పుట్టగతులు లేకుండా పోతారు:ఎంపీ సీఎం రమేష్

వైసీపీ నేతల తీరుపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనేశ్వరిపై అసభ్య పదజాలం వాడిన వారు పుట్టగతులు లేకుండా పోతారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆక్షేపించారు. ఏపీ ప్రజలు వైసీపీ నేతల నీచ ప్రవర్తనను ఇకపై సహించరని సీఎం రమేష్ మండిపడ్డారు. మరోవైపు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మాజీ ఎంపీ కొత్తపల్లి గీత తెలిపారు. అనైతిక, అప్రజాస్వామిక దాడి గర్హనీయమని కొత్తపల్లి గీత అన్నారు.చంద్రబాబు కంటతడి పెట్టడం తనన్నెంతో కలచివేసిందని గీత పేర్కొన్నారు.