్ రెడ్డి, సజ్జల, విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లు రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా, అన్యాయంగా పాలిస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
వైసీపీ పతనం అంచున ఉంది. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు. అనేక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జగన్ రెడ్డి నగదు బదిలీ పథకం ఒక ప్రహసనం లాంటిది. జగన్ రెడ్డి ప్రభుత్వానిది మోసకారి సంక్షేమం అని ప్రజలు ఊరికే అనడం లేదు. ఇచ్చిన మాట..చేసిన వాగ్దానం అన్నింటినీ తుంగలో తొక్కారు. అన్ని వర్గాలను మోసం చేశారు. విదేశీ విద్య తీసేసి విద్యార్థులను మోసం చేశారు. 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని మహిళలను మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 పింఛన్ ఇస్తానని వృద్ధులను మోసం చేశారు.

కేంద్రంతో సంబంధం లేకుండా రైతు భరోసా కింద రైతులకు 12,500 ఇస్తానని, రూ.6,500 ఇచ్చి మోసం చేశారు. రైతులకు ఉచిత బోర్లు వేయిస్తానని మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులును మోసం చేశారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్న హామీ ఇచ్చి వారిని మోసం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మఒడి ఇస్తానని ఒక్కరికి మాత్రమే ఇస్తామంటూ మోసం చేశారు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నిరుద్యోగులను మోసం చేశారు.
ప్రతి లీటరు పాలకు అదనంగా ఇస్తానన్న రూ.4 బోనస్ ఇవ్వకుండా మోసం చేశారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి వేధించడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. సంక్షేమ పథకాల అమలు కంటే ప్రకటనలకు, ప్రచారాలకే ప్రాధాన్యతనిచ్చారు. పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి లేక యువతలో రోజురోజుకు అశాంతి పెరుగిపోతోంది.జగన్ రెడ్డి హామీలతో మోసానికి గురైన ప్రజలే రాబోయే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడం ఖాయం.

Leave a Reply