– 10 జిల్లాల్లో ‘సాగు’ బాగులేదు
– చేయూత లేకుంటే రైతు అప్పులపాలు
– ఎంవీఎస్ నాగిరెడ్డి హెచ్చరిక
విజయవాడ: రాష్ట్రంలో అనావృష్టి, అతివృష్టితో తీవ్ర ఒడిదుడుకులకులోనై ఖరీఫ్ సీజన్ సాగు నడుస్తూ 12 వారాలు పూర్తి అయింది. 10 జిల్లాలలో సాగు చాలా వెనుకబడి ఆందోళనకరంగా ఉన్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ సభ్యుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఖరీఫ్ మొత్తం జరగవలసిన సరాసరి సాగు 31.15 లక్షల హెక్టర్లు అయితే ఈ నెల 27 వరకు జరిగిన సాగు 22.12 లక్షల హెక్టర్లు (71%). రాష్ట్రంలో 30 ఆగస్టు వరకు కురవాల్సిన సరాసరి సాధారణ వర్ష పాతం 415.11 మి.మీ.
శనివారం వరకు కురిసిన సరాసరి వర్షం 394.46 మి.మీ. లోటు వర్షం -4.97%. ఎనిమిది జిల్లాల్లో అధిక వర్ష పాతం ప్లస్ +20% కంటే అధికం, మిగిలిన అన్ని జిల్లాలలో సాధారణ వర్ష పాతం మైనస్ -19 నుండి ప్లస్ +19% వరకూ నమోదైనదని తెలిపారు.
సాగు వెనుక బడిన జిల్లాల వారీ, పంటల వారీ సాగు వివరాలు ఇప్పటి వరకూ…
జరగవలసిన సీజన్ అంచనాలో ఈ నెల 27 నాటికి… విశాఖపట్నం 51%(+28.75% వర్షం), అనకాపల్లి 39%(+20.85% వర్షం), బాపట్ల 56%(+22.76% వర్షం), పల్నాడు 51%(+23.86% వర్షం), ప్రకాశం 31%(+25.32% వర్షం), చిత్తూరు 19%(+28.6% వర్షం), వై యస్ ఆర్ కడప 24%, అన్నమయ్య 15%(+10.72% వర్షం), అనంతపురం 64%(+28.69% వర్షం), శ్రీ సత్య సాయి 37%(+8.16% వర్షం), మాత్రమే సాగు జరిగిందని నాగిరెడ్డి పేర్కొన్నారు.
10 జిల్లాలలో వర్ష పాతం బాగానే నమోదైనప్పటికీ సాగు రాష్ట్ర సరాసరి సాగు 71% కంటే చాలా తక్కువ జరిగినది. అందువలననే రాష్ట్ర సరాసరి సాగు కూడా 71% లోనే ఉండిపోయినది. దీనికి కారణం వర్షం ప్రతి వారం సమానంగా డిస్ట్రిబ్యూట్ కాకుండా ఈ నెల 7 వరకూ అనావృష్టి, 8 నుండి అతివృష్టి.. ఈ అతివృష్టి వల్ల సరాసరి వర్షం ప్లస్ లో అధిక వర్షంగా నమోదైనప్పటికీ ఉపయోగం జరగలేదు.
రాష్ట్రం లో 13 జిల్లాలు, (ఉమ్మడి స్రీకాకుళం నుండి ఉమ్మడి కృష్ణ వరకు), శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతరామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్ టి ఆర్ జిల్లా ల లో లలో మొత్తం సీజన్ కు జరగవలసిన సాగు 12.25 ల హెక్టార్లు. అయితే రాయల సీమ లో నాలుగు జిల్లాలు (ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూల్) అనంతపురం, శ్రీ సత్య సాయి, కర్నూల్, నంద్యాల లల లో మొత్తం సీజన్ కు జరగవలసిన సాగు 11.27 ల హెక్టార్లు. ఈ నాలుగు జిల్లాలలో సాగు అనుకూలంగా జరిగితేనే రాష్ట్రం లో సరాసరి సాగు పెరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తు ల దిగుబడులు పెరుగుతాయన్నారు.
2025-26 ఈ ఖరీఫ్ లో కర్నూల్, నంద్యాల జిల్లాలలో వర్ష పాతం కొంత మెరుగుగా ఉండటం తో సాగు మెరుగు గానే ఉన్నప్పటికీ ఖరీఫ్ లో మొట్ట మొదట గా మార్కెట్ కు వచ్చే పంట ఉల్లి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లలో సీజన్ మొత్తం జరగ వలసిన సాగు 3.43 ల హె. అయితే 27 వ తారీకు నాటికి జరిగిన సాగు 2.21(64%) ల హెక్టార్లు. శ్రీ సత్య సాయి జిల్లాలో సీజన్ మొత్తం జరగవలసిన సాగు 2.2 ల హె. అయితే 27 వ తారీకు నాటికి జరిగిన సాగు 82,369(37%) హె మాత్రమే.. అన్నమయ్య లో 15%, వై ఎస్ ఆర్ కడప లో 24%, చిత్తూరు లో 19% మాత్రమే ఇప్పటికి సాగు జరగడంతో ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే రైతులు తీవ్రం గా నష్టపోతారని హెచ్చరించారు.
ఈ నెల ఏడోతేదీ వరకు వర్షాభావం వలన ఈ నెల ఎనిమిది నుండి అధిక వర్షాల వలన వేరుశనగ, మినుం, ప్రత్తి, వరి పైరులు కొన్ని ప్రాంతాలలో దెబ్బ తిన్నాయి. రాయలసీమలో సాగు జరిగే వేరుశనగ జరగవలసిన సాధారణ సాగు కంటే చాలా తక్కువ జరిగినది. వేరుశనగ ఈ ఖరీఫ్ లోసాగు అంచనా 4.97 లక్షల హెక్టర్లు.. 27/8/2025 నాటికి జరిగిన సాగు కేవలం 1.68 (34%) లక్షల హెక్టర్లు మాత్రమే..మొత్తం నూనె గింజలసాగు 37%, మినుము 52% మాత్రమే..జరిగినవి..ఇక వేరుశనగ సాగు జరిగే అవకాశం లేదు. రాష్ట్రం లో ప్రధాన పంటలలో ఒకటైన వేరుశనగ సాగు గణనీయంగా తగ్గటం చాలా ఆందోళనకరం.. సాగు జరిగిన వేరుశనగ, మినుం కొంత భాగం అనా వృష్టి, అతి వృష్టికి దెబ్బ తిన్నాయి. వేరుశనగ,కంది, ప్రత్తి పంటలకు దరిదాపుగా విత్తే సమయం అయిపోయిందని తెలిపారు.
సాగు తక్కువ జరిగిన జిల్లాలలో వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళిక పై దృష్టి పెట్టలేదు. ఉలవలు, అలసందలు, పెసర, మినుము పంటలు సాగుకు అవకాశం ఉన్నది. ఆ పంటల విత్తనాలు 90% సబ్సిడీపై రైతులకు వెంటనే అందించి భూమి సాగులో ఉండేలా చూడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది..
ఈ ప్రత్యామ్నాయ పంటల సాగు వలకల ముందు పశువులకు పశుగ్రాసం దొరుకుతుంది. వ్యవసాయ కార్మికులు, చిన్న..చిన్న రైతుల వలసలు నిరోధించవచ్చునని అభిప్రాయపడ్డారు. కౌవులు రైతులు, సన్న, చిన్న కారు రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారు. సాగు తక్కువ జరిగిన జిల్లాలలో ఆ ప్రాంతాలకు అనుగుణమైన ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి ఇప్పటికైనా పెట్టాల్సిందిగా అధికార యంత్రంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్టు నాగిరెడ్డి తెలిపారు