-ఆయన తొలి భార్యది విశాఖ. తర్వాత రేణుదేశాయ్
-ఇప్పుడు రష్యన్. పవన్ విలువలు లేని వ్యక్తి
-ఇవి మేము చెబుతున్న మాటలు కావు
-ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ చెప్పారు
-పవన్ ఎలాంటి వ్యక్తి అన్నది ఆమే చెప్పారు
-అలాంటి వ్యక్తి జగన్‌ని విమర్శిస్తున్నారు
-విశాఖపట్నంలోని వైయస్సార్‌సీపీ కార్యాలయంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్
విశాఖపట్నం: ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌తో కలిసి మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..:
దానికి పవన్ సమాధానం చెప్పాలి:
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేస్తామంటూ ఆయన యాత్ర చేస్తున్నారు. పవన్‌కళ్యాణ్ సాయం చేస్తానంటున్న 40 మందిలో ప్రభుత్వం ఇప్పటికే 8 కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం అందజేసింది.
అయితే అసలు రైతుల ఆత్మహత్యలు ఎప్పుడు మొదలయ్యాయన్నది పవన్‌కళ్యాణ్ ఆలోచించాలి. 2014 ఎన్నికలకు ముందు రైతులకు ఉన్న రూ.87 వేల కోట్లకు పైగా రుణాలను మాఫీ చేస్తానని మాట ఇచ్చిన చంద్రబాబు, ఆ తర్వాత మాట తప్పారు. దాంతో రైతులు చాలా మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అప్పుడు ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఈ దత్తపుత్రుడు రైతుల మరణాల గురించి ఎందుకు మాట్లాడలేదో చెప్పాలి.
‘దత్తపుత్రుడు’ కాదంటారా?:
ఆరోజు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతుల గురించి మాట్లాడుతూ చాలా అవహేళన చేశారు. అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు చెప్పారు. రైతులు మద్యంతో చనిపోతున్నారని అన్నారు. కానీ వాస్తవానికి చంద్రబాబును నమ్మిన రైతులు, ఆ తర్వాత ఆయన మాట తప్పడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు.
అప్పటి ప్రభుత్వం కలిసి ఉన్న పవన్‌కళ్యాణ్ ఆరోజు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు? మీరు దత్తపుత్రుడు అనడానికి ఇంతకన్నా ఏం కావాలి. అలాంటి పవన్‌కళ్యాణ్ ఇవాళ ప్రభుత్వంపైనా, సీఎంగారిపైనా విమర్శలు చేస్తున్నారు. ఆరోజు రైతు మరణాలకు కారణమైన చంద్రబాబును సమర్థించి, ఇవాళ అదే రైతు కుటుంబాల పరామర్శ అంటూ తిరుగుతున్నారు.
మాది రైతు పక్షపాత ప్రభుత్వం:
ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోంది. కాదంటారా?
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 చొప్పున ఇస్తున్నాం. 52 లక్షలకు పైగా రైతులకు ఆ సాయం చేస్తున్నాం. రైతులకు విత్తనం మొదలు పంటల అమ్మకం వరకు అడుగడుగునా అండగా నిలుస్తూ గ్రామగ్రామాన 10 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు పని చేస్తున్నాయి. పంటకు ఉచితంగా బీమా కల్పిస్తున్నాం. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం ఇస్తున్నాం. రైతులతో సమానంగా కౌలు రైతులకు కూడా అన్ని పథకాలు వర్తింప చేస్తున్నాం.
బాబు కోసం..చేత..ద్వారా..:
చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత, చంద్రబాబు ద్వారా ఏర్పడిందే పవన్ పార్టీ. చంద్రబాబు ప్రయోజనాల కోసం తప్ప, ఆ పార్టీ ఎవరి కోసం పని చేస్తుందన్నది అన్నది పవన్‌కళ్యాణ్ చెప్పాలి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రైతుల కష్టాలు, ఇబ్బందుల గురించి ఏనాడూ పవన్ మాట్లాడలేదు. రాజకీయపరంగా చంద్రబాబు క్యారెక్టర్ ఏమిటన్నది అందరికీ తెలుసు. ఆయన ఏరోజూ మాట మీద నిలబడలేదు. ఎంతసేపూ పొత్తు రాజకీయాలు తప్ప, ఆయన ఎప్పుడూ నిజాయితీతో, విలువలతో కూడిన రాజకీయం చేయలేదు.
ఇద్దరూ విలువ లేని వారే..:
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది తెలుగుదేశం పార్టీ. కానీ చంద్రబాబు గత ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం ప్రచారం చేశారు. ఇక నలుగురిని పెళ్లి చేసుకున్న పవన్‌కళ్యాణ్‌కు వ్యక్తిత్వం లేదు. మంచి క్యారెక్టర్ అస్సలే లేదు. అలాంటి వ్యక్తి కూడా ఇవాళ మా ప్రభుత్వంపైనా, సీఎంగారి పైనా విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఇద్దరూ నైతిక విలువలు లేని వారే. ఒకరేమో తన స్వార్థం కోసం ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటారు. మరొకరు నలుగురిని పెళ్లి చేసుకున్న, ఏ మాత్రం నైతికత. విలువలు లేని వ్యక్తి.
ఇది మేము చెబుతున్నది కాదు. ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ స్వయంగా చెప్పారు. పవన్ ఎలాంటి వ్యక్తి అన్నది ఆమే స్వయంగా చెప్పారు. తొలి భార్యది విశాఖపట్నం. ఆ తర్వాత రేణుదేశాయ్. ఇప్పుడు రష్యన్. అంటే లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్. అలా అందరిని పెళ్లి చేసుకున్న వ్యక్తి జగన్‌గారి గురించి అనుచితంగా మాట్లాడుతున్నారు.
అరెస్ట్‌కు.. కన్విక్షన్‌కు తేడా తెలుసా?:
పవన్ మీకసలు అరెస్టు, కన్విక్షన్‌కు మధ్య తేడా తెలుసా? జగన్ మీద కాంగ్రెస్, టీడీపీ కలిసిన చేసిన కుట్ర వల్లే కదా ఆయన జైలుకు పోయింది. అయినా జగన్‌కి శిక్ష పడలేదు. జగన్‌పై అక్రమంగా కేసులు పెట్టారు. అందుకే ఒక్క కేసు కూడా ఆయనను ముద్దాయగా తేల్చలేదు. ఆయనపై పెట్టిన కేసులు తప్పు అని ప్రజలకు కూడా తెలుసు కాబట్టే, 2014లో కాంగ్రెస్ పార్టీని, ఆ తర్వాత 2019లో తెలుగుదేశం పార్టీని ప్రజలు తుడిచిపెట్టారు. జగన్‌గారిపై పెట్టిన కేసులను ప్రజలు నమ్మలేదు. అవి అక్రమం అని తెలుసుకున్నారు కాబట్టే, ఆయనకు 2019లో ఘన విజయం ఇచ్చారు
ప్యాకేజీ స్టార్–దత్తపుత్రుడు:
ప్యాకేజీ స్టార్‌గా చంద్రబాబు ఏం చెబితే అది చేస్తాను. ఆయన ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి పోతాను. ఆయన ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాను అని పవన్‌కళ్యాణ్ అనుకుంటే అది ఆయన రాజకీయం.
చంద్రబాబు చివరకు సొంత కుమారుణ్ని నమ్మకుండా దత్తపుత్రుడిని నమ్ముకుంటున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలాలని, చంద్రబాబు విపక్షంలో ఉంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్నది పవన్‌కళ్యాణ్ లక్ష్యం. అందుకే ఆయనను చంద్రబాబు దత్తపుత్రుడు అంటున్నాం.
పవన్ స్వయంగా చెప్పారు:
అయితే ఏం చేసినా, మళ్లీ జగన్ విజయం సాధిస్తారు. ఆ విషయం నిన్న పవన్‌కళ్యాణ్ స్వయంగా చెప్పారు. తనను అభిమానించే యువత సభలకు వస్తున్నా, ఓట్లు మాత్రం జగన్‌కే వేస్తున్నారని అన్నారు. అంటే ఆయనకు కూడా తెలుసు. మళ్లీ మాదే విజయం అని.
చంద్రబాబు ఇప్పటికైనా చెప్పాలి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులకు ఇప్పటి నుంచే తహతహలాడుతున్నారో అర్ధం కావడం లేదు. పవన్‌కళ్యాణ్ ఏమో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తానంటాడు. మరోవైపు చంద్రబాబు వన్‌సైడ్ లవ్ జరుగుతోంది అంటారు.
పొత్తులలో రికార్డు:
పొత్తుల విషయంలో పవన్‌కళ్యాణ్‌ది ఒక రికార్డు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీతో. తొలుత తెలుగుదేశం. తర్వాత బీజేపీ, మళ్లీ వామపక్షాలు. ఆ తర్వాత మళ్లీ బీజేపీతో. ఇప్పుడు తాజాగా టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు.
జగన్‌గారు పాలన బాగుంటే, తాను సినిమాలు చేసుకుంటానని పవన్ అన్నారు. ఇవాళ ఈ పాలన బాగుంది కాబట్టే, ఆయన మళ్లీ సినిమాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు సినిమా చేస్తున్నారు. అయితే ఏం చేసినా, వచ్చే ఎన్నికల్లో మళ్లీ వారికి పరాభవం తప్పదు.
పవన్‌కు ఆ హక్కు లేదు:
పవన్‌కళ్యాణ్‌కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తుంది. పని చేస్తుంది. ఇది వాస్తవం. అందుకే వారి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. చంద్రబాబు ఆనాడు మాట తప్పి రైతులను మోసం చేసినా, పవన్‌కళ్యాణ్ ఏనాడూ మాట్లాడలేదు. రైతులు కష్టాల్లో ఉన్నా పట్టించుకోలేదు. ఇప్పుడు రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎన్నెన్నో చేస్తోంది. అందుకే పవన్‌కళ్యాణ్‌కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదంటున్నాం.. అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.
కేఏ పాల్ పొత్తుకు సిద్ధమయ్యాడు. ఆ స్థాయికి దిగజారావు: అదీప్‌రాజ్ ఎమ్మెల్యే:
పవన్‌కళ్యాణ్ ఇటీవల రైతుల కోసం అంటూ యాత్ర మొదలుపెట్టారు. అయితే అందులో రైతులకు మేలు చేయడం కన్నా, చంద్రబాబు కోసం ప్రచారం చేయడం, ఈ ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పవన్‌కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఆయన మాటలే అందుకు నిదర్శనం.
సచివాలయ వ్యవస్థను పవన్ తప్పు పడుతున్నారు. కానీ నిజానికి ఆ వ్యవస్థను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని చూస్తున్నాయి. రైతుల గురించి పవన్ మాట్లాడడం హాస్యాస్పదం. ఎందుకంటే 2014 ఎన్నికల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మాట ఇచ్చి తప్పారు. అప్పుడు చంద్రబాబు పక్కనే ఉన్న పవన్‌కళ్యాణ్ అందుకు ఇప్పటికీ చంద్రబాబును మాత్రం ప్రశ్నించరు. ఈ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో చేస్తున్నా, పవన్ మాత్రం అర్ధం లేని విమర్శలు చేస్తున్నారు.
పవన్ ఇప్పటికే అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. చివరకు ఆయనతో పొత్తుకు కెఏ పాల్ సిద్ధమయ్యారు. అంటే ఆయన ఏ స్థాయికి దిగజారారు అన్నది అర్ధమవుతుంది. పవన్, నువ్వు నిజంగా సింహం అయితే.. వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గా వస్తావా? గుంపులుగా వస్తావా?
సింగిల్‌గా వస్తే సింహానివి. గుంపులుగా వస్తే ఏమిటన్నది మేము చెప్పం. మీరే ఆలోచించుకొండి.