Suryaa.co.in

Andhra Pradesh

మత్స్యకారుల కుటుంబానికి కూట‌మి ప్ర‌భుత్వం అండ

– ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ప‌రిహారం ప్ర‌క‌ట‌న
– ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం
– రాష్ట్ర వ్యవసాయ, మ‌త్స్య‌శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

విజ‌యవాడ‌: జీవ‌న‌భృతి కోసం స‌ముద్రంలో చేప‌లు వేట‌కు వెళ్లిన ఇద్ద‌రు మత్స్యకారులు కోన‌సీమ జిల్లా అంత‌ర్వేది వ‌ద్ద బోటు నుంచి స‌ముద్రంలోకి జారిప‌డి మృతిచెందిన కృష్టాజిల్లా నాగాయిలంక మండ‌లంకు చెందిన ఇద్ద‌రు, నాగిడి రాము, గుల్ల‌దామోద‌ర గ్రామం, త‌మ్ము పోతురాజు, సంగ‌మేశ్వ‌ర గ్రామానికి చెందిన మత్స్యకారుల కుటుంబాల‌కు కూట‌మి ప్ర‌భుత్వం అండగా నిలిచింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవతో ప్రభుత్వం నుంచి పరిహారాన్ని ప్రకటించారు .

రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు, మత్స్యశాఖ నుంచి రూ. 5 లక్షలు పరిహారం, మొత్తంగా ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు అందించనున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. మృతుని కుటుంబాల‌ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని, మత్స్యకారులకు ఎప్పటికి కప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇచ్చి ప్రమాదాలు జరగకుండా తీసుకువాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించాలని మత్స్యశాఖ అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.

LEAVE A RESPONSE