Suryaa.co.in

Telangana

కమీషన్ల ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం

– మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి

హైదరాబాద్: నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లు ఉంది. క్యాబినెట్ మీటింగ్ పై ప్రజలు ఆశతో ఎదురుచూశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది.
ఎన్నికల్లో గ్యారెంటీల పేరుతో గ్యారెంటీ కార్డులు ఇచ్చారు.

మూడు సార్లు ఇవ్వాల్సిన రైతుబంధు ఒక్కసారి మాత్రమే ఇచ్చారు. ఎన్నికల సమయంలో రైతుబంధు రైతులకు ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ కాళేశ్వరం కట్టారు.
కమీషన్ల ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. కోతికి పుండు అయితే నాకి ,గోకి ఒళ్ళంతా పాడుచేసుకున్నట్టు ఉంది మేడిగడ్డ పై రేవంత్ ప్రభుత్వం తీరు.

మూడు డీఏలు ఇవ్వాలి: బీ ఆర్ ఎస్ నేత జి .దేవీప్రసాద్

క్యాబినెట్ మీటింగ్ లక్షలాది ఉద్యోగులను తీవ్రంగా నిరాశపరిచింది. కేబినెట్ భేటీ గుట్టను తవ్వి గులకరాయి ని కూడా తీయలేదు. ఐదు డీఎలు పెండింగ్ లో ఉంటే ఇప్పుడు ఒక్కటే ఇస్తామని చెప్పారు. ఇంకో డీఏ ఆరు నెలల తర్వాత ఇస్తామని చెప్పిన ప్రభుత్వం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఎక్కడా లేదు

కేసీఆర్ 72 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు 11వేల కోట్లు బకాయిలు రావాలి. రిటైర్మెంట్ ఉద్యోగులకు ప్రతి నెల 700 కోట్లు ఇస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. పీఆర్సి ఊసే కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తడం లేదు. రిటైర్మెంట్ ఉద్యోగులకు 11 వేల కోట్ల బకాయిలు రెండు,మూడు విడతల్లో చెల్లించాలి. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలను పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలి

రేవంత్ రెడ్డి పాలనలో ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. పాత పింఛన్ విధానం తెస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు 9 డీఎలు పెండింగ్ లోపెడితే బుద్ధి చెప్పారు. ఉద్యోగులకు వెంటనే మూడు డీఏలు ఇవ్వాలి. ఉద్యోగులకు హెల్త్ స్కీం అమలు చేయాలి

కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర :బీ ఆర్ ఎస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ …

క్యాబినెట్ మీటింగ్ లో గోదావరి,బనకచర్ల పై చర్చించలేదు. తెలంగాణ ప్రయోజనాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వరద జలాల పేరుతో 200 టీఎంసీల గోదావరి నీళ్లను చంద్రబాబు నాయుడు ఏపీకి తరలించే కుట్ర జరుగుతోంది క్రుష్ణా నదీ జలాల్లో జరిగినట్లే గోదావరిలోను నీటి దోపిడీకి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు.

బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పర్మిషన్లు చంద్రబాబు తీసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది. మోదీ,చంద్రబాబు నాయుడు,రేవంత్ రెడ్డి ఒక్కటై తెలంగాణపై కుట్రలు చేస్తున్నారు.ఈ ప్రెస్ మీట్ లో మన్నె గోవర్ధన్ రెడ్డి ,బీఆర్ ఎస్ వి నేత దిలీప్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

LEAVE A RESPONSE