Suryaa.co.in

Telangana

కమ్యూనిటీ ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి

– అధికారులకు డిప్యూటీ స్పీకర్ పద్మా రావు గౌడ్ ఆదేశం

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఐదు మునిసిపల్ డివిజన్లలో జీ హెచ్ ఎం సీ చేపట్టిన కమ్యునిటీ ఇంటర్ ఆక్షన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. స్థానిక కార్పొరేటర్ లతో కలిసి ప్రతి రోజు ఎంపిక చేసిన కాలనీలు, బస్తీల్లో విధిగా అధికార యంత్రాంగం పర్యటించి వారి ద్వారా స్థానికుల సాధక బాధకలకు సంబంధించిన వివరాలను తమకు అందించాలని ఆయన బుధవారం ఓ ప్రకటనలో సూచించారు.

సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్దనగర్ డివిజన్ల పరిధులలో 121 బస్తీలు, కాలనీలలో జీ హెచ్ ఎం సి తో పాటు వివిధ విభాగాల అధికారులు సంయుక్తంగా పర్యసిన్హేలా ఈ కమ్యూనిటీ ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు అయన తెలిపారు.

మల్టీ-డిసిప్లినరీ ఫీల్డ్ లెవల్ టీమ్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా స్థానిక కార్పొరేటర్లు కుడా అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారని తెలిపారు. తాము వివిధ సందర్భాల్లో సికింద్రాబాద్ పరిధిలోని దాదాపు అన్ని బస్తీలు, కాలనీల్లో విస్తృతంగా పర్యటించి, స్థానికుల అవసరాలను తెలుసుకొని వివిధ సదుపాయాలని కల్పించేందుకు నిధులను కుడా మంజూరు చేసినట్లు పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు.

తాజా గా అధికార యంత్రాంగం నిర్వహించ నున్న ఈ పర్యటనలు క్షేత్రస్థాయిలో ఫిర్యాదులను సమర్థవంతంగా మరియు సమయానుకూలంగా పరిష్కరించడానికి ఉప కరిస్తాయని, స్థానిక బస్తీ/కాలనీ సంఘాల తో సమన్వయము ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. జీ హెచ్ ఎం సీ తో పాటు జలమండలి, విద్యుత్, వైద్య, పోలీస్ విభాగాలను కూడా ఈ క్షేత్ర స్థాయి పర్యటనలలో భాగస్వామ్యం చేయనున్నట్లు పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. — డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్ గారి సికింద్రాబాద్ క్యాంపు కార్యాలయం ద్వారా తేది 3rd మే 2023 నాడు జారిచేయబడింది.

LEAVE A RESPONSE