Suryaa.co.in

Andhra Pradesh

పర్యాటక రంగాన్ని పరిశ్రమగా గుర్తించిన సీఎం

– మంత్రులు అనగాని, ఆనం

సూళ్ళూరుపేట : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమాలు జిల్లాలో అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించారు. పర్యాటక రంగ అభివృద్ధికి, సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని…. ఇది మంచి ప్రభుత్వం అని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి అన్నారు. మూడో రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా వారు పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రకృతిని, సంస్కృతిని గుర్తు పెట్టుకోవాలి… పర్యాటకం ను అభివృద్ధి పరచాలి. గత ప్రభుత్వ హయాంలో ఫ్లెమింగో ఫెస్టివల్ ను నిర్వహించలేదని నిర్లక్ష్యం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి విజన్ ఉన్న లీడర్. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి పర్యాటక రంగాన్ని పరిశ్రమగా గుర్తించారని అన్నారు. బడ్జెట్ కేటాయించి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధిలో ఉందంటే మన ముఖ్యమంత్రి ముందు చూపే అన్నారు. ప్రభుత్వం మంచి చేస్తున్నా కూడా ప్రతిపక్షాలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.

పులికాట్ ముఖ ద్వారం వద్ద 100 కోట్లు నిధులతో పూడిక తీత ద్వారా మత్స్యకారులకు మేలు కలిగేలా చర్యలకు ప్రభుత్వం కట్టుబడి అడుగులు ముందుకు వేస్తోందన్నారు. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కట్టుబడి ఉందని తెలిపారు. ఎంఎల్ఏ నెలవల విజయ శ్రీ మాట్లాడుతూ గత నాలుగేళ్ళుగా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించలేదు. 2001 లో టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించి నిర్వహించారన్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ గత నవంబర్ నెలలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించాలని సూచించారని ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో, మీడియా, తదితరుల సహకారంతో ఈ నెల 18 నుండి 20 వ తేదీ వరకు నిర్వహించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, జెసి శుభం బన్సల్, మాజీ పార్లమెంటు సభ్యుడు నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి పరసా రత్నం, మాజీ ఎంయల్సి వాకాటి నారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ శ్రీమంత్ రెడ్డి, శ్రీసిటీ ఎండి రవి సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE