Suryaa.co.in

Telangana

పాలమూరుకు శాపం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు

– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్ : పార్లమెంట్ సాక్షిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా ఇవ్వమని కేంద్రం ప్రకటించడంపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. పాలమూరు బిడ్డననే రేవంత్ రెడ్డి ఏడాదిగా పాలమూరు ఎత్తిపోతల పనులను పడావుపెట్టాడు.

31 సార్లు ఢిల్లీకి వెళ్లినా రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా పాలమూరు ఎత్తిపోతల గురించి కేంద్రాన్ని అడిగిన పాపాన పోలేదు. ఏడాదిగా ఏపీ అక్రమంగా నీళ్లను తరలిస్తున్నా సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యలు శూన్యం. 90 శాతం పూర్తయిన పాలమూరు ఎత్తిపోతలలో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయకుండా రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.

12 మంది ఎమ్మెల్యేలను గెలిపించినందుకు కాంగ్రెస్, ఒక ఎంపీని గెలిపించినందుకు బీజేపీ పాలమూరు ప్రజలకు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ? పాలమూరు సభలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా ఇస్తానన్న ప్రధాని మోడీ మాట తప్పాడు.

ఏపీలో పోలవరానికి ఆర్థికసాయం, కర్ణాటకలో అప్పర్ భద్రకు జాతీయహోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపింది.

LEAVE A RESPONSE