Suryaa.co.in

Andhra Pradesh

సంక్షేమ ఫలాలు అందకపోవడం వలనే నేతన్నల ఆత్మహత్యలు

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

వైసీపీ పాలనలో సంక్షేమ ఫలాలు అందకపోవడం వలనే నేతన్నల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చేనేత రంగం కుదేలయ్యేలా జగన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, రద్దు చేసిన సంక్షేమ కార్యక్రమాల వలన అప్పుల ఊబిలో చిక్కుకొని కుటుంబాలతో కలిసి నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కృష్ణా జిల్లా పెడనలో ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందకపోవడం, అప్పుల భారంతో నేతన్న కాచన పద్మనాభం కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాధాకరం.

టిడిపి హయాంలో నేతన్నకు ఏడాదికి సుమారు 50 వేలకు పైగా వచ్చే ప్రోత్సాహకాలను, రాయితీలను ఆపేసి… రూ.24 వేలను చేతిలోపెట్టి సరిపెట్టుకోమంటున్నారు. అది కూడా సొంత మగ్గం ఉన్న వారికే వర్తించేలా నిబంధనలు పెట్టారు. ఆప్కో కొనుగోళ్లు ఆగిపోయాయి. మజూరీ, రాయితీలు ఆగిపోయాయి. సొంతంగా మగ్గం ఏర్పాటుకు సాయం లేదు. ప్రతి నేత కార్మికునికి నేతన్న నేస్తం అందించడంతో పాటు అదనంగా గతంలో తెలుగుదేశం ఇచ్చిన ప్రోత్సాహకాలు, రాయితీలు కొనసాగించి ఆత్మహత్యలు నివారించాలి.

LEAVE A RESPONSE