– అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్
విశాఖ: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఎంవీవీ ఇంటిపై జరుగుతున్న ఈడీ సోదాలు ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఇంకా కొనసాగుతాయని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చెప్పారు. వైసీపీ నేతలు దోచుకున్న సొమ్మంతా కక్కించి, ప్రజల సంక్షేమం కోసం వినియోగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వైసీపీ నేతల అక్రమార్జనసై సీబీఐ, ఈడీలకు తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. త్వరలోనే జగన్ తో పాటు ఇతర వైసీపీ అక్రమార్కుల అవినీతి భాగోతాలన్నీ బయటపడతాయని అన్నారు.