Suryaa.co.in

Andhra Pradesh Political News

నాటి ముచ్చట్లు.. భోజనాలపై కామ్రేడ్ సుధాకర్

(బాబు.బి)

వై.ఎస్. రాజశేఖరరెడ్డిని రాష్ట్ర ప్రజలు విశ్వసించలేదు. నక్సలైట్లను కూడా ఆయన నమ్మించారు (విరసం నుండి రాడికల్స్ వరకు భూమన బ్రదర్స్, చెవిరెడ్డి వంటి వారు పూర్వాశ్రమంలో ముసుగులుగా చొప్పించబడ్డారు). చివరకు, తన కుటుంబ నేపథ్యంగా ముద్రపడిన ఫ్యాక్షన్ ముద్రను కడుక్కోవడానికే ఆయన పాదయాత్ర చేశారు.

వై.ఎస్. రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక, 2004లో నక్సలైట్లను చర్చలకు ఆహ్వానించారు. ఆ చర్చల కోసం వచ్చిన సందర్భంలోనే, ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన కామ్రేడ్ సుధాకర్ మాట్లాడిన మాటలు ఇవి. అయితే, ఆ చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత, వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో అనేక నక్సల్ దళాల ఆచూకీ తెలిసి, ఎన్‌కౌంటర్లలో చాలామంది నక్సలైట్లు మరణించారు.

అలిపిరిలో చంద్రబాబుపై 24 బాంబుల క్లేమోర్ మైన్స్ దాడికి స్కెచ్ వేసి ఉపయోగించిన నక్సలైట్ నాయకులు ఇటీవలి కాలంలో మరణించారు. ఆ బ్లాస్ట్ కోసం వచ్చిన వారికి వైకాపా నాయకుడు, పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి బ్రదర్స్ భోజన ఏర్పాట్లు చూశారు. దాడి జరిగిన వెంటనే వై.ఎస్. రాజశేఖరరెడ్డి లుంగీలో వచ్చి, భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి తిరుపతిలో నిరసన తెలపడం గమనార్హం.

నక్సల్స్, మార్కిస్టు కామ్రేడ్స్ ఎన్నో భూపోరాటాలు చేశారు. ప్రముఖుల పొలాల్లో కూడా జెండాలు పాతారు. ఆశ్చర్యంగా అటు చిత్తూరు, అనంతపురం, కర్నూలు నల్లమల ఎన్నో దళాలు వున్నా.. సంధింటి వారు ఆక్రమించిన ఇడుపులపాయ నుండి కడపలో ఎన్నో వేల ఎకరాలలో ఒక్క ఎకరాలో కూడా ఎర్రజెండా ఎగరలేదు!

విరసం నుండి రాడికల్స్ వరకు సంధింటి నాటకాలలో ఎన్నో పాత్రలు. అవసరాల కోసం చొప్పించిన, ప్రోత్సహించిన పాత్రలు ఎన్నో ఎన్నెన్నో. నాస్తిక వాదం నుండి రాయలసీమ ఆరాటాల వరకు, మొన్నటి మూడు రాజధానుల నుండి పేదలు పెత్తందార్లు లాంటి ఎన్నో సిద్ధాంతాలు రాద్ధాంతాలు పుడుతుంటాయి, కొన్ని రాయలసీమ లాంటివి మళ్లీ మళ్లీ అవసరం అయినప్పుడల్లా కొత్తపాత్రలతో రంజింపజేస్తూ వుంటారు. చివరికి కాలగర్భంలో కలిసిపోతుంటారు.

LEAVE A RESPONSE