– మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
విజయవాడ: “రైతే దేశానికి వెన్నెముక , రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం” అని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ నమ్ముతారు. ఆ మార్గదర్శకత్వంలోనే మామిడి రైతులను గౌరవించి, ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం చురుకుగా స్పందించిందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సంవత్సరం తోతాపురి మామిడి ఉత్పత్తి భారీగా ఉండటంతో ధరలు క్షీణించాయి. దీని వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటువంటి సంక్షోభ సమయంలో ముఖ్యమంత్రి నిర్ణయంతో ప్రభుత్వం తక్షణమే ముందడుగు వేసింది. ప్రతి కిలో మామిడికి రూ.4 సబ్సిడీ అందిస్తూ, రూ.12కి ప్రభుత్వ కొనుగోళ్లను ప్రారంభించింది.
రైతు కష్టాన్ని తెలియని వైసిపి వారికి చేసే విమర్శించే అర్హత లేదని ఎద్దేవా చేశారు. రైతు కుటుంబం నుండి వచ్చినవాడిగా రైతుల నాడి తెలుసుకునే నాయకుడు చంద్రబాబు అని స్పష్టం చేశారు.